Health Tips: నాన్‌వెజ్ ఎక్కువగా తింటున్నారా.. ఎంత డేంజరో చూడండి..

విందులు, వీకెండ్లు.. అకేషన్ ఏదైనా.. సెలబ్రేషన్ మరేదైనా ముక్క లేకపోతే ఆ వేడుకకి ముగింపు పడదనే చెప్పాలి. మాంసాహార ప్రియులైతే వారానికి 3సార్లైనా ముద్దముద్దలో ముక్కని నంచుకుని తింటారు. అయితే... ఈ అలవాటునే కాస్తా తగ్గించుకుంటే మంచిదని పర్యావరణవేత్తలంతా ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు.

Amala Ravula | news18-telugu
Updated: June 16, 2019, 3:08 PM IST
Health Tips: నాన్‌వెజ్ ఎక్కువగా తింటున్నారా.. ఎంత డేంజరో చూడండి..
నాన్‌వెజ్ ఐటెమ్స్‌లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.
Amala Ravula | news18-telugu
Updated: June 16, 2019, 3:08 PM IST
మీట్‌ కోసం చాలామంది పశువులను పెంచుతున్నారు. ఈ కారణంగా మీథేన్ వాయువు ఎక్కవగా వెలువడుతూ భూతాపాన్నిపెంచుతుంది. తద్వారా ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలు, సమస్త జీవరాశులన్నీ తీవ్ర‌ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. పశువులు, గొర్రెలు, మేకలు తీసుకునే ఆహారం పొట్టలో జీర్ణమయ్యే క్రమంలో మీథేన్ వెలువడుతుంది.

సాధారణంగా 50 ఉల్లిపాయలను పండిస్తే వెలువడే మీథేన్.. 44 గ్రాముల పశుమాంస ఉత్పత్తి నుంచే వెలువడుతుంది. ఇదే.. కూరలు, కూరగాయలు, పప్పుల నుంచి వీటి శాతం అత్యంత తక్కువగా ఉంటుంది. పశుమాంసం నుంచి 26.61 కిలోల గ్రీన్‌హౌస్ వాయువులు వెలువడితే.. వరి కేవలం 2.55 కిలోల మాత్రమే వెలువరిస్తుంది.
మేక మాంసం నుంచి 26.58 కిలోల వాయువులు వెలువడితే.. పండ్లు,కూరగాయల నుంచి కేవలం 2.13 కిలోలు మాత్రమే ఉంది. చికెన్ నుంచి 5.77 కిలోల గ్రీన్‌హౌస్ వాయువులు వస్తే.. పాల నుంచి 1.29 కిలోలుగా ఉంది. చేపలు, గుడ్ల నుంచి వరుసగా 3.49, 3.46 కిలోల వాయువులు ఉంటే పప్పు ధాన్యాల నుంచి 1.2 కిలోల వాయివులు వెలువడతాయి.

ఇక మాంసం అమ్మకాల లిస్టులో అమెరికా 97.1శాతంతో ముందంజలో ఉండగా.. 67.5 శాతంతో న్యూజిలాండ్ చివరిస్థానంలో ఉంది. కాబట్టి మాంసాహార వినియోగాన్ని తగ్గిస్తే.. భవిష్యత్ తరాలకు మేలు చేసినవారవుతామని పర్యావరణ నిపుణులంటున్నారు.



ఈ వీడియో కూడా చూడండి..

First published: June 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...