Vastu Tips: చక్కని ఆరోగ్యానికి మేటి వాస్తు చిట్కాలు.. ఇవి పాటిస్తే మీ జీవితం సుఖమయం..!

Vastu Tips

Vastu Tips: ప్రకృతిలోని పంచభూతాల సమ్మేళనం వాస్తు. అది మన ఇంటిని, మన ఆరోగ్యాన్ని పదిలపరుస్తుంది. కొన్ని సందర్భాల్లో గోడకు వేసే రంగు కూడా మనుషుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మన జీవితం ఆరోగ్యంగా, సిరిసంపదలతో వెలిగేందుకు కొన్ని వాస్తు సూచనలు చేస్తున్నారు వాస్తు నిపుణులు.

  • Share this:
ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యానికి మించిన సంపద లేదని మనమంతా నమ్ముతాం. శారీరకంగా, మానసికంగా మనం ఆరోగ్యంగా లేకపోతే మనం బలహీనపడతాం.అది వృత్తిజీవితాన్ని ప్రభావితం చేస్తుంది. చిన్న తలనొప్పి వచ్చినా వెంటనే మనం విశ్రాంతి తీసుకుంటాం.మన మానసిక, శారీరక ఆరోగ్యంలో మన పరిసరాలు కీలక పాత్ర పోషిస్తాయనే విషయాన్ని మనం పెద్దగా పట్టించుకోం. ఈ విషయంలో వాస్తు మనకు, పరిసరాలకు మధ్య అనుసంధానంగా నిలుస్తుంది. ప్రకృతిలోని పంచభూతాల సమ్మేళనం వాస్తు. అది మన ఇంటిని, మన ఆరోగ్యాన్ని పదిలపరుస్తుంది. కొన్ని సందర్భాల్లో గోడకు వేసే రంగు కూడా మనుషుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మన జీవితంఆరోగ్యంగా, సిరిసంపదలతో వెలిగేందుకుకొన్ని వాస్తు సూచనలు చేస్తున్నారు వాస్తు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.

దిక్కులు

1.ఎల్లప్పుడు దీపం, జ్యోతి లేదా క్యాండిల్‌ను ఇంటికి ఈశాన్య దిక్కున వెలిగించండి. మీరు ఇంటి ప్రధాన ద్వారం లేదా మెయిన్‌ గేట్‌ దగ్గర దీపాలు వెలిగించినప్పుడు అవి బయటి వైపు ఉండేలా చూసుకోండి.

2.పనిచేస్తున్నప్పుడు లేదా చదువుకుంటున్నప్పుడు లేదా ఒత్తిడి, ఆందోళనను దూరం పెట్టేందుకు ఎల్లప్పుడు ఉత్తర దిక్కు లేదా తూర్పు అభిముఖంగా ఉండండి.

3. ఇంటికి ఈశాన్య అభిముఖంగా మెట్లు లేదా టాయిలెట్లు నిర్మించకండి.ఒకవేళ అలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి.

4. ఇంటి గుమ్మం, ప్రధాన ద్వారానికి ముందు అద్దం ఉంచకండి. అది అశుభాన్ని తీసుకువస్తుంది.

మొక్కలు

1.ఇంట్లో ప్రశాంతత, స్వచ్ఛమైన శక్తిని అందించడంలో ఇన్‌డోర్‌ ప్లాంట్స్‌ గొప్ప భూమిక పోషిస్తాయి. చక్కని ఆరోగ్యం, ఒత్తిడి లేని జీవితం కోసం మీ తోటలో తులసి మొక్క నాటండి.

2. మొక్కలు ఒత్తిడినిదూరం చేసి ఉపశమనం కలిస్తాయి. కాబట్టి చక్కని నిద్ర కోసం బెడ్‌రూమ్‌లో మీరు చిన్న లావెండర్‌ మొక్క పెంచుకోండి.

3. అధిక బ్లడ్‌ ప్రెషల్‌ లేదా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు అయితే రోజ్‌మేరీ లేదా స్పైడర్‌ ప్లాంట్స్‌ ఎంచుకోండి.

ఇది కూడా చదవండి : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అద్దాల్ని ఎక్కడ తగిలించాలి?

బెడ్‌రూమ్‌

1. ఇంట్లోని మాస్టర్‌ బెడ్‌రూమ్‌అత్యంత భద్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే, ఇంటి శక్తిని నిర్ణయించడంలో అది కీలక పాత్ర పోషిస్తుంది. మీ బెడ్‌రూమ్‌ నైరుతి దిక్కున ఉండేలా చూసుకోండి. ఇది మానసిక, శారీరక స్థిరత్వాన్ని అందిస్తుంది. బెడ్‌రూమ్‌ ఎప్పుడు ఈశాన్య మూలనఉండకూడదు. అలా ఉంటే దుష్టశక్తులకు ఆహ్వానం పలకడమేనని వాస్తు శాస్త్రం చెబుతోంది.

2. చక్కని, ప్రశాంతమైన నిద్ర కోసం తల దక్షిణం దిక్కుకు పెట్టుకొని పడుకోండి.

3. బాత్‌రూమ్‌ గోడ లేదా తలుపుకు ఆనించి మీ మంచం ఉంచకూడదు. అలా చేయడం వలన నెగిటివ్‌ ఎనర్జీ అంతా బెడ్‌రూమ్‌లో చేరుతుంది.

కిచెన్‌

1. చక్కని ఆహారం ఆరోగ్యానికి మూలం. ఆగ్నేయ మూల వంటింటికి ఉత్తమం.

2. కొన్నిసార్లు మన వంటగదిని మార్చలేం.అలాంటి సందర్భాల్లో మీ స్టవ్‌ను తూర్పు దిక్కుగా ఉండేలా చూసుకోండి.

3. కిచెన్‌, బాత్‌రూమ్‌ ఒకే గోడకు ఉండకూడదు.
Published by:Sridhar Reddy
First published: