మన లైఫ్‌లో చాలా కెమికల్స్ కీలకపాత్రను పోషిస్తాయి. ఎప్సాం సాల్ట్ రసాయనిక నామం మెగ్నిషియం సల్ఫేట్ . దీన్ని మొదట 16వ సెంచరీలో ఇంగ్లాండ్‌లో కనుగొన్నారు. దీంతో ఎప్సాం సాల్ట్‌ను కాన్సిస్టిపేషన్ సమస్యలకు ఉపయోగిండం మొదలుపెట్టారు. కానీ, ఎప్సాం సాల్ట్ కండరాల, నరాలు పటిష్టంగా ఉండటానికి చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
ఎప్సాం సాల్ట్‌ను కండరాల నొప్పులకు నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేస్తారు. ఎక్కువ శాతం స్నానం చేసే నీటిలో ఈ సాల్ట్ ఉపయోగం అధికంగా ఉంటుంది.
ఎప్సాం సాల్ట్‌ను స్నానపు నీటిలో కలపడం వల్ల ఆ నీటిలోకి మెగ్నిషియం, సల్ఫేట్లు రిలీజ్ అయి, మన శరీరంలోకి గ్రహించబడతాయి.
పొడిబారిన చర్మం వారికి ఎప్సాం సాల్ట్‌తో స్నానం చేయటం వల్ల చర్మం రిపెయిర్ అవుతుంది.
ఇవి ఇతర అనారోగ్య సమస్యలను కూడా దూరంగా ఉంచుతుంది. దురద, చర్మ సమస్యలు, కండరాల నొప్పులు,జాయింట్ పెయిన్స్ వంటి సమస్యలకు ఉపయుక్తంగా ఉంటుంది.
ఎప్సాం సాల్ట్‌ను నోటి ద్వారా కూడా హార్ట్‌బీట్, డయాబిటీస్, స్ట్రాంగ్ బోన్ సమస్యలు ఉన్నవారు తీసుకోవచ్చు.
దీనికంటే కూడా ఎప్సాం సాల్ట్‌ను స్నానం చేసే నీటిలో కలిపి బాత్ చేస్తే శరీరం రిలాక్స్‌గా ఉంటుంది. దీంతో తక్కువ దుష్ప్రభావాలు ఉంటాయి. అలసిపోయిన కండరాలకు ఉపశమనం కలుగుతుంది. ఒత్తిడిని తగ్గించి మరింత విశ్రాంతిని మీకు అందిస్తుంది.
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.