Home /News /life-style /

HERE IS THE TIPS FOR DRESS SELECTION DURING THESE FESTIVAL RNK

Fashion: ఈ ఫెస్టివ్‌ సీజన్‌లో మీరు ఎలిగెంట్‌ లుక్‌తో.. సన్నగా కనబడాలంటే..!

మీరు స్లిమ్‌గా కనిపించాలనుకుంటే.. కేవలం చిన్న ప్రింట్లు ఉన్న బట్టలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి.

మీరు స్లిమ్‌గా కనిపించాలనుకుంటే.. కేవలం చిన్న ప్రింట్లు ఉన్న బట్టలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి.

For elegant look: కొన్నివస్త్రాల్లో కాస్త బొద్దుగా కనిపిస్తారు. దీనికి కారణం మీరు ఎంచకునే స్టైలింగ్‌ లోపమే. వీటిని సరిగ్గా ఎంపిక చేసుకుంటే మన దేశీ వస్త్రాల్లో కూడా సన్నగా, ఫిట్‌గా కనిపించవచ్చు.

నవరాత్రి 2021 Navaratri  వేడుకల్లో మీరు సంప్రాయంగా.. స్టైలిష్‌ లుక్‌ stylish look లో సన్నగా కనిపించవచ్చు. ఇది మీరు ఎంపిక చేసుకునే వస్త్రాలపై ఆధారపడి ఉంటుంది. మహిళలు, అమ్మాయిలకు, చీరలు, సూట్స్, లెహంగాలు మొదటి ఎంపిక. అయితే, చాలామందికి కలిగే సమస్య ఏంటంటే.. భారతీయ వస్త్రాల్లో కాస్త బొద్దుగా కనిపిస్తారు. దీనికి కారణం మీరు ఎంచకునే స్టైలింగ్‌ లోపమే. వీటిని సరిగ్గా ఎంపిక చేసుకుంటే మన దేశీ వస్త్రాల్లో కూడా సన్నగా, ఫిట్‌గా కనిపించవచ్చు. కాబట్టి ఈ నవరాత్రులోల మన భారతీయ వస్త్రధారణలో ఎలా నాజుగ్గా.. స్టైలిష్‌గా కనిపించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రింట్లపై శ్రద్ధ..
మీరు స్లిమ్‌గా కనిపించాలనుకుంటే.. కేవలం చిన్న ప్రింట్లు prints ఉన్న బట్టలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఈ చిన్న ప్రింట్లు మిమ్మల్ని మరింత అందంగా, సన్నగా కనిపించేలా చేస్తాయి. కాబట్టి, ప్రింటెడ్‌ చీరా, లెహంగా, కుర్తా లేదా సూట్‌ ఏదైనా కొనుగోలు చేసేటపుడు చిన్న ప్రింట్లను ఎంచుకోవాలని గుర్తుంచుకోండి.

  ఇది కూడా చదవండి: ఉపవాసంలో ఈ టేస్టీ పీనట్‌ టిక్కీని తయారు చేసుకోండి!


షేప్‌వేర్‌..
డ్రెస్‌ వేసుకునే ముందు లోపల షేప్‌వేర్‌ shape wears ప్రయత్నించండి. ఇది మీ పొట్ట, తొడల భాగం, బ్యాక్‌ కూడా సన్నగా కనిపించడానికి సహాయపడుతుంది. షేప్‌వేర్‌ మీ శరీరానికి సరైన ఆకారాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది.

రంగు..
దుస్తుల కలర్‌ ఎంపికలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. లేత రంగులు మిమ్మల్ని లావుగా చూపిస్తాయి. అందుకే కాస్త డార్క్‌ కలర్స్‌ ఎంపిక చేసుకుంటే.. మీ వెయిట్‌ను తగ్గించి సన్నగా.. నాజుగ్గా ఉండేలా చేస్తాయి.

ఇది కూడా చదవండి: మీ పిల్లల సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌కు ఈ 3 లాంగ్వేజెస్‌ మస్ట్‌!




ప్యాబ్రిక్‌ ఎంపిక..
మీరు ప్లస్‌ సైజ్‌ plus size అయితే.. క్రేప్, సాటిన్, షిఫాన్‌ లేదా జార్జెట్‌ వంటి తేలికైన బట్టలను ఎంపిక చేసుకోండి. ఒకవేళ మీకు పట్టు వస్త్రాలను ధరించాలనిపించినా.. తేలికైన పట్టు అందుబాటులో ఉంటుంది. లైక్రా, స్పాండెక్స్‌ వంటి బట్టలను వేసుకోకండి.

లైన్స్‌..
మీరు సన్నగా.. కాస్త హైట్‌గా కనిపించాలనుకుంటే.. పొడుగు గీతలు ఉండే దుస్తులను ఎంపిక చేసుకోండి. వర్టికల్‌ లైన్స్‌కు దూరంగా ఉండండి. ఎందుకంటే అవి మిమ్మల్ని పొట్టిగా..లావుగా కనిపించేలా చేస్తాయి.

అనార్కలి బెస్ట్‌..
అనార్కలి సూట్టు ఎల్లప్పుడూ మంచి ఎంపిక. శరీరాన్ని సన్నగా కనిపించేలా చేస్తాయి. మీరు దాన్ని ఏ సందర్భంలోనైనా వేసుకోవచ్చు. అంతేకాదు ఏ లైన్‌ కుర్తాలు కూడా బెస్ట్‌ ఆప్షన్‌.

ఇవి వద్దు..
మీరు స్లిమ్‌గా కనిపించాలనుకుంటే.. చీరలు, కుర్తాలు, సూట్లకు కుచ్చుళ్లు లేకుండా చూసుకోండి.

లాంగ్‌ స్లీవ్‌ బ్లౌజ్‌..
మీరు చీరా లేదా లెహంగా ధరించాలనుకుంటే.. లాంగ్‌ స్లీవ్స్‌ ఉండే బ్లౌజ్‌లు ఉత్తమ ఎంపిక. ఇవి మిమ్మల్ని సన్నగా కనిపించేలా చేస్తాయి.
Published by:Renuka Godugu
First published:

Tags: Dussehra 2021, Navaratri, Wearing clothes

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు