హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Common fears in sex: సెక్స్ పట్ల ఆసక్తి లేదా? శృంగారమంటే భయమా? కారణాలు ఇవే..!

Common fears in sex: సెక్స్ పట్ల ఆసక్తి లేదా? శృంగారమంటే భయమా? కారణాలు ఇవే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అన్ని వేళలా శృంగారం అధ్భుతంగా అనిపిస్తుందా అంటే లేదనే చెప్పాలి. ముఖ్యంగా దంపతుల్లో ఇది ఆహ్లాదకరమైన చర్యగా పరిగణించబడుతున్నప్పటికీ చాలా మంది సెక్స్ ఫోబియా తో బాధపడుతుంటారు.

సెక్స్.. ప్రతి ఒక్కరూ కావాలనుకునే అమోఘమైన చర్య. ఇందులో స్త్రీ-పురుషులు స్వర్గ సుఖాలను పొందిన అనుభూతిని పొందుతారు. అయితే అన్ని వేళలా శృంగారం అధ్భుతంగా అనిపిస్తుందా అంటే లేదనే చెప్పాలి. ముఖ్యంగా దంపతుల్లో ఇది ఆహ్లాదకరమైన చర్యగా పరిగణించబడుతున్నప్పటికీ చాలా మంది సెక్స్ ఫోబియా తో బాధపడుతుంటారు. ఈ విషయంలో వారిని నిందిచాల్సిన పనిలేదు. ఎక్కువ మందిలో శృంగారానికి సంబంధించి కొన్ని భయాలు ఉన్నాయి. పరిశోధనలు, అధ్యయనాలు ఈ భయాలను తరచుగా గుర్తించవు. తద్వారా ఇవి దంపతుల లైంగిక జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో సెక్స్ లో ఉండే

సాధారణ భయాల గురించి ఇప్పుడు చూద్దాం.

STD(సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డీసిజెస్) సమస్యలు..

STDలు లేదా హెర్పెస్, క్లామిడియా లాంటి లైంగిక సంక్రమణ వ్యాధుల భయం చాలా మందిలో సాధారణంగా ఉంటుంది. అందువల్ల చాలా మంది వీటి గురించి తెలిసినా తెలియకపోయినా లైంగిక సంబంధాలకు దూరంగా ఉంటారు. మీ భాగస్వామి మిమ్మల్ని పరీక్షించినా పెద్దగా పట్టించుకోరు. దీంతో సెక్స్ కు దూరంగా ఉండేందుకు మొగ్గు చూపుతారు. కాబట్టి మీరు శృంగారాన్ని ప్రారంభించే ముందు కచ్చితంగా మీ భాగస్వామితో దీని గురించి మాట్లాడాలి.

అవాంఛిత గర్భం..

సెక్స్ లో కండోమ్ లు అత్యంత సాధారణమైన రక్షణ కవచాలు. అయితే కండోమ్ ఎల్లప్పుడూ 100 శాతం సురక్షితంగా ఉండవు. శృంగారంలో ఉద్రేకం ఎక్కువైనప్పుడు, కండోమ్ నాణ్యత సరిగ్గా లేనప్పుడు, కొన్నిసార్లు విచ్ఛిన్నమయ్యే అవకాశముంది. ఫలితంగా మీరు వికారమైన అనుభూతి చెందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో శృంగారంలో పాల్గొంటే అవాంఛిత గర్భం వచ్చే అవకాశముంటుంది. కాబట్టి నిరాశను నివారించడానికి కండోమ్ ను సరిగ్గా తీసి, లీకేజి రాకుండా చూసుకోవాలి.

శరీర పనితీరును ఇబ్బంది పెట్టడం..

సెక్స్ అనేది చాలా గజిబిజీగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఆకస్మిక శబ్దాలు, శారీరక ఉద్గారాలు లేదా ద్రవాలను అనుభూతి చెందుతారు. ఇవి చాలా ఎబ్బెట్టుగా, ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఇది శృంగార ప్రక్రియలో భాగం. అంతేకాకుండా ఇది పూర్తిగా సహజమైంది. మీ భాగస్వామితో చర్చించినప్పుడు అపరిపక్వంగా ఉంటుంది. కాబట్టి అంత సరైంది కాదు.

వద్దు అని చెప్పండి..

సెక్స్ లో పాల్గోనేందుకు ముందు ఓ సారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు ఎదుటి వ్యక్తిని పూర్తిగా నమ్ముతున్నారా? ప్రజలు తమ భాగస్వాములను ఆకట్టుకోవడంలో చాలా తీరిక లేకుండా గడుపుతున్నారు. వారు తరచుగా వారి సొంత కోరికలకు ప్రాధాన్యతలను గుర్తించడంలో విఫలమవుతున్నారు. మీ భాగస్వామి మీ కోరికలను గౌరవించడానికి నిరాకరిస్తే అప్పుడు వాటి గురించి స్పష్టంగా తెలుసుకోండి.

ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం...

చాలా మంది సెక్స్ కు దూరంగా ఉండటానికి కారణం ఇతరులు తమ నగ్న శరీరాన్ని అసహ్యించుకుంటారని భావిస్తారు. ఇలాంటి ఆత్మన్యూనత భావాలు సామాజిక తీర్పుల(Societal Judgements) నుంచి ఉత్పన్నమవుతున్నాయి. మనందరిలోనూ అభద్రతా భావం ఉంటుంది. కాబట్టి బెడ్రూంలో సరదాగా ఉండటంపై ప్రధానంగా దృష్టిపెట్టడం మంచిది. ఎందుకంటే మీ భాగస్వాములు(Partners) మీ లోపాలను కాకుండా మీ ప్రేమను గమనించడానికి ఇష్టపడతారు.

సెక్స్ లో అంత ప్రభావవంతంగా లేరని భావిచడం..

శృంగారం విషయంలో ఎవ్వరూ అసమర్థులు కారనే విషయం గుర్తించుకోవాలి. మీకు అనుభవం(Experience) తక్కువగా ఉంటే, శృంగారంలో అంత చురుకుగా లేకపోతే మీరు సాధన కోల్పోయే అవకాశముంది. మీరు ఆ విషయాన్ని తెలుసుకుని మీ భాగస్వామితో కావాల్సిన అంశాలపై మాట్లాడుకుంటే శృంగారం నిజంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందులో ఆనందం పొందుతారు. మీరు ఎప్పటికీ సెక్స్ లో అసమర్థులు కాదని గుర్తుంచుకోవాలి.

First published:

Tags: Sex, Sexual Wellness

ఉత్తమ కథలు