ఆప్టికల్ ఇల్యూషన్ (Optical Illusion) అని పిలిచే ఈ చిత్రాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఇవి చిత్రాలు లేదా వీడియోల ద్వారా మనల్ని గందరగోళానికి గురిచేస్తాయి. మనం నిజంగా ఉన్నదానికంటే భిన్నమైన అనుభూతిని కలిగించేవి. సాధారణంగా మన కళ్ళు మన మెదడు (Brain) కు సమాచారాన్ని పంపినప్పుడు అది జరగగలిగేది పసిగడుతుంది. మనల్ని నమ్మేలా చేస్తుంది. అంతేకాదు, వాస్తవికతకు అనుగుణంగా లేని విషయాన్ని గ్రహించేలా మనల్ని మోసం చేస్తుంది. ఇది దాదాపు ఇల్యూషన్ లో పడేస్తుంది. ఇంగ్లీష్ లో 'ఇల్యూషన్' అనే పదం లాటిన్ పదం ఇల్లూడోర్ నుండి వచ్చింది. దీని అర్థం "అనుకరించడం". ఈరోజు ఇంటర్నెట్లో అనేక రకాల ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇవి అంతగా వైరల్ కావడానికి కారణం దానిపై ఉన్న ఆసక్తి.
అందుకే.. మీ ఆసక్తిని గమనించిన మేం.. ఓ ఇంట్రెస్టింగ్ ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్ ను మీ ముందుకు తీసుకువస్తున్నాం. మీరు ప్రస్తుతం చూస్తున్న సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పై చిత్రం మనసును ఆహ్లాదాన్ని పరిచే విధంగా ఉంది. భూమి మరియు పచ్చదనం చుట్టూ ఉన్న నీటి అందమైన నేపథ్యాన్ని చూపుతుంది.
డజన్ల కొద్దీ ఫ్లెమింగోలు ఈ చిత్రంలో ఉన్నాయ్. అయితే, ఇందులో ఒక హిప్పో నీటిలో దాక్కుని ఉంది. ఒక హిప్పో చాలా పెద్దదని మనకు తెలుసు. కాబట్టి.. ఈ చిత్రంలో దాగిన హిప్పోను మీరు 60 సెకన్లలోపు కనుగొంటే, మీ మెదడు తెలివిగా ఉందని మీరు గ్రహించవచ్చు. కానీ, చాలా మందిని తికమక పెట్టే చిత్రం ఇది.
ఈ చిత్రంలోని ప్రకృతి దృశ్యం అందంగా ఉంది కానీ అందులో హిప్పో దాగి ఉంది. ఒక్కోసారి ఏదో ఒకటి చూస్తూ కళ్లను తడుముకుంటూ వెనక్కి తిరిగి చూసి కంగారు పడతారు. దానికి కారణం మీరు బహుశా ఆప్టికల్ భ్రమతో మోసపోయి ఉండవచ్చు. హిప్పోపొటామస్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద జంతువు. హిప్పోపొటామస్ను నీటి గుర్రం, నీటి ఏనుగు అని కూడా పిలుస్తారు.
ఇది కూడా చదవండి : మీకుంది 30 సెకన్ల సమయం.. ఈ చిత్రంలో దాగి ఉన్న పిల్లిని మీరు కనుగొనగలరా?
సెమీ-ఆక్వాటిక్ అంటే నీటిలో, భూమి మీద జీవించే జంతువుగా హిప్పోపొటామస్కు పేరు. టిలో నివసించే జంతువుగా పేరున్నా హిప్పోపొటామస్కు ఈత పూర్తిగారాదు. నీటిలోపల నిద్రపోయే అలవాటున్న హిప్పో నిద్రలేవకుండానే ప్రతీ 3 నుంచి 5 నిమిషాలకోసారి శ్వాస పీల్చుకోవడానికి నీటిపైకి వస్తాయంటే ఆశ్చర్యమే.
పగలు చల్లగా ఉండేందుకు హిప్పోలు సరస్సులు, నదుల్లో తిరుగుతుంటాయి. హిప్పో శరీరం నుంచి ఎరుపు రంగులో వచ్చే చెమట ఎండవేడిని తట్టుకునేందుకు ఉపయోగపడుతుంది. నీటినే తన సామ్రాజ్యంగా భావిస్తాయి హిప్పోలు. అందుకే అవి నివసించే ప్రాంతాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తాయి. నీటిలోనే పిల్లల్ని కంటాయి.
అలాంటి పెద్దదైన హిప్పోను ఈ చిత్రంలో నిమిషంలోపు చాలా మంది కనుగొనలేకపోయారు. అయితే, మీరు దిగులు చెందొద్దు. హిప్పోను చూడటంలో మీకు సహాయపడే సూచనలు ఇక్కడ ఉన్నాయ్. ఫోటో యొక్క కుడి దిగువన ఉన్న నీటిలోకి జాగ్రత్తగా చూడండి. నీటిలో మునిగిఉన్న హిప్పో చెవి మరియు కళ్లు నీటి నుంచి బయటకు రావడం మీరు చూడొచ్చు. మీరు నిజంగానే 60 నిమిషాల్లో ఈ పజిల్ పూర్తి చేస్తే మీకన్నా తోపు మరెవ్వరూ లేరు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Viral image, VIRAL NEWS, Viral photo, Viral photos