అసలే కరోనా కాలం.. పైగా ఇది వ్యాధుల వ్యాపిస్తున్న సమయం. ప్రస్తుత పరిస్థితులో ప్రెగ్నెంట్ మహిళలు(pregnant women) సమతూల్యమైన ఆహారం(balanced diet) తీసుకోవడం చాలా ముఖ్యం. గర్భిణులు వారి డైట్లో చేసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన మార్పులు తెలుసుకుందాం.
ప్రెగ్నెంట్ మహిళలు వారు తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ప్రోటీన్, విటమిన్ బీ, కాల్షియం, జింక్, మెగ్నీషియం అధికంగా ఉండే ఫుడ్‌ను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పన్నీర్లో ఇవి పుష్కలంగా ఉంటాయి.
పప్పు దినుసులు..
గ్రీన్ పీస్, బీన్స్, రాజ్మా, చిక్పీస్, పీనట్స్ వంటి ఆహారం తీసుకోవాలి. వీటిలో ప్రోటిన్, కాల్షియం, ఫైబర్, ఐరన్, ఫోలేట్ అధికంగా ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్ వీటిని కచ్ఛితంగా వారి డైట్లో తీసుకోవాలి.
రాగులు..
రాగులు ఏ సందేహం లేకుండా ప్రోటిన్ రిచ్ ఫుడ్. ఇందులో ఐరన్, కాల్షియం, ఫైబర్ ఉంటాయి. ఇవి శిశువు పెరుగుదలకు ఎంతో సహాయపడేవి. అందుకే వైద్యులు గర్భిణీ స్త్రీలకు రాగులను తమ డైట్లో చేర్చుకోమని సలహాలు ఇస్తారు.
దలియా..
ఎక్కువ శాతం ఫైబర్ (fiber) అండే ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల గర్భవతులకు ఎంతో అవసరం. ఇది ప్రెగ్నెంట్ సమయంలో వచ్చే డయాబెటీస్ రాకుండా కాపాడుతుంది.
ఆకుకూరలు..
ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉండే ఆకుకూరలు కూడా ప్రెగ్నెంట్ లేడీస్‌కు మేలు చేసేవే! ముఖ్యంగా పాలకూర, మెంతికూర, మునగాకులో ఎక్కువ శాతం న్యూట్రియేంట్స్తో కూడుకున్నవి. దీంతో కాన్స్టిపేషన్ వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
కోడిగుడ్లు..
కోడిగుడ్లలో ఎక్కువ శాతం కోలిన్ ఉంటుంది. ఇది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు కచ్ఛితంగా గుడ్లను తమ డైట్లో చేర్చుకోవాలి.
పెరుగు..
పెరుగులో కాల్షియం, ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ఇది మంచి పోబెయోటిక్ (probiotic). దీన్ని రాత్రివేళలో తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే.. మధ్నాహ్నం సమయంలో తమ ఆహారంతోపాటు తీసుకోవాలి.
హెల్తీ నట్స్, సీడ్స్..
ఆరోగ్యకరమైన ఆహారమైన నట్స్ అంటే బాదం, జీడిపప్పు, అక్రూట్లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ (omega fatty 3 acids) పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రెగ్నెంట్ మహిళలకు ఎంతో మంచివి.
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.