Diabetes: డయాలిసిస్‌ సమయంలో డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడం ఎలా?

డయాలసిస్ చేస్తున్నప్పుడు డయాబెటిస్‌ను ఎలా నియంత్రించాలో ఈ కింది చిట్కాల ద్వారా తెలుసుకుందాం.

news18-telugu
Updated: September 18, 2020, 1:49 PM IST
Diabetes: డయాలిసిస్‌ సమయంలో డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడం ఎలా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నేటి కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా మధుమేహం వ్యాధి భారిన పడే రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. మధుమేహం రోగి యొక్క మూత్రపిండాలు దెబ్బతినడానికి దారితీస్తుంది. మధుమేహంతో బాధపడుతున్న రోగులు ఆహారం మరియు పానీయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అంతేకాక డాక్టర్లు సూచన మేరకు ఇన్సులిన్ మరియు మందులు తీసుకోవడం, శారీరకంగా చురుగ్గా ఉండటం చాలా ముఖ్యం. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి మధుమేహం ప్రధాన కారణం. డయాబెటిస్‌ను సీరియస్‌గా తీసుకోకపోతే రక్తంలో చక్కెర స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. దీని వల్ల మీ మూత్రపిండాల్లోని రక్త నాళాలకు నష్టం జరుగుతుంది. ఇది తరచుగా మూత్రపిండాల వ్యాధికి లేదా మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడం చాలా ముఖ్యం. మీరు డయాలసిస్ చేస్తున్నప్పుడు డయాబెటిస్‌ను ఎలా నియంత్రించాలో ఈ కింది చిట్కాల ద్వారా తెలుసుకుందాం.

తీసుకోవాల్సిన ఆహారం

1. రక్తంలో చక్కెర అధికంగా లేదా తక్కువగా ఉండకుండా ఉండటానికి క్రమం తప్పకుండా రోజుకు మూడు సార్లు భోజనం చేయండి. మధ్య మధ్యలో స్నాక్స్ కూడా తీసుకోండి.

2. అధిక కేలరీల ఆహారాలు అనగా నూనె ఎక్కుగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి.

3. మీ ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అనగా తక్కువ పొటాషియం ఉండే పండ్లు మరియు కూరగాయలు తినండి.

4. చక్కెరను తక్కువగా వాడండి. దాని బదులు బెల్లం వంటి వాటిని తీసుకోండి.

5. ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, తక్కువ కొవ్వు ఉన్న పాలు వంటి నాన్ ప్రాసెస్ ఆహారాలను తీసుకోండి.6. ఆరోగ్యకరమైన సమతుల్యతను కాపాడుకోవడానికి మీ రోజువారీ కేలరీలను లెక్కించండి.

7. మధ్యపానానికి దూరంగా ఉండాలి.

మధుమేహాన్ని నియంత్రించడానికి చిట్కాలు
1. డాక్టర్ సూచించిన విధంగా మీ రక్తంలో చక్కెరను తరచుగా తనిఖీ చేయండి.
2. మీ డయాబెటిస్ మందులను సరిగ్గా తీసుకోండి.
3. డయాలసిస్ చికిత్స ప్రారంభించే ముందు మీ రక్తంలో గ్లూకోజ్‌ను పర్యవేక్షించండి.

వ్యాయామ చిట్కాలు
1. మీ డాక్టర్తో ముందుగానే మీ వ్యాయామ ప్రణాళికపై చర్చించండి
2. రోజూ కొద్దిసేపు వ్యాయామం చేయడం ద్వారా అదనపు బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది.
3. ప్రతిరోజు కొద్దిసేపు యోగా చేయండి. యోగా మీ మనస్సు, శరీరాన్ని శాంతపరచడానికి సహాయపడుతుంది.
4. మీరు డయాలసిస్ చేస్తున్నప్పుడు సమతుల్య ఆహారం తీసుకోవడం, మీ డాక్టర్ సూచించన విధంగా ఇన్సులిన్ మరియు మందులు తీసుకోవడంతో పాటు శారీరకంగా చురుకుగా ఉండటం చాలా ముఖ్యం.
Published by: Shiva Kumar Addula
First published: September 18, 2020, 1:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading