అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండే అవకాడో పండు కిరాణా దుకాణాల నుండి సూపర్మార్కెట్ల వరకు అన్ని చోట్లా లభిస్తాయి. దీన్ని వెన్న పండు అని కూడా అంటారు. దీనిలోని అధిక క్రొవ్వు కారణంగా, దీని గుజ్జును చికెన్, ఫిష్, మటన్ కూరలతో పాటు సాండ్ విచ్చెస్, సలాడ్లలో విరివిగా ఉపయోగిస్తారు. అవకాడో పండు గుజ్జును పంచదార పాలలో లేదా పంచదారతో కూడిన నీటిలో కలిపి జ్యూస్గా తీసుకోవచ్చు. దీనిలో ఉండే గుజ్జు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. అంతేకాక, క్యాన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్లను అదుపు చేయడంలో సహాయపడుతుంది. దీనిలోని పొటాషియం రక్త పీడనాన్ని సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అవకాడోలు ఫోలిక్ ఆమ్లాన్ని కలిగి ఉండే అవకాడో విత్తనంతో అనేక ప్రయోజనాలున్నాయి. అందువల్లే, దీన్ని డార్క్ చాక్లెట్, కుకీల తయారీలో కూడా ఉపయోగిస్తారు. కేవలం, 28 గ్రాముల అవకాడో పండ్లలో ఒక జౌన్స్ ఆరోగ్యకరమైన ఫైబర్స్, ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి. అందువల్ల, మీ భోజనానికి పోషకమైన బూస్ట్ ఇవ్వడానికి, మీ వంటకాల రుచిని పెంచడానికి మీ రోజూవారి డైట్ వీటిని జోడించవచ్చు.
అవకాడో ఆరోగ్య ప్రయోజనాలు
అవకాడోలు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి, గుండె జబ్బుల ముప్పును తగ్గించడానికి, మెదడు కార్యకలాపాలను వేగవంతం చేయడానికి ఉపయోగపడతాయి. దీనిలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వుల శాతం, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ బి6లు పుష్కలంగా లభిస్తాయి. దీన్ని అల్పాహారం, భోజనం, విందు ఆహారంలో కలిపి తీసుకోవచ్చు. అవోకాడోస్ వినియోగం మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుందని నిరూపించబడింది.
మీ ఆహారంలో అవకాడోలను ఇలా చేర్చండి
మెరుగైన రుచి కోసం..
అవకాడొ మంచి రుచి కోసం ఉప్పు, మిరియాలను దానిపై చల్లుకొని తినండి. అవకాడోలను ముక్కలుగా చేసి కొద్దిగా ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాలు, బాల్సమిక్ వెనిగర్ను దానిపై చల్లి తీసుకోండి.
టిఫిన్ కు బదులుగా..
మీరు ఉదయాన్నే తీసుకునే అల్పాహారానికి అవకాడోలు మంచి ఎంపిక. మీరు ఒక ఉడికించిన గుడ్డుతో అవోకాడోను కలిపి తినొచ్చు. ఇది మంచి రుచిని అందివ్వడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చుతుంది. గుడ్లకు బదులు మీరు తాజా కూరగాయలు, చికెన్ లేదా పండ్లు వంటి ఇతర పదార్ధాలను కూడా ప్రయత్నించవచ్చు.
శాండ్విచ్గా ఉపయోగపడుతుంది
మీ వంటింట్లో ఉపయోగించే వెన్న, వనస్పతి వంటి ఆరోగ్యకరమైన పదార్థాలను అవకాడోతో భర్తీ చేయడం ద్వారా మీ ఆరోగ్యానికి మంచి చేస్తుంది. అవకాడోలను శాండ్‌విచ్‌లా ఉపయోగించడం ద్వారా మీ భోజనానికి అదనపు విటమిన్లు, ఖనిజాలను జోడిస్తుంది. సలాడ్లలో విరివిగా ఉపయోగించే మాయోకు ఇది మంచి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.
సూప్‌లలో ఉపయోగించొచ్చు
అవకాడో పండ్లను సూప్‌లలో గా ఉపయోగించవచ్చు. దీనికి మరింత రుచిని అందించేందుకు ఆకుపచ్చ పండ్ల భాగాలను కూడా జోడించవచ్చు.
అవకాడో స్మూతీస్గా ఉపయోగించొచ్చు
అవొకాడోలను భోజనానికి ప్రత్యామ్నాయంగా స్మూతీలుగా ఉపయోగించవచ్చు. కాలే వంటి ఆరోగ్యకరమైన ఆకుకూరలు, బెర్రీలు, పైనాపిల్ లేదా అరటి వంటి పండ్లతో అవోకాడోను కలిపి తీసుకోవచ్చు.
గ్వాకామోల్ రెసిపీగా ఉపయోగించవచ్చు
అవకాడోలను గ్వాకామోల్ రెసిపీగా కూడా ఉపయోగించవచ్చు. ఉల్లిపాయ, టొమాటో, కొత్తిమీర, అవోకాడో, జలపెనో, ఉప్పు, వెల్లుల్లి, లైమ్ జ్యూస్ వంటి వాటితో దీన్ని తయారు చేయవచ్చు. ఈ సులభమైన మెక్సికన్ రెసిపీని తయారు చేయడానికి పూర్తిగా పండిన అవోకాడోలను సగానికి ముక్కలు చేసి, వాటిని మిక్సింగ్ గిన్నెలో వేయాలి. దీని తరువాత, పైన పేర్కొన్న పదార్థాలు వేసి కలపాలి. దీంతో రుచికరమైన, గ్వాకామోల్ రెసిపీ సిద్ధమవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health, Health benefits, Health Tips