• Home
  • »
  • News
  • »
  • life-style
  • »
  • HERE IS THE REASON FOR WHY GERMANS LOVE GETTING NAKED IN PUBLIC PLACES MS GH

Germans Love Nudity: పబ్లిక్ ప్లేసులలో జర్మన్లు న్యూడ్ గా ఎందుకు తిరుగుతారు..? ఫ్రీ బాడీ కల్చర్ అంటే ఏంటి..?

ప్రతీకాత్మక చిత్రం

why Germans love getting naked in public places: కొన్ని దేశాల్లో నగ్నంగా ఏమాత్రం కనిపించినా అరెస్టు చేస్తారు.. కానీ జర్మనీలో మాత్రం ఇదంతా ఓ కల్ట్. అసలు వాళ్లు అలా బట్టలిప్పేసుకుని ఎందుకు తిరుగుతారు..? దీని వెనుక కారణమేమైనా ఉందా..? అవును ఉంది.. ఇది చదవండి.

  • News18
  • Last Updated :
  • Share this:
జర్మన్లకు న్యూడిటీ అంటే బాగా ఇష్టమని జర్మనీలో నివసిస్తున్న బయటి దేశస్థులకు చాలా త్వరగానే బోధపడుతుంది. ఇదంతా బయటి వారికి కొత్తగా, వింతగా అనిపించినా, వినిపించినా, కనిపించినా.. తరచూ బీచులు, సౌనా, సన్ బాత్ చేసేవారికి ఇదంతా రొటీన్ అని చెప్పక తప్పదు. జర్మనీ దేశంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో మీకు ఒంటమీద నూలు పోగు లేకుండా సన్ బాత్ చేస్తున్నవారు పెద్ద ఎత్తున కనిపిస్తుంటారు. దీన్ని జర్మన్ ఫిలాసఫీలో Freikorperkultur "ఫ్రీ బాడీ కల్చర్" అంటారు. షార్ట్ గా దీన్ని FKK అని పిలుస్తారు. జర్మన్ డెమాక్రటిక్ రిపబ్లిక్ German Democratic Republic లో నగ్నత్వం బహిరంగంగా అనుసరించే జీవన విధానంగా ఉంది. ఎంతోకాలంగా ఇక్కడ ఇది ప్రాక్టీసులో ఉంది. ఆర్గానిక్ ఫుడ్, సెక్సువల్ లిబరేషన్, ఆల్టర్నేటివ్ మెడిసిన్, సింప్లర్ లివింగ్ క్లోజర్ టు నేచర్ వంటి వాటిలో ఇది కూడా ఒకటన్నమాట. ఇండస్ట్రియల్ మాడర్నిటీకి ఇది పూర్తి విరుద్ధం.

నయా కల్చర్ కు విరుగుడుగా మొదలై..
19వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన నయా కల్చర్ కు పూర్తి విరుద్ధమైనదే న్యూడిటీ. మీకు జర్మనీలోని పలు బహిరంగ ప్రాంతాల్లో FKK ఉన్న బోర్డులు దర్శనమివ్వటంలో ఆంతర్యం ఇదే. మీరు ఎప్పుడైనా జర్మనీకి వెళితే..ఇలా దేవతా వస్త్రాల్లో కనిపించేవారిని చూసి బెదిరిపోకండి. ఇదంతా వారి సంప్రదాయంలో భాగం. బెర్లిన్ సిటీతో పాటు Leibniz Centre for Contemporary History Potsdam పలు పెద్ద నగరాల్లో దీన్ని ఓ సాంస్కృతిక ఉద్యమంలా భావిస్తారు. ఇదంతా జర్మన్ కల్ట్ లో భాగం మాత్రమే.

స్కూల్ ఆఫ్ న్యూడిజం..
1926లో ఆల్ఫ్రెడ్ కోచ్ ప్రారంభించిన "బెర్లిన్ స్కూల్ ఆఫ్ న్యూడిజం" స్త్రీ, పురుషులిద్దరినీ వివస్త్రలుగా ఉండేలా ప్రోత్సహించింది. కేవలం మన బాహ్య శరీరాన్ని ఎటువంటి ఆచ్ఛాదనా లేకుండా బహిరంగంగా తిరగటం వల్ల అది సామరస్యాన్ని పెంపొందిస్తుందని, ప్రకృతిలో ఇలా మమేకం కావటం వల్ల ఆరోగ్యం మెరుగవుతుందని ఆయన బోధించారు. ఇక నాజీల (Nazi) కాలంలో తొలుత ఈ న్యూడిటీని నిషేధించారు. ఇదంతా ఓ అనైతిక చర్యగా నాజీ సిద్ధాంతాలు భావించాయి. జర్మనీ తూర్పు, పశ్చిమ జర్మనీలుగా రెండు ముక్కలయ్యాక మళ్లీ FKK సిద్ధాంతానికి ఆదరణ ప్రారంభమైంది. క్రమంగా ఇలా నగ్నత్వాన్ని "ఫ్రీ మూమెంట్" గా భావించటం మొదలైంది. ముఖ్యంగా కమ్యూనిస్టు ప్రభుత్వ కఠిన వైఖరి, కమ్యూనిస్టు సర్కారు అవలంభిస్తున్న అణచివేత వైఖరితో విసుగు చెందిన తూర్పు జర్మనీ ప్రజలు తమలోని కోపాన్ని, అసహనాన్ని FKK కల్చర్ ద్వారా వెళ్లగక్కుతూ, ప్రశాంతత పొందుతూ, ఇలా ప్రకృతి ఒడిలో సేదతీరేవారు. కానీ 1990లో జరిగిన జర్మనీ ఏకీకరణ తరువాత ఈ న్యూడ్ కల్చర్ మళ్లీ తెరమరుగు అవుతూ వచ్చింది. 2019 వచ్చేసరికి కేవలం 30,000 మాత్రమే ఫ్రీ బాడీ కల్చర్ అనే జర్మన్ అసోసియోషన్లో సభ్యత్వం తీసుకోగా వీరిలో అత్యధికులు 50-60 ఏళ్ల పైబడ్డవారే.

నగ్నత్వం..వారసత్వం కూడానూ..
ఇప్పటికీ జర్మనీలో ఇలాంటి వారు అక్కడక్కడకా కనిపిస్తూనే ఉంటారు. ఇక Nacktbaden.de వంటి వెబ్సైట్లో.. వెల్ ఆర్గనైజ్డ్ సన్ బాత్ న్యూడ్ బీచులు, పార్కుల లిస్ట్ ఉంటుంది. ఏ స్పాల్లోనో, సౌనాలోనే వస్త్రాలు విప్పడం సహజమేకానీ.. ఇలాంటి బహిరంగ ప్రాంతాల్లో వివస్త్రలుగా ఉండటం అనేది ఇక్కడ చాలా కామన్. ఇక బెర్లిన్ లో న్యూడ్ యోగా, వాలీబాల్, బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటివి స్పోర్టింగ్ క్లబ్స్ FSV Adolf Koch కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇక కొందరు పెద్దలైతే బాడీ పాజిటివిటీలో (body positivity) భాగంగా, తమ సిద్ధాంతాల్లో భాగంగా ఈ ఫ్రీ బాడీ కల్చర్ ను తమ తరువాతి తరంవారికి కూడా అలవాటు చేస్తున్నారు. అంతేకాదు శరీరాన్ని కాకుండా వ్యక్తులను చూడాలనే ఇందులోని అసలు తత్వమని చెబుతున్నారు. మీరు మనుషులను నగ్నం చూడటానికి అలవాటు పడితే ఇక ఎలా కనిపిస్తున్నాం, అందంగా ఉన్నామా లేదా, బాహ్య సౌందర్యం వంటివాటివి అసలు ఏమాత్రం పట్టించుకోరు.
Published by:Srinivas Munigala
First published: