హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Male Fertility: మగవాళ్లలో సంతానోత్పత్తి సమస్యలు ఎందుకు వస్తాయి? పురుషులు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

Male Fertility: మగవాళ్లలో సంతానోత్పత్తి సమస్యలు ఎందుకు వస్తాయి? పురుషులు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Male Fertility: సంతానప్రాప్తి కలగాలంటే ఆడవారిలాగే పురుషులు కూడా సమాన బాధ్యత వహిస్తారు. మగవారు (Males) మాత్రం సంతానం కలగచేసే సామర్థ్యం తమలో ఉందో లేదో చెక్ చేయించుకునేందుకు చాలా భయపడుతుంటారు.

మహిళల్లో సంతాన సామర్థ్యం (Fertility) గురించి నిర్మొహమాటంగా మాట్లాడటం సమాజంలో సాధారణమే. మామూలుగా స్త్రీలు సంతానోత్పత్తి పరీక్షలకు హాజరయ్యేందుకు ఏ మాత్రం సిగ్గు పడరు. కానీ మగవారు (Males) మాత్రం సంతానం కలగచేసే సామర్థ్యం తమలో ఉందో లేదో చెక్ చేయించుకునేందుకు చాలా భయపడుతుంటారు. ఒకవేళ తమలో పునరుత్పత్తి సామర్థ్యం లేదని తేలితే నలుగురు నవ్వుతారేమో అని, అత్తింట్లో మర్యాద పోతుందేమోనని, సూటిపోటి మాటలు పడాల్సి వస్తుందేమోనని వణికిపోతుంటారు. అయితే సంతానప్రాప్తి కలగాలంటే ఆడవారిలాగే పురుషులు కూడా సమాన బాధ్యత వహిస్తారు.

వారి లైంగిక ఆరోగ్యం వారి భాగస్వామికి చాలా ముఖ్యం. కాగా జూన్ 13న అంతర్జాతీయ పురుషుల ఆరోగ్య వారోత్సవం (International Men’s Health Week) ప్రారంభమైంది. ఈ సందర్భంగా లైంగిక రుగ్మతలను నివారించడంలో మగవారికి సహాయపడే పురుషుల సంతానోత్పత్తి వివరాలు, స్పెర్మ్ కౌంట్ సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మగ వంధ్యత్వానికి (Male Infertility) కారణాలు

ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ మయో క్లినిక్‌లోని ఒక నివేదిక ప్రకారం, ప్రతి 7 జంటలలో 1 జంట సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. వివిధ కారణాల వల్ల పురుషులలో సంతానలేమి (Infertility) సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిలో ఒకటి ప్రధానంగా తక్కువ స్పెర్మ్ కౌంట్ లేదా వీర్యంలో శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉండటం. అనారోగ్యాలు, గాయాలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, పేలవమైన జీవనశైలి, ఇతర అంశాల కారణంగా మగవారిలో స్పెర్మ్ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

కొన్నిసార్లు, పురుషులు వీర్యస్కలనం చేసేందుకు వీలు లేకుండా అడ్డంకి ఏర్పడుతుంది. దీని కారణంగా వీర్యం ప్రవాహం సాధ్యం కాదు. ఈ పరిస్థితిని స్కలన వాహిక అవరోధం అంటారు. అజూస్పెర్మియా అనే మరో అరుదైన పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తుంది. అజూస్పెర్మియా సమస్యతో బాధపడుతున్న మగవారి వీర్యంలో శుక్రకణాలు బొత్తిగా కనిపించవు. దీనివల్ల వీరి భాగస్వామి అండం ఫలదీకరణం జరగదు. ఫలితంగా పిల్లలు పుట్టరు.

స్పెర్మ్ లేదా శుక్రకణాల ఆరోగ్యం

పురుషులలో ఆరోగ్యాన్ని నిర్ణయించడంలో స్పెర్మ్ (Sperm) హెల్త్ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా ఒక స్ఖలనం వీర్యంలో మిలియన్ల కొద్ది శుక్రకణాలు ఉంటాయి. నార్మల్‌గా ఈ సంఖ్య 15 మిలియన్ల నుంచి 20 మిలియన్ల మధ్య ఉంటుంది. ఈ సంఖ్య కంటే శుక్రకణాలు చాలా తక్కువగా ఉంటే, అప్పుడు ఫలదీకరణం జరిగే అవకాశాలు తగ్గుతాయి.

ఇది కూడా చదవండి : బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ చెడు ఆహారపు అలవాట్లకు టాటా చెప్పండి..

సంఖ్య మాత్రమే కాదు, ఫలదీకరణం కోసం స్త్రీ శరీరంలోకి స్పెర్మ్‌లు ప్రయాణించే విధానం కూడా ముఖ్యమైనది. అండాన్ని చేరుకోవడానికి, శుక్రకణాలు స్త్రీ గర్భాశయం గుండా మెలికలు తిరుగుతూ ఉండాలి. అలానే ఇవి చాలా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే అక్కడి పరిస్థితులకు తట్టుకుని ఇవి అండాన్ని చేరుకోగలుగుతాయి. మరి వీర్యకణాల సంఖ్య పెంచుకోవడంతో పాటు అవి ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

* పురుషులలో సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి మార్గాలు

- సమతులాహారం

మనం తినే ఆహారం మొత్తం ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని నేరుగా ప్రభావితం చేస్తుంది. సంతానోత్పత్తిని పెంచడానికి కూడా పోషకాహారం కీలక పాత్ర పోషించింది. విటమిన్ సి, విటమిన్ డి, జింక్ అధికంగా ఉండే ఆహారాలు తినడం ద్వారా మగవారిలో స్పెర్మ్ కౌంట్‌ పెరుగుతుంది. తత్ఫలితంగా సంతానలేమి సమస్యలు తొలగిపోతాయి.

- వ్యాయామం

సంతానోత్పత్తితో సహా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వ్యాయామం ఉత్తమంగా నిలుస్తుంది. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా, మీరు టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే అన్ని లైంగిక, సంతాన సమస్యలు దూరం అవుతాయి.

- ధూమపానం, మద్యపానానికి దూరం

ఆల్కహాల్, పొగాకు అధిక వినియోగం సంతానలేమి సమస్యలకు దారితీస్తుంది. అధిక మద్యపానం టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాదు, వృషణాల ఈ పరిణామాన్ని తగ్గించి పురుషులలో నపుంసకత్వానికి దారి తీస్తుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Health Tips, Healthy food, Life Style

ఉత్తమ కథలు