మన ఇళ్లలో వంట చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ (Gas stove) లు చాలా త్వరగా మురికిగా మారతాయి. మనం రోజుకు ఎన్నిసార్లు గ్యాస్‌స్టవ్ ఉపయోగిస్తాం? గ్యాస్ స్టవ్‌పై మరకలు పడితే శుభ్రం చేయడం కష్టం. ఒకవేళ మీరు గ్యాస్‌ను సరిగ్గా శుభ్రం చేయాకపోతే, అందులో బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది.
అదేవిధంగా గ్యాస్‌స్టవ్ (Gas stove) చాలా త్వరగా పాడవుతుంది. అందుకే దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు గ్యాస్ స్టవ్స్ నల్లగా మారతాయి. ఇది చాలా మురికిగా కనిపిస్తుంది. మీ గ్యాస్ స్టవ్‌ను శుభ్రం చేయడానికి కొన్ని సింపుల్ హోం రెమిడీస్ (home remedies) చూద్దాం. దీంతో కేవలం 10 నిమిషాల్లో గ్యాస్‌స్టవ్‌ను మెరిసేలా చేయవచ్చు.
ఉప్పు, బేకింగ్ సోడా అల్టీమేట్ క్లీనర్ (ultimate cleaner). మీరు గ్యాస్ స్టవ్‌లను శుభ్రం చేయడానికి ఉప్పు, బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. 1 టేబుల్ స్పూన్ నీరు, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కలపాలి. ఇప్పుడు దాన్ని గుడ్డ లేదా స్పాంజితో గ్యాస్ స్టవ్ మీద రుద్దండి. దీంతో గ్యాస్ స్టవ్‌పై మరకలు సులువుగా తొలగిపోతాయి.
ఇది కూడా చదవండి: అన్నం వండే ముందు.. బియ్యాన్ని ఎందుకు నానబెడతారో తెలుసా?
వెనిగర్..
ఇంటిని శుభ్రం చేయడంలో వెనిగర్ చాలా ఉపయోగపడుతుంది. ఫ్లోర్ వైట్ వెనిగర్‌తో శభ్రం చేయాలి. మీరు గ్యాస్ స్టవ్‌లను శుభ్రం చేయడానికి కాబట్టి స్ప్రే బాటిల్లో మూడింట ఒక వంతు వెనిగర్, మూడింట రెండు వంతులు నీరు కలపాలి.ఇప్పుడు మీరు వంట చేసిన తర్వాత గ్యాస్‌ను శుభ్రం చేసినప్పుడల్లా ఈ ద్రావణాన్ని గ్యాస్ స్టవ్‌పై చల్లుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్పాంజితో లేదా ఏదైనా గుడ్డతో స్టవ్‌ను తుడవాలి. దీంతో గ్యాస్ స్టవ్ సరికొత్తగా మెరుస్తుంది.
డిష్వాషర్, బేకింగ్ సోడా..
చాలా మంది ప్రజలు గ్యాస్ స్టవ్‌ను శుభ్రం చేయడానికి మాత్రమే డిష్‌వాషర్‌ను ఉపయోగిస్తారు. అయితే, మీరు బేకింగ్ సోడాను లిక్విడ్ సబ్బుతో కలిపి గ్యాస్ స్టవ్‌ను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తే.. అది స్టవ్‌ను మెరిసేలా చేస్తుంది. కాబట్టి ఒక గిన్నెలో సమాన పరిమాణంలో బేకింగ్ సోడా, డిష్‌వాషర్‌ను కలపాలి. ఇప్పుడు స్పాంజ్ లేదా క్లాత్‌తో స్టవ్‌పై అప్లై చేసుకోవాలిజ 5 నిమిషాల తర్వాత గుడ్డతో పూర్తిగా శుభ్రం చేయండి.
ఇది కూడా చదవండి: సాయిపల్లవి ఫిట్నెస్ సీక్రెట్.. జిమ్ మాత్రం కాదండోయ్!
హైడ్రోజన్ పెరాక్సైడ్, బేకింగ్ సోడా..
గ్యాస్ స్టవ్‌ను డీప్ క్లీనింగ్ కోసం హైడ్రోజన్ పెరాక్సైడ్, బేకింగ్ సోడాను ఉపయోగించుకోవచ్చు. ఇది గ్యాస్ మురికిని సులభంగా తొలగిస్తుంది. కాబట్టి ముందుగా గ్యాస్‌ను పూర్తిగా శుభ్రం చేయాలి. అప్పుడు బేకింగ్ సోడా చల్లుకొని హైడ్రోజన్ పెరాక్సైడ్ జోడించాలి. కనీసం 1 గంటపాటు ఇలాగే వదిలేయాలి. ఇప్పుడ నీటితో పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. స్టవ్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే దీన్ని ఉపయోగించాలి.
అమ్మోనియా..
అమ్మోనియా సహాయంతో గ్యాస్ స్టవ్ (Gas stove) బర్నర్‌ను కూడా శుభ్రం చేసుకోవచ్చు. దీంతో స్టవ్ క్లీన్ చేయడానికి స్టవ్ నుంచి బర్నర్‌ను తీసివేసి, బర్నర్‌ను జిప్ బ్యాగ్‌లో ఉంచాలి. ఇప్పుడు ఈ సంచిలో అమ్మోనియా వేయండి. రాత్రంతా అదే జిప్ బ్యాగ్‌లో ఉంచాలి. మరుసటి రోజు బర్నర్‌ను పూర్తిగా శుభ్రంగా ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: HOME REMEDIES