Health : కూరగాయలు పచ్చివి తింటే ప్రమాదమా... ఆయుర్వేదం ఏం చెబుతోంది?

Health Tips : ఉల్లిపాయలు, టమాటాలు, కీర దోసకాయ వంటివి చాలా మంది పచ్చిగానే తినేస్తారు. అలా చేయడం మంచిది కాదని ఆయుర్వేదం అంటోంది. ఎందుకో తెలుసుకుందాం.

news18-telugu
Updated: November 21, 2019, 10:43 AM IST
Health : కూరగాయలు పచ్చివి తింటే ప్రమాదమా... ఆయుర్వేదం ఏం చెబుతోంది?
కూరగాయలు పచ్చివి తింటే ప్రమాదమా... ఆయుర్వేదం ఏం చెబుతోంది?
  • Share this:
Health Tips : కూరగాయలు, ఆకుకూరల వంటివి పచ్చివే తినేయడం ఈ రోజుల్లో డైట్ ట్రెండ్. బరువు తగ్గాలనుకునేవాళ్లు, ఫిట్‌గా ఉండాలనుకునేవాళ్లు... పచ్చి ఉల్లిపాయల స్లైసెస్, పచ్చి టమాటాలు, కీర దోసకాయ లాంటి వాటిని డైరెక్టుగా తింటున్నారు. ఇలా తింటే... మంచి పోషకాలు బాడీకి అందుతాయని వాళ్లు నమ్ముతున్నారు. డైట్ ప్రాక్టీషనర్లు కూడా పచ్చివే తినండి అని వాళ్లను ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే... ఏదైనా ఫుడ్‌ని వేడి చేస్తే... అందులో పోషకాలు తగ్గిపోతాయన్న ఆలోచనే. ఐతే... ఇలా పచ్చిగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినడమే కాదు... రాన్రానూ తీవ్రమైన వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందన్న వాదన తెరపైకి వస్తోంది. దీనికి ఆయుర్వేదంలో ఏం చెప్పారన్నది తెలుసుకోవడం మంచిదే.

ఆయుర్వేదం ఏం చెబుతోంది : ఆయుర్వేదం ప్రకారం అన్ని పదార్థాలనూ పచ్చిగా తినడం మంచిది కాదు. పండ్లు, పప్పులు (జీడిపప్పు, బాదం, కిస్‌మిస్ వంటివి), సలాడ్స్ వంటివి మాత్రమే పచ్చివి తిన్నా ఏమీ కాదు. మిగతా పదార్థాల్ని కచ్చితంగా వండుకొని తినాల్సిందే. ఇలా వండి తింటే రెండు రకాల ప్రయోజనాలున్నాయి.

- వేడిగా ఉండే ఆహారం... పొట్టలో రక్త ప్రసరణ వేగాన్ని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

- వండిన ఆహారం పొట్టలో తేలిగ్గా ముక్కలవుతుంది. పోషకాలు క్రమపద్ధతిలో... శరీరంలో కలుస్తాయి.



సైన్స్ ఏం చెబుతోంది : ఆయుర్వేదమే కాదు... సైన్స్ కూడా అదే కరెక్ట్ అంటోంది. పచ్చివి తినడం కంటే, వండి తింటే... ఎక్కువ ప్రయోజనాలుంటాయని చాలా పరిశోధనల్లో తేలింది. ఆహారాన్ని నీటిలో ఉడకబెట్టడం వల్ల... ఎక్కువ యాంటీఆక్సిడెంట్స్ బాడీకి లభిస్తున్నాయి. అంతే కాదు... పచ్చి కూరగాయలు, పచ్చి ఆకుకూరలూ తింటే... జీర్ణం అవ్వడం కష్టం... అవి అటుతిరిగీ ఇటు తిరిగీ... మూత్రాశయాన్ని నాశనం చేస్తాయని సైన్సం అంటోంది.

ఇదంతా చదివాక... ఇన్నాళ్లూ పచ్చివి తింటున్నామే అని టెన్షన్ పడాల్సిన పనిలేదు. తేలిగ్గా జీర్ణం అయ్యేవి పచ్చివి తిన్నా పర్వాలేదేమో గానీ... మాగ్జిమం వండుకు తింటేనే బెటర్. ఎండాకాలంతో పోల్చితే... శీతాకాలంలో జీర్ణ వ్యవస్థ అంత చురుకుగా ఉండదు. అందువల్ల శీతాకాలంలో కచ్చితంగా ఆహారాన్ని వండుకొని తినడమే బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వర్షాకాలంలో ఎట్టి పరిస్థితుల్లో పచ్చివి తినవద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే... వానాకాలంలో... బ్యాక్టీరియా, వైరస్ వంటివి యాక్టివ్‌గా ఉంటాయి. పచ్చిగా తింటే... అవి డైరెక్టుగా పొట్టలోకి వెళ్లి కాలనీలు నిర్మించుకుంటారు. కూరగాయలు, ఆకు కూరల్ని బాగా కడికి, వండుకొని తినడమే మేలు. తద్వారా అడ్డమైన రోగాలూ రాకుండా జాగ్రత్త పడవచ్చు.

 
Loading...

Pics : హాట్ అందాల విందు చేస్తున్న ఇరాఖాన్




ఇవి కూడా చదవండి :

అయోధ్య తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్? నెక్ట్స్ ఏమవుతుంది?

స్కూళ్లకు సెలవులు ఇవ్వండి... ప్రభుత్వానికి పేరెంట్స్ విజ్ఞప్తి

నేడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాబ్డే ప్రమాణం... ఇవీ కీలక అంశాలు

నేడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం... ఇవీ ప్రత్యేకతలు

Health Tips : గొంతు గరగరగా ఉందా... ఇలా చెయ్యండి చాలు... సమస్య పరార్

 
First published: November 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...