Turmeric purity: మీరు వాడే పసుపు స్వచ్ఛమైందా? ఇలా కనిపెట్టేయండి!

పసుపు రంగును గుర్తుబట్టేందుకు కొన్ని చిట్కాలతో తెలుసుకోవచ్చు. ఫుడ్‌ అడల్ట్రేషన్‌కు చెక్‌ పెట్టేందుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వివిధ ఆహార పదార్థాలపై పరీక్షలు నిర్వహించి, ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది.

పసుపు రంగును గుర్తుబట్టేందుకు కొన్ని చిట్కాలతో తెలుసుకోవచ్చు. ఫుడ్‌ అడల్ట్రేషన్‌కు చెక్‌ పెట్టేందుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వివిధ ఆహార పదార్థాలపై పరీక్షలు నిర్వహించి, ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది.

  • Share this:
మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే, ఈరోజుల్లో అన్ని కల్తీ జరుగుతున్నాయి. మనం ఉదయమే తాగే పాల నుంచి మొదలవుతున్న కల్తీ నూనె, ఉప్పు, కారం, ఆకుకూరలు ఇలా ప్రతి ఒక్కటిలో కల్తీ జరుగుతుంది. ఈ కల్తీ ఆగడాలకు ఆటకట్టించేందుకే  FSAAI  ప్రజలకు జాగ్రత్త చర్యలు సూచిస్తోంది. అందుకే FSAAI మరోసారి కల్తీ పదార్థాలపై ఉక్కుపాదం మోపడానికి ఒక వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దీంతో మీరు మీ వంటల్లో వాడే పసుపు స్వచ్ఛమైందా? కాదా? అని తెలుసుకోవచ్చు.

పసుపు Turmeric కేవలం వంటల్లోనే కాదు.. గాయాలు అయనపుడు.. ఆధ్యాత్మిక వేడుకల్లో కూడా పసుపుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది లేనిదే ఏ శుభకార్యం జరగదు. అంతగా మన సాంప్రదాయాలతో ముడిపడిపోయింది పసుపు. ఇక చర్మసౌందర్యానికి కూడా పసుపును ఉపయోగిస్తాం. ఇందులో ఉండే యాంటీ ఫంగల్‌ గుణం, చర్మ సమస్యలను దూరం చేస్తుంది.

మన భారతీయ వంటల్లో కచ్ఛితంగా వాడే స్పైస్‌ పసుపు. దీంతో గాయాలను మాన్పించే గుణంతోపాటు వంటల్లో కూడా దీనిది ప్రద్యేక స్థానం. కానీ, ఈ పసుపులో ఏదైనా కల్తీ జరిగితే? అది వంటను కూడా కలుషితం చేస్తుంది. గాయంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీంతో అనేక వ్యాధులకు కారణమవుతుంది. ఇటువంటి పరిస్థితులు ఎదురుకాకుండా ఉండటానికి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఒక వీడియోను షేర్‌ చేసింది.

మీ వంటనూనె ప్యూరేనా? లేదా ఈ నిషేధిత రంగును కలిపారేమో చెక్‌ చేయండి!



కల్తీకి కళ్లేం వేయడానికి ఇప్పటికే సిరీస్‌ను FSAAI ప్రారంభించిన విషయం తెలిసిందే! ‘డిటెక్టింగ్‌ ఫుడ్‌ అడల్లెర’ Detecting foodadutera ద్వారా ఉప్పు, ఆకుకూరల కల్తీని గుర్తించడానికి సులభమైన మార్గాలు తెలియపరిచింది. ఇప్పుడు ట్వీటర్‌లో పసుపు స్వచ్ఛతను పరీక్షించే విధానాన్ని షేర్‌ చేసింది.

పసుపు స్వచ్ఛతను పరీక్షించే విధానం..ఇందులో నాలుగు దశలు ఉంటాయి.

  1. ముందుగా గ్లాసు నీరు తీసుకోవాలి.

  2. అందులో కాసింత పసుపు పొడిని కలపాలి.

  3. ఒకవేళ పసుపు కల్తీ చేస్తే.. నీరు మరింత పసుపు రంగులోకి మారి , పసుపు స్థిరంగా ఉంటుంది. ఈ విధంగా పసుపు కల్తీని గుర్తించవచ్చు.

  4. ఒకవేళ మీరు వాడే పసుపు కల్తీ అయి ఉంటే.. దాన్ని వెంటనే మార్చడానికి ప్రయత్నించండి.

Published by:Renuka Godugu
First published: