హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Sit Infront of Your Computer: కంప్యూటర్ ముందు కూర్చునేవారు ఇది తెలుసుకోకపోతే నిండా మునిగినట్టే..!

Sit Infront of Your Computer: కంప్యూటర్ ముందు కూర్చునేవారు ఇది తెలుసుకోకపోతే నిండా మునిగినట్టే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉద్యోగుల్లో ఎక్కువ మందికి కంప్యూటర్‌తో విడదీయరాని బంధం ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, కంప్యూటర్‌ ముందు గంటల తరబడి కూర్చోనిదే బతుకు బండి నడవని పరిస్థితి. వేల నుంచి లక్షల్లో జీతాలు తీసుకునే ఉద్యోగుల వరకూ...

  ఉద్యోగుల్లో ఎక్కువ మందికి కంప్యూటర్‌తో విడదీయరాని బంధం ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, కంప్యూటర్‌ ముందు గంటల తరబడి కూర్చోనిదే బతుకు బండి నడవని పరిస్థితి. వేల నుంచి లక్షల్లో జీతాలు తీసుకునే ఉద్యోగుల వరకూ అందరూ దీనిని నమ్ముకున్న వారే. అయితే కంప్యూటర్ ముందు ఎక్కువగా కూర్చోవడం వల్ల కంటిచూపు మందగిస్తుందని తేలింది. అంతేకాదు, ఎక్కువ సేపు అదే పనిగా కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం కూడా ఉందట. గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చునే వాళ్లకి ప్రమాదం ముంచుకొస్తుందట. కంప్యూటర్లను కానీ, టీవీని కానీ అదే పనిగా చూస్తుంటే మీరు పెనం మీద పడినట్లే. గంటల కొద్దీ ఎలక్ట్రానిక్ పరికరాలకు అతుక్కొని కూర్చుంటే రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.

  రెండుగంటల కంటే తక్కువ సమయం కంప్యూటర్లు ఉపయోగించే వారితో పోల్చి చూస్తే ఎక్కువసేపు టీవీలు, కంప్యూటర్లతో సావాసం చేసేవారికి రకరకాల రోగాలు వచ్చే ప్రమాదం అధికంగా ఉన్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. దీనివల్ల వచ్చే రోగాలు కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కూడా హరిస్తున్నాయట. ఈ మరణాలు కూడా మామూలు మరణాలకంటే 48శాతం ఎక్కువగా ఉన్నాయట.

  మరో విషయం ఎలక్ట్రానిక్ వస్తువులకు అంకితమైపోయిన వారు ఎన్ని వ్యాయమాలు చేసినా వేస్ట్ అని కూడా పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కంప్యూటర్ ముందు కూర్చోవడం ఎలాగూ తప్పదు కాబట్టి అదే పనిగా కూర్చోకుండా అప్పుడప్పుడు దాని నుంచి కొద్ది నిమిషాలు దూరంగా ఉండమని వైద్యులు సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల కళ్లకు, మెదడుకు విశ్రాంతి లభించి, కొంత ఒత్తిడి తగ్గుతుందట.

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Health care, Life Style, Work From Home

  ఉత్తమ కథలు