హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Friendship: స్నేహబంధం బలహీనపడుతుందని ఎలా తెలుసుకోవచ్చు?

Friendship: స్నేహబంధం బలహీనపడుతుందని ఎలా తెలుసుకోవచ్చు?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కానీ కారణాలు ఏవైనా, కొన్నిసార్లు స్నేహం వికటించే అవకాశం ఉంది. మీ స్నేహ బలం పల్చబారుతుందని గుర్తించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటంటే...

ఎంత బాధలో ఉన్నా సరే.. ప్రాణ స్నేహితులతో పంచుకుంటే ఆ బాధ తగ్గిపోతుందని చెబుతుంటారు. జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. స్నేహితుల తోడు ఉంటే చాలు, ప్రపంచాన్ని జయించిన అనుభూతి కలుగుతుంది. విషయం ఏదైనా సరే.. వారితో కష్టసుఖాలను పంచుకోనిదే నిద్ర పట్టదు. మన జీవితంలో స్నేహానికి అంత విలువ ఉంటుంది. కానీ కారణాలు ఏవైనా, కొన్నిసార్లు స్నేహం వికటించే అవకాశం ఉంది. మీ స్నేహ బలం పల్చబారుతుందని గుర్తించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటంటే...

మాటలు బంద్

ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఫ్రెండ్‌తో చర్చించడానికి మీరు ఇష్టపడట్లేదంటే ఇద్దరి మద్ద బంధం బలహీనపడుతోందని భావించాలి. వారితో సెట్ కాదు అనుకున్నప్పుడు... మీరు వారితో మాట్లాడటానికి కూడా ఆసక్తి చూపరు.

కలవడానికి ఇష్టపడరు

మీ స్నేహితుడిని తరచూ కలవడం, సరదాగా మాట్లాడటం ఒక ట్రీట్ లాగా అనిపిస్తుంది. కానీ ఇద్దరి మధ్య సఖ్యత లేనప్పుడు ఎందుకు ఎదురుపడ్డామనే భావన కలుగుతుంది. వారు మీ పక్కన ఉన్నంత సేపు ఇబ్బందిగా అనిపిస్తుంది.

కోపం

సాధారణంగా స్నేహితుల మధ్య కోపతాపాలకు చోటుండదు. ఒకవేళ కోప్పడినా వెంటనే సారీ చెప్పుకొని కలిసిపోతారు. కానీ స్నేహం సన్నగిల్లుతున్నప్పుడు మాత్రం ఇందుకు వ్యతిరేకంగా అనిపిస్తుంది. వారు మీతో మాట కలిపినా, మీరు వారితో మాట్లాడినా ఏదో ఒక సందర్భంలో చిరాకుగా, కోపంగా అనిపిస్తుంది. మీ స్నేహితులతో చేసే ఎలాంటి చర్చలైనా కోపం తెప్పిస్తాయి.

ప్రవర్తనలో మార్పు

ఒకరంటే ఒకరికి పడనప్పుడు, ఎదుటివారి ప్రవర్తన మారుతుంది. ఒక్కోసారి విచిత్రంగా ప్రవర్తిస్తారు. మీరు మీ స్నేహితుడి గురించి ఆరా తీస్తూనే ఉంటారు. కానీ ఎదుటివారు మాత్రం.. మీరంటే తనకి ఇష్టం లేనట్లు, మీరు తనకు ముఖ్యమైన వ్యక్తి కాదన్నట్లు ప్రవర్తిస్తారు.

ప్రశంసలు ఉండవు

స్నేహితుల మధ్య మంచి బంధం ఉంటే, ప్రతి చిన్న విషయానికి ప్రశంస లభిస్తుంది. కానీ స్నేహం తగ్గితే, వారు ఎంత పెద్ద లక్ష్యం సాధించినా మీరు పట్టించుకోరు. వారిని మెచ్చుకోవాలనే ఆలోచన కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది.

కొత్త విషయాలు పంచుకోరు

ప్రతి చిన్న విషయాన్ని ప్రాణ స్నేహితుడితో పంచుకోవాలనే ఆలోచన మనసులో కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులతో పోలిస్తే స్నేహితులతోనే ఎక్కువ విషయాలు షేర్ చేసుకుంటారు. కానీ స్నేహ బంధం సన్నగిల్లుతుంటే.. వారు మీతో ఏ విషయాలూ పంచుకోరు. మీ స్నేహితుల లైఫ్ అప్‌డేట్‌కు సంబంధించిన వివరాలు ఆలస్యంగా, ఇతరుల ద్వారానే తెలుసుకుంటారు.

సరిగా పట్టించుకోరు

మీరు మాత్రమే వారిని స్నేహితుడిగా భావిస్తే సరిపోదు. ఇద్దరికీ అదే భావన ఉండాలి. వారు మిమ్మల్ని సరిగా పట్టించుకోకుండా, అంటీ ముట్టనట్లు ఉంటే మాత్రం మీరు ఆలోచించాల్సిందే. మీరు మాత్రమే మీ స్నేహితుడిని పలకరిస్తూ, వారి గురించి ఆరా తీస్తూ ఉంటారు. కానీ వారు మాత్రం మీ కోసం అలా చేయరు.

సంభాషణల్లో తేడా

స్నేహం సరిగ్గా లేనప్పుడు ఇద్దరి మధ్య సంభాషణలు అసహజంగా అనిపిస్తాయి. ఫోన్‌ కాల్స్‌లో మాట్లాడినా, వ్యక్తిగతంగా కలిసినా ఇలాగే ఉంటుంది. మీ ఇద్దరి మధ్య సంభాషణలు ఇంతకుముందులా సహజంగా అనిపించవు. ఒకరికి ఒకరు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు అనడానికి ఇదే సూచిక అని చెప్పుకోవచ్చు.

అర్హత లేదనిపిస్తుంది

ఫ్రెండ్‌పై అభిమానం తగ్గిపోయినప్పుడు, మీ స్నేహాన్ని పొందడానికి వారికి అర్హత లేదనిపిస్తుంది. మీరు మీ స్నేహితుడి కోసం ఏ పనీ చేయరు. వారి స్నేహం కోసం ఎలాంటి ప్రయత్నం చేయరు. మీ ప్రేమను పొందే అర్హత వారికి లేదని భావిస్తారు.

First published:

Tags: Friendship

ఉత్తమ కథలు