Britain queen: క్వీన్‌ ఎలిజబెత్‌ II లాంగ్‌ లైఫ్‌ సీక్రెట్‌.. ఈ డ్రింక్‌ ఆమె ఫెవరెట్‌ !

క్వీన్‌ జీవితంలో కూడా ఒడిదుడుకులు ఎదురైన సందర్భలు ఉన్నాయి. ఒక్కోసారి కుటుంబం లేదా తన కిరీటం దేనిని ఎంచుకోవాలో తెలియని పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. కానీ, ఒక్కసారి కూడా ఆమె తడబడలేదు. ఎందుకంటే ఆమెది దృఢమైన మనస్తత్వం.

క్వీన్‌ జీవితంలో కూడా ఒడిదుడుకులు ఎదురైన సందర్భలు ఉన్నాయి. ఒక్కోసారి కుటుంబం లేదా తన కిరీటం దేనిని ఎంచుకోవాలో తెలియని పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. కానీ, ఒక్కసారి కూడా ఆమె తడబడలేదు. ఎందుకంటే ఆమెది దృఢమైన మనస్తత్వం.

  • Share this:
క్వీన్‌ ఎలిజబెత్‌ Queen ellizabeth  II.. 1926 కింగ్‌ జార్జ్‌ VI , క్వీన్‌ ఎలిజబెత్‌ దంపతులకు జన్మించారు. ఈమె నిస్సందేహంగా ప్రపంచంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతలు గాంచిన.. గౌరవ వ్యక్తుల్లో ఒకరు. అంతేకాదు క్వీన్‌ బ్రిటీష్‌ చరిత్రలో సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన ఏకైక చక్రవర్తి. ఆమె పాలనలో యూనైటెడ్‌ కింగ్‌డమ్‌లోని 14 మంది ప్రధానులు పనిచేశారు. 95 ఏళ్లలో కూడా ఆమె తన దేశ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేస్తూ తన రాజవిధులను నిర్వరిస్తూనే ఉన్నారు. ఇన్నేళ్లుగా పట్టువదలని ఆమె సహనం ప్రశంసనీయమైంది. ఎలిజబెత్‌ లైఫ్‌ సీక్రెట్‌ ఎంటని చాలా మందిలో ఆసక్తి ఉంది. అయితే, మీకోసం ఈరోజు క్వీన్‌ ఎలిజబెత్‌ రోజువారీ దినచర్య, నియమావళితోపాటు ఆమె ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణమేంటో అందిస్తున్నాం.

మనం ఖరీదైన ఫుడ్, డ్రింక్స్‌ తీసుకోవచ్చు. కానీ, వాటితో మన ఆరోగ్యానికి ఏ ప్రయోజనం లేకపోతే అవన్ని ఎందుకు? ఈ ఇంగ్లాండ్‌ రాణి ధోరణి కూడా అదే. 1953లో ఆమె బాధ్యతలు తీసుకున్న తర్వాత కుటుంబ బాధ్యతతోపాటు చక్రవర్తి పాత్రను కూడా చేపట్టింది. అప్పటి నుంచి ఆమె మానవజాతి చరిత్రలోనే అనేక విప్లవాత్మక మార్పులను అధిగమించింది. ఈరోజు 95 ఏళ్ల వయస్సులో కూడా రాణి, తల్లి, బామ్మగా తన బాధ్యతు నిర్వర్తిస్తూనే ఉన్నారు.

అయితే, ఈ క్వీన్‌ తన రోజువారీ దినచర్యను చాలా సీరియస్‌గా ఆచరిస్తారట. ఉదయం.7:30 గంటలకు లేవగానే ఒక కప్పు ఎర్ల్‌ గ్రే నుంచి రాత్రి 11 గంటలకు ఒక పుస్తకంతో పూర్తవుతుంది. ఆమె ఎప్పటికప్పుడు తన మీటింగ్, ఈవెంట్‌లు, సామాజిక సమావేశాల్లో కూడా నిర్వర్తిస్తూనే ఉంది. ఒంటరిగా వీలు కలిగితే ఫ్యామిలీతో భోజనం చేయడం అలవాటే.

భోజనం తర్వాత కూడా కాస్త నడిచే అలవాటు కూడా ఉంది.
మధ్యాహ్నం టీ తీసుకోవడం కూడా క్వీన్‌ ఎలిజబెత్‌ దినచర్యలో భాగం. క్రస్ట్‌ లేకుండా శాండ్‌విచ్‌ sandwich  తీసుకోవడం అలవాటు. క్వీన్‌ దినచర్యలో క్రమశిక్షణ మాత్రమే ప్రతిబింబిస్తుంది. బహుశా ఇది ఆమె సుదీర్ఘ జీవితం వెనుక ఉన్న రహస్యం అయి ఉండవచ్చు. ప్రైవేట్‌ క్వార్టర్స్‌లో టీవీ చూస్తూ డిన్నర్‌ చేస్తారు.

క్వీన్‌ ఎలిజబెత్‌ వ్యాయామం, వర్కౌట్స్‌ workouts చేసే సమయం తక్కువే. అయినప్పటికీ ఆమె రోజంతా నడకకు ప్రాధాన్యతను ఇస్తారు. ఆమెకు ఎంతో ఇష్టమైన కార్యక్రమాల్లో పాల్గొనే అలవాటు ఉంది. అంటే రెగ్యూలర్‌ షికారు, గుర్రపు స్వారీ Horse riding, కార్గిస్‌ ఆడటంతో యాక్టివ్‌ ఉంటుంది.

హైపర్‌టెన్షన్‌.. హై బ్లడ్‌ ప్రెషర్‌ను తగ్గించే 7 రకాల ఫుడ్స్‌!అందుకే చాలా మంది ఆమెను ప్రశంసిస్తారు. అంతేకాదు, 1976లో అప్పటికీ ఇంటర్నెట్‌ లేని సమయంలో ఇమెయిల్‌ Email పంపిన మొదటి చక్రవర్తి ఘనత కూడా ఆమె సొంతం. వరల్డ్‌ వైడ్‌ వెబ్‌కు పూర్వం ఉన్న అర్పనెట్‌ ARPANET అనె నెట్‌వర్క్‌ ద్వారా మెయిల్‌ పంపారు. మాజీ చెఫ్‌ డారెన్‌ మెక్‌గ్రాడీ నిర్వహించిన హర్‌ మెజిస్టీ ఇంటర్వ్యూ Her majesty interviewలో తను అప్పుడప్పుడు సాయంత్రం వేళల్లో తనకు ఇష్టమైన జర్మన్‌ స్వీట్‌ వైన్‌ sweet wine ను తీసుకుంటానని చెప్పారు.
Published by:Renuka Godugu
First published: