మీ పిల్లలకు ‘బ్యాడ్‌ టచ్‌’పై అవగాహన కల్పించే బాధ్యత మీదే!

ప్రతికాత్మక చిత్రం

సైకియాట్రిస్టులు పిల్లలు సరిగా తినకపోయినా.. చిరాకు లేదా మానసిక ఆందోళనకు గురైతే.. మీ పిల్లలు కచ్ఛితంగా మానసిక లేదా శారీరక వేధింపులకు గురైనట్లని చెబుతున్నారు. ఇవే సంకేతమన్నారు.

  • Share this:
మన దేశంలో బాలలపై జరుగుతున్న ఆకృత్యాలకు కఠిన చట్టాలు అమలులో ఉన్నా... వారిపై ఆగడాలు ఆగడం లేదు. ఇప్పటికే చాలా మంది బాధితులు ఉన్నారు. కానీ, ఇటీవల ప్రచురించిన ఓ అధ్యయనంలో పిల్లలపై ఆకృత్యాలు తమ కుటుంబాలకు సంబంధించిన వారే అధికమని తేలింది. మీ పిల్లలు ఆడపిల్ల అయినా.. మగపిల్లవాడు అయినా..  బ్యాడ్‌ టచ్‌ Bad touch అంటే ఏంటో తెలపడానికి ప్రయత్నం చేయండి. కొన్ని విషయాలు తెలుసుకుందాం.

బ్యాడ్‌ టచ్‌పై అవగాహన..
సాధారణంగా పిల్లలకు ఏ విషయమైనా వారి చదువు లేదా జ్ఞానం ద్వారా తెలిసిపోతాయి. కానీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌ మధ్య తేడాపై వారికి అవగాహన కల్పించడం తప్పనిసరి అంటున్నారు. ముఖ్యంగా బాడీలో ప్రైవేటు భాగాల గురించి వారికి చెప్పాలి. దీన్ని ఏదైనా బొమ్మలు లేదా ఇతర కార్టూన్స్‌ పాత్రల ద్వారా శరీరంలోని వివిధ భాగాలను పిల్లలకు అవగాహన కల్పించాలి. పిల్లలు వారిపై జరుగుతున్న ఆకృత్యాం ఏమిటో తెలుసుకోలేరు కాబట్టి, ఎవరూ కూడా తమ ప్రైవేటు భాగాలను తాకనియవద్దని, మరొకరి పార్ట్‌లను వీరు తాకవద్దని చెప్పాలి.

పిల్లలతో స్నేహంగా ..
చాలా సందర్భాల్లో పిల్లలు తమ తల్లిదండ్రులతో ఏ విషయాలు పంచుకోరు. ఎందుకంటే వారు ఏవైనా ఇబ్బందులు పడతారేమోనని భావిస్తారు. ఈ భయం నేరస్థులకు పిల్లలపై దాడులు చేయడానికి మరింత ప్రొత్సాహం ఇస్తుంది. ఏమి జరిగినా సరే..మీ పిల్లలకు శరీర భద్రత లేదా శరీర ప్రైవేటు పార్టుల private parts కు ఏదైనా సమస్య వస్తే దాని గురించి ఎల్లప్పుడూ వారి తల్లిదండ్రులతో పంచుకోవాలి. అలా పంచుకోవడం తప్పు కాదని మీరు చెప్పాలి.

ఈ టిప్‌తో పట్టుచీరలు ఎప్పుడూ.. కొత్తవిగా ఉంటాయి!పిల్లలను ఏమీ అనకూడదు..
కొన్నిసార్లు పిల్లలు తమ తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఏవైనా సంఘటనలు పంచుకున్నపుడు వారిని తిడతారు. అలా చేయకూడదు. అది మంచిది కాదు. ఇది మీ పిల్లల జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతేకాదు, అది వారి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మానసిక ఒత్తిడికి లోనవుతారు.

ఏమి చేయాలి?

  1. మీ పిల్లలను తిట్టకూడదు.

  2. వారు ఏదైనా చెప్పడానికి వస్తే.. ఆపే ప్రయత్నం చేయకండి.

  3. ఎప్పుడైనా.. ముభావంగా ఉంటే.. మాట్లడమని పదేపదే బలవంతం చేయకూడదు.

  4. ఏం జరిగిందో మరచిపోమని అనకూడదు. తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకోవాలి.

  5. మీ పిల్లలపై సానుభూతిగా ఉండే ప్రయత్నం చేయండి.

Published by:Renuka Godugu
First published: