HERE IS HOW BOLLYWOOD HERO SHARUKH KHAN AND GOWRI KHAN MET EACH OTHER AND GOT MARRIED RNK
Sharukh khan: ఇది షారుఖ్ – గౌరీల లవ్‌స్టోరీ!
షారుఖ్– గౌరీఖాన్
Sharukh khan lovestory: ఈ బాలీవుడ్ పవర్ఫుల్ కపుల్స్ అయిన షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ల వివాహా బంధం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఇంత బాండ్ ఉన్న జంటను మనం చూడకపోయి ఉండవచ్చు.
ప్రముఖ బాలివుడ్ నటుడ్ షారుఖ్ ఖాన్ Sharukh khan కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయన నటన అంత అద్భుతంగా ఉంటుంది. దీనికి కొన్ని సినిమాలు.. కుచ్ కుచ్ హోతాపై.. కల్హో..నాహో, చక్ దే ఇండియా కొన్ని మచ్చు తునకలు. 1992లో రిషీ కపూర్ సినిమా అయిన దివానాలో రెండో హిరోగా దివ్యభారతి Divya bharathi తోపాటు నటించారు. ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర అతన్ని హిరోగా నిలబెట్టింది. ఎన్నో అవార్డులు అతడిని వరించాయి.
'దిల్వాలే దుల్హానియా లే జాయేగా , మై నేమ్ ఈజ్ ఖాన్, స్వదేశ్' ఓవర్సీస్లో overseas కూడా డబ్బుల వర్షం కురిపించాయి. వారి అభిమానాన్ని కూడా చూరగొన్నారు షారూఖ్. అయితే, ఆయన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆయన సతీమణి పేరు గౌరీఖాన్. వారికి ముగ్గురు సంతానం. ఆర్యన్ ఖాన్ aryan khan , , సుహానా, అబ్రం ఖాన్. అయితే, వీరిది లవ్ మ్యారేజ్ ఈరోజు వారు ఎలా ఒకరిని ఒకరు కలుసుకున్నారు. వారి లవ్‌స్టోరీ ఏంటో తెలుసుకుందాం.
ఎందుకంటే ఈరోజుల్లో భార్యాభర్తల మధ్య ఏమాత్రం గ్యాప్ వచ్చి.. చిన్న గొడవలకే విడాకులు దారితీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అటువంటిది వీరు ఒకే మతం కాకున్నా ఇన్నేళ్లు ఇలా కలిసి ఉండటం ఎంతో ఆదర్శప్రాయం కదా!
ఇక వీరి లవ్‌స్టోరీ.. షారుఖ్ –గౌరీలు మొదటిసారి ఏదో పార్టీలో కలిశారు. అక్కడ మన ఖాన్ గౌరీ చిబ్బర్పై తన దృష్టిని మళ్లించుకోలేపోయాడట. ఆ పార్టీలో పూల్ పక్కనే ఉన్న చైర్లలో ఒకరిని ఒకరు చూసుకుంటూ కోక్ తాగారట. ఆ సమయంలో ఇద్దరికీ కాస్త సిగ్గు ఎక్కువట. ఆ తర్వాత షారుఖ్ ఒకానొక సమయంలో తన ఫ్రెండ్ షాహిన్ అనే అమ్మాయికి కాల్ చేయబోతుంటే పొరపాటున గౌరీకి కాల్ చేశారు.
దీంతో అక్కడి నుంచి వారి ప్రేమ పట్టాలేక్కింది. ఎలాగో మన బాద్షా ప్రెట్టీ పొసెసీవ్. దీంతో వారు పీకల్లోతులో ప్రేమించుకున్నారట. అందరిలాగే వీరి లవ్‌స్టోరీలో కూడా చిన్నపాటి గొడవలు జరిగాయట. ఆ సమయంలో గౌరీ..షారుఖ్‌కు ఏ సమాచారం ఇవ్వకుండానే ముంబై వెళ్లిపోయారట. దీంతో ఖాన్ వాళ్ల అమ్మవద్ద నుంచి రూ.10 వేలు తీసుకుని అతడు కూడా ముంబైకి గౌరీ కోసం వెళ్లాడు. వారు ఆ సమయంలో ఏడ్చి, ఒకరికి ఒకరు సారీలు చెప్పుకుని అర్థం చేసుకున్నారు. ఇదంతా మన రీల్ లవ్‌స్టోరీ మాదిరి జరిగిందట.
ఇక ఆ తర్వాత వారి ఇరు కుటుంబసభ్యులను ఒప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇద్దరిదీ వేరే మతం. ఎలాగో అలా మొత్తానికి వారిని ఒప్పించారు. దీంతో 1991 అక్టోబర్ 25న పెళ్లి చేసుకున్నారు. ఇక షారూఖ్ టీవీ సిరీస్‌లలో పనిచేయడానికి ముంబైకి పూర్తిగా మకాం మార్చారు.
హనీమూన్‌కు వీరు డార్జిలింగ్‌కు వెళ్లారట. గౌరీతో ప్యారీస్‌కు వెళ్తున్నామని చెప్పాడట. అక్కడికి వెళ్లే వరకు గౌరీకి సర్ప్రైజే అయింది. గౌరీ ఖాన్‌కు సినీ ప్రపంచం ఏమాత్రం తెలీదు. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ యాక్టింగ్ తను కూడా ఫిదా అవ్వాల్సి వచ్చింది.
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.