నోబెల్ బహుమతి 2021 Nobel prize ని ప్రకటించారు. ఇందులో సాహిత్యం విభాగంలో అబ్దుల్ రాజాక్ గుర్నా Abdul razak gurnah కు అవార్డు దక్కింది. ఈయనకు ‘వలసవాదం ప్రభావాలు, సంస్కృతులు, ఖండాల మధ్య గల్ప్ శరణార్ధులపై’ రాసిన పుస్తకాలకి ఈ అవార్డు లభించింది. గుర్నా టాంజానియాకు చెందిన వారు. ఈయన ఇప్పటి వరకు 10 పుస్తకాలు రాశాడు. ఇవన్ని కూడా వలసవాదం, మూలం, జాతివివక్ష, శరణార్థుల సమస్యలకు సంబంధించినవి. ఆయన 2016లో మ్యాన్ బుకర్ ప్రైజ్ Man booker prize జడ్జిగా కూడా ఉన్నారు. ప్రస్తుతం కాంటేబరీలో నివసిస్తున్నారు. అబ్దుల్ రాజాక్ గుర్నా నవలలు ఏంటో తెలుసుకుందాం.
ఇది గుర్నా తొలి నవల. 1987లో మెమొరీ ఆఫ్ డిపార్చర్ Memory of departure ను ప్రచురించారు. ఇది తూర్పు ఆఫ్రికా తీరప్రాంతాల్లో ఒక నగరం నిర్భందించబడుతుంది. అక్కడి నుంచి తప్పించుకోవాలని హసన్ అనే వ్యక్తి అరబ్ కథ. అతను సంపన్న జీవితం కోసం అక్కడకు వెళ్లాల్సి వస్తుంది.
జీవితంలో అలసిపోయిన దావూద్ అనే వ్యక్తి తన గతాన్ని, వర్తమానాన్ని అంగీకరించడానికి తనకు తానుగా కొన్ని లెటర్లు రాసుకుంటూ ఉంటాడు.
ఇది రచయిత తన నెటివిటీ పై దృష్టి సారించి ఈ నవలను రాశాడు. బ్రిటన్‌లో తన కుటుంబం స్థిరపడటానికి వెళ్లినప్పుడు వారు అనుభవించిన దారుణాలు, ఏమీ తెలియని ఒక గులాబీ రంగు అద్దాలు ధరించిన ఒక యువతి కథ ఇది.
ఈ నవలలో యూసుఫ్ అనే 12 ఏళ్ల అబ్బాయి కథ. అతడిని తండ్రి విక్రయించాడనే విషయం తెలియక, తన మామతో వేరే నగరానికి తోడుగా వెళ్తాడు. మారుతున్న ఆఫ్రికన్ పట్టణ సమాజాన్ని, వలసవాదం, అవినీతి ఎలా వెటాడుతుందో ‘ప్యారడైజ్’లో వివరించాడు. ఈ నవల 1994 బుకర్ ప్రైజ్ సెలక్షన్స్‌కు కూడా వెళ్లింది.
ఒక అనామక ఆఫ్రికన్ యువకుడి కథ. ఇంగ్లాడ్‌కు తప్పించుకుని వెళ్తాడు. చాలా కాలం తర్వాత తన స్వస్థలానికి తిరిగి వెళ్తున్న సమయంలో అతనికి ఎదురైన సమస్యలను ఈ నవలలో కూర్చారు.
2001లో బుకర్ ప్రైజ్‌కు ఈ నవల షార్ట్ లిస్ట్ అయింది. బై ది సీ By the sea అనేది సలేహ్ ఒమర్, లతీఫ్ మహ్మద్‌ల కథ. వారికి గతంలో పరిచయం ఉంటుంది. ఈ తర్వాత ఆంగ్ల పట్టణంలో కలుసుకుంటారు. వారు మీట్ అయిన తర్వాత జరిగిన వృత్తాంతాన్ని ఆద్యంతం పాఠకుడిని భావోద్వేగాల వైపునకు తీసుకెళ్లే అద్భుతమైన కథ ఇది.
ఇది లవ్‌స్టోరీ. హసనాలి అనే వ్యక్తి ఒక యువకుడిని కాపాడతాడు. అతడు అతని కాళ్లపై పడి కృతజ్ఞతలు చెబుతాడు అతడే మార్టిన్ పియర్స్, ఇతను ఓరియంటలిస్ట్. ఇక్కడి నుంచి కథ ప్రారంభమవుతుంది. దీంతో హసనాలి సోదరి, పియర్స్ ప్రేమలో పడతారు. 2006లో కామన్ వెల్త్ రైటర్స్ ప్రైజ్‌కు షార్ట్ లిస్ట్ అయిన నవల ఇది. ముఖ్యంగా ఎడారి వివాదం, పూర్తి గందరగోళం మధ్య నడిచే ప్రేమకథ.
అబ్బాస్ అనే వ్యక్తికి ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది. అతడు చాలా రోజుల వరకు దాన్ని ఎవరికీ చెప్పడు. అతడు పూర్తిగా ఇప్పుడు బెడ్‌కే పరిమితమైపోతాడు. దీంతో అతడిని చూడటానికి పిల్లలు ఇద్దరూ వస్తారు. వారికి తన ఫ్లాష్‌బ్యాక్ గురించి వివరిస్తాడు.
ప్రవాస, వలస, దేశద్రోహులకు సంబంధించిన కథ. సలీం కథ హ్యాపీగా సాగుతున్న అతడి లైఫ్‌లో కాస్త ద్వేషం, అధికార పోరాటాలు, కుతంత్రాలతో కూడిన వృత్తాంతాన్ని వివరిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nobel Prize