Home /News /life-style /

HERE MEET INDIAS FIRST FEMALE FIGHTER JET PILOT AVANI CHATURVEDI RA

ఒంటరిగా యుద్ధ విమానాన్ని నడిపిన మహిళ ఈమె..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అవని చతుర్వేది.. అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా ఈ ధీర వనిత గురించి తెలుసుకుందాం.. కేవలం 24 ఏళ్ళలోనే యుద్ధవిమానాన్ని ఒంటరిగా నడిపి చరిత్ర సృష్ఠించారు.. ఈమె గురించి ఇంకా ఎన్నో విషయాలు ఆసక్తి రేపుతాయి.. మాములు విమానాలు నడపడమంటేనే ఎంతో కష్టంతో కూడాకున్న పని.. కానీ, అవని ఏకంగా యుద్ధవిమానాన్నే ఒంటరిగా నడిపి చరిత్ర సృష్టించిన భారత మహిళ..

ఇంకా చదవండి ...
    అవని చతుర్వేది గురించి చెప్పుకోవాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇండియాలో యుద్ద విమానాలు నడిపే మొదటి ముగ్గురు మహిళల్లో అవని చతుర్వేది ఒకరు. 2016లో విధుల్లో చేరిన అవని.. 2018లోనే 24 ఏళ్ల వయసులోనే యుద్ధ విమానాన్ని మిగ్ 21 బైసన్ విమానాన్ని 30 నిమిషాల పాటు నడిపి చరిత్ర సృష్టించారు. ఆ సమయంలో ఈమెను పొగుడుతూ ఎంతోమంది సెలబ్రిటీలు ప్రశంసలు జల్లుకురిపించారు.
    అవని ఈ రంగం ఎంచుకోవడానికి కారణం వారి కుటుంబసభ్యులే.. తన సోదరుడు కూడా ఆర్మీలోనే లెఫ్టినెంట్ హోదాలో ఉన్నారు. చిన్ననాటి నుంచే కల్పనా చావ్లా అంతటి గొప్ప ఆస్ట్రోనాట్ కావాలని కలలు కనే ఈ యంగ్ పైలట్... ఏపీజే అబ్దుల్ కలాం వంటి వారినే స్పూర్తిగా తీసుకుని ఈ రంగంలోకి వచ్చానని చెబుతున్నారు. 2016 జూన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అవని.. IAF ఎగ్జామ్స్‌లో సత్తా చాటింది. ఆ తర్వాత హైదరాబాద్‌లోనే ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 6 నెలల శిక్షణ తీసుకుంది. స్టేజ్ 3 ట్రైనింగ్ బీదర్‌లో పూర్తి చేసుకుని యుద్ధ విమానాలు నడిపే విభాగంలోకి వచ్చింది.

    ఈ రంగంలో ఇంత ప్రతిభ చూపినందుకు 2018 అక్టోబర్ 7న బనస్థలి విద్యాపీఠ్ తనకి డాక్టరేట్ ప్రధానం చేసింది. ఈ యంగ్ పైలెట్ అభిరుచులకొస్తే.. చెస్, టేబుల్ టెన్నిస్ ఎంతో ఇష్టమని దే విధంగా పేయిటంగ్‌ని కూడా ఎంజాయ్ చేస్తానని చెబుతుంది.
    First published:

    Tags: HUMAN STORY, Women, Women's day

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు