Home /News /life-style /

HERE IS THE FULL DETAILS ABOUT WHAT ARE THE SYMPTOMS OF OMICRON NS GH

Explained - Omicron: ఒమిక్రాన్ లక్షణాలు ఎలా మారుతున్నాయంటే? ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇన్‌ఫెక్షన్ ప్రభావం ఇలా.. తెలుసుకోండి

ఒమిక్రాన్ లక్షణాలు ఎలా మారుతున్నాయంటే? ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇన్‌ఫెక్షన్ ప్రభావం ఇలా..

ఒమిక్రాన్ లక్షణాలు ఎలా మారుతున్నాయంటే? ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇన్‌ఫెక్షన్ ప్రభావం ఇలా..

యునైటెడ్ స్టేట్స్ అంతటా ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో డెల్టా సహా ఇతర కరోనావైరస్ వేరియంట్ల లక్షణాలకు, ఈ కొత్త వేరియంట్ లక్షణాలకు మధ్య తేడాలను గుర్తించలేక అమెరికన్లు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రపంచ దేశాలకు కొత్త కోవిడ్ వేరియంట్ అయిన ఒమిక్రాన్ (Omicron) భయం రోజురోజుకీ పెరుగుతోంది. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ (United States) అంతటా ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో డెల్టా సహా ఇతర కరోనా (Corona) వైరస్ వేరియంట్ల లక్షణాలకు, ఈ కొత్త వేరియంట్ లక్షణాలకు మధ్య తేడాలను గుర్తించలేక అమెరికన్లు ఇబ్బందులు పడుతున్నారు. చాలావరకు PCR, యాంటిజెన్ పరీక్షలు ఒమిక్రాన్‌ను గుర్తించగలవు. అయితే కొన్ని పరీక్షలు మాత్రమే ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించలేవని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ చెబుతోంది. కానీ బాధితులు మాత్రం సొంతంగా తమకు ఏ వేరియంట్‌ సోకిందో తెలుసుకోలేరు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా కొన్ని ఒమిక్రాన్ లక్షణాలను నిపుణులు గుర్తించారు. కానీ అందరిలోనూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని కచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు.

ఉదాహరణకు, దక్షిణాఫ్రికాకు చెందిన అతిపెద్ద ప్రైవేట్ ఆరోగ్య బీమా సంస్థ గత వారం విడుదల చేసిన డేటా ప్రకారం.. ఒమిక్రాన్ సోకిన దక్షిణాఫ్రికా వాసులు ముక్కులు బిగుసుకుపోవడం, పొడి దగ్గు, ఒంటి నొప్పి, ముఖ్యంగా నడుము నొప్పితో పాటు గొంతు నొప్పితో బాధపడుతున్నారని తెలుస్తోంది. అయితే డెల్టాతో పాటు అసలు కరోనావైరస్ లక్షణాల్లో కూడా ఇవన్నీ ఉన్నాయని గుర్తుచేస్తున్నారు పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన నర్సు ప్రాక్టీషనర్ యాష్లే రిట్టర్. ఒమిక్రాన్ కేవలం మూడు వారాలు మాత్రమే ప్రభావం చూపుతుందని ఆమె విశ్లేషిస్తున్నారు. కానీ ఒమిక్రాన్ వేరియంట్, గతంలో వచ్చిన ఇతర వేరియంట్ల లక్షణాల్లో తేడాలు ఉన్నాయని చెప్పడం తొందరపాటు అవుతుందన్నారు. ఒమిక్రాన్ లక్షణాలు డెల్టా లక్షణాలను పోలి ఉండే అవకాశం ఉందని మాత్రం చెప్పారు.
Omicron Cases: అటు చలి.. ఇటు ఒమిక్రాన్.. వణికిపోతున్న ఆ ప్రాంత ప్రజలు.. రికార్డు స్థాయిలో కేసులు..

తేడాలు స్వల్పమే
ఒమిక్రాన్ కూడా గతంలో వ్యాపించిన ఆందోళన రకం వేరియంట్ల మాదిరిగానే వ్యాపించే అవకాశం ఉందంటున్నారు డేవిడ్ జెఫెన్ స్కూల్ ఆఫ్ కాలిఫోర్నియా సంస్థలోని ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఫిజీషియన్ డాక్టర్ ఒట్టో ఓ యాంగ్. కొత్త వేరియంట్ సైతం వేగంగా వ్యాపిస్తోందని గుర్తు చేశారు. ఒకవేళ ఒమిక్రాన్‌కు పాత వేరియంట్లకు మధ్య ఏవైనా తేడాలు ఉన్నా, అవి చాలా తక్కువ మొత్తంలో ఉండవచ్చని యాంగ్ విశ్లేషించారు.  అయితే ఒక ప్రధాన తేడా గురించి యాంగ్ మాట్లాడారు. ఇతర ఆందోళన రకం వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ కారణంగా రుచి, వాసన కోల్పోయే లక్షణం తక్కువగా ఉండవచ్చని చెప్పారు.
AP Corona Update: ఒమిక్రాన్ వణికిస్తున్నా ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు.. రాష్ట్రంలో తాజా అప్ డేట్ ఇదే..!

అసలు SARS-CoV-2 స్ట్రెయిన్ ఉన్న రోగులలో 48% మంది వాసన కోల్పోయారని, 41% మంది రుచిని కోల్పోయారని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే ఒమిక్రాన్‌కు సంబంధించిన డేటా విశ్లేషణ ప్రకారం.. నెదర్లాండ్స్‌లో కొత్త వేరియంట్ బారిన పడిన వ్యక్తులలో కేవలం 23% మంది మాత్రమే రుచి కోల్పోయినట్లు తెలిసింది. కేవలం 12% మాత్రమే వాసన కోల్పోయినట్లు నివేదిక పేర్కొంది. అయితే ఈ తేడాలకు కారణం ఒమిక్రాన్ వేరియంటేనా లేదా టీకా తీసుకోవడమా అనే విషయంపై స్పష్టత లేదు.
Cloth Face Masks: రీయూజబుల్ క్లాత్ మాస్కులు ఎంతవరకు సేఫ్?.. ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు..?

టీకాతో లక్షణాల్లో తేడాలు
వాస్తవానికి కోవిడ్-19 లక్షణాలు వ్యక్తుల వ్యాక్సినేషన్ స్టాటస్‌ను బట్టి మారుతూ ఉంటాయి. మహమ్మారి వ్యాపించినప్పటి నుంచి పరిణామ క్రమాన్ని గమనిస్తున్న న్యూయార్క్ యూనివర్సిటీ మేయర్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌ అసిస్టెంట్ ప్రొఫెసర్ మాయా N. క్లార్క్-కుటాయా ఈ విషయంపై మాట్లాడారు. టీకాలు తీసుకున్న తరువాత డెల్టా లేదా అసలు కరోనావైరస్‌ సోకిన వారిలో తలనొప్పి, సైనస్ ప్రెషర్, సైనస్ నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. అయితే టీకాలు తీసుకోని రోగుల్లో ఫ్లూ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గు వంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు.

ఒమిక్రాన్, ఇతర వేరియంట్ల మధ్య మరో తేడా ఉందంటున్నారు నిపుణులు. ఒమిక్రాన్ ఇంక్యుబేషన్ పీరియడ్ తక్కువగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. డెల్టా వైరస్ సోకిన తర్వాత లక్షణాలు బయట పడటానికి నాలుగు నుంచి ఆరు రోజులు పట్టగా, ఒమిక్రాన్ లక్షణాలు అభివృద్ధి చెందడానికి, అంటువ్యాధిగా మారడానికి, టెస్ట్‌లో పాజిటివ్ రావడానికి కేవలం మూడు రోజులు మాత్రమే పడుతుంది. వేరియంట్ ఉత్పరివర్తనలు మానవ శరీర కణాలకు అటాచ్ అవ్వడానికి, లోపలికి వెళ్లడానికి సహాయపడటం వల్ల ఇలా జరుగుతున్నట్లు విశ్లేషిస్తున్నారు.

డెల్టా కంటే ఒమిక్రాన్ ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత తక్కువగా ఉంటుందా?
దక్షిణాఫ్రికా గత వారం వెల్లడించిన డేటా ప్రకారం.. టీకాలు తీసుకున్న తర్వాత ఒమిక్రాన్‌ సోకిన పెద్దవాళ్లు ఆసుపత్రిలో చేరే ప్రమాదం, కోవిడ్ ఫస్ట్ వేవ్ కంటే 29% తక్కువగా ఉంది. దక్షిణాఫ్రికాలో ఆసుపత్రిలో చేరిన కోవిడ్ రోగులు ఐసీయూలో చికిత్స తీసుకున్న సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయని డేటా వెల్లడించింది. అయితే దక్షిణాఫ్రికా పరిశీలనలు యునైటెడ్ స్టేట్స్, ఇతర దేశాలకు వర్తించకపోవచ్చు.

చాలా మంది దక్షిణాఫ్రికా ప్రజలు ఇప్పటికే కోవిడ్-19 బారిన పడ్డారు. ఆ దేశంలోని ప్రజల సగటు (median) వయసు 27 సంవత్సరాలుగా ఉంది. ఈ రెండు అంశాల కారణంగా US కంటే దక్షిణాఫ్రికా ఒమిక్రాన్‌కు తక్కువగా ప్రభావితమవుతోందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అమెరికన్ల సగటు వయసు 38 సంవత్సరాలుగా ఉండటం గమనార్హం. పిల్లల్లో తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ, ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వేవ్ సమయంలో వారు ఆసుపత్రిలో చేరే అవకాశం 20% ఎక్కువగా ఉందని తాజా డేటా పేర్కొంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Corona, Omicron, Omicron corona variant

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు