మెనోపాజ్ సమస్యలను తగ్గించే చిట్కాలు

40ఏళ్లు దాటినా ప్రతి మహిళ మెనోపాజ్‌ని ఎదుర్కొని తీరాల్సిందే. యుక్తవయసులో మన దరిచేరిన పీరియడ్స్ 40ఏళ్లు దాటగానే మనకు దూరమవుతాయి. అయితే.. అదే సమయంలో ఎన్నో శారీరక సమస్యలను మహిళలు అధిగమించాల్సి ఉంటుంది.

Amala Ravula | news18-telugu
Updated: April 21, 2019, 12:36 PM IST
మెనోపాజ్ సమస్యలను తగ్గించే చిట్కాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సాధారణంగా మెనోపాజ్ సమయంలో.. వేడి ఆవిర్లు పుట్టడం, అధికంగా చెమటలు పట్టడం, నిద్రలేమి, ఛాతి తగ్గిపోవడం, జుట్టు రాలడం, లైంగికవాంఛలేకపోవడం, హార్ట్‌బీట్‌ పెరిగిపోవడం వంటి సమస్యలతో మహిళలు సతమతమవుతుంటారు. హార్మన్స్ లెవెల్స్ అస్తవ్యస్తంగా మారడంతో కొంతమందికి సమస్య మరీ తీవ్రంగా ఉంటుంది. మరి వాటికి కారణాలేంటో ముందుగా తెలుసుకోవాలి.

అప్పుడే యుక్తవయసుకి వచ్చిన అమ్మాయిల్లో శరీరంలో వచ్చిన మార్పులని చూసి మురిసిపోతుంది. అవి అలా కొనసాగి మాతృత్వానికి దారితీస్తోంది. అయితే.. ఇది ఊరికే జరగవు కదా.. వాటి వెనుక ఓ రహస్యముంది. అవే హార్మోన్స్. ఇక వాటి గురించి క్లుప్తంగానూ చెప్పాలంటే.. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్‌లు. ఇవి యుక్తవయసులో మనలో చేరి గిలిగింతలు పెట్టి.. వయసు దాటిపోగానే.. వాటి రిలాక్స్ అవుతుంటాయి. ఈ ఫలితమే రుతక్రమం ఆగిపోవడం. దీన్నే మోనోపాజ్ అని అంటారు. ఈ సమయంలో.. ఎన్నో శారీరక సమస్యలను మహిళలను ఇబ్బందులకు గురిచేస్తాయి. వాటిని అదిగమించాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించండి.

* పోషకాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.

* కాఫీ, టీ, మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంతమంచిది.


* వ్యాయామం చేయడం కూడా ఎంతో ముఖ్యం.
* షుగర్ ఉంటే గనుక ఎప్పుడూ కంట్రోల్‌లో ఉంచుకోవాలి
* బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి.* ప్రతి ఆరునెలలకోసారి హెల్త్ చెకప్స్ తప్పనిసరి.
* అధికరక్తస్రావం, గుండె వేగంగా కొట్టుకోవడం, వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుండడం చేస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* మీ సమస్యను బట్టి డాక్టర్స్ ట్రీట్‌మెంట్ ఇస్తారు.
* యోని భాగం ఎక్కువగా పొడి ఇబ్బందిపెడుతుంటే ల్యూబ్రికెంట్స్ వాడాలి. దీంతో ప్రయోజనం లేకపోతే.. వెజైనల్‌ ఈస్ట్రోజెన్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలి.
* ఈ సమయంలో సోయాపాలు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఇది ఎముకలకు బలాన్నిస్తుంది.
First published: April 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు