భారత్ (India)లో వైద్య ప్రమాణాలు ఎంతో మెరుగుపడ్డాయి. దీంతో ఇటీవల కాలంలో విదేశాలకు చెందిన రోగులు చిక్సితల కోసం మన దేశానికి భారీగా క్యూ కడుతున్నారు. విదేశీ రోగుల రాకను మెడికల్ టూరిజం (Medical Tourism) అని, మెడికల్ వాల్యూ ట్రావెల్ అని కూడా పిలుస్తుంటారు. ప్రధానంగా మూడు రకాల వైద్య చికిత్సల కోసం విదేశీ రోగులు ఎక్కువ సంఖ్యలో భారత్‌కు వస్తున్నారు. సర్జరీలు, అవయవ మార్పిడి, కీళ్ల మార్పిడి, క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సలను క్యూరేటివ్ మెడికల్ ట్రీట్మెంట్ అంటారు.
కాస్మెటిక్ సర్జరీ, ఒత్తిడి తగ్గించడం, స్పా వంటి వెల్నెస్, రెజువనేషన్ ట్రీట్మెంట్స్.. ఆయుర్వేదం, యోగా, ప్రకృతివైద్యం, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి సంప్రదాయ వైద్య చికిత్సల కోసం ఎక్కువ మంది విదేశీ రోగులు భారత్‌కు వస్తున్నారు. అయితే దక్షిణాదిలో టాప్ మెడికల్ టూరిస్ట్ డెస్టినేషన్స్‌గా మారుతున్న నగరాలు ఏవో చూద్దాం.
* బెంగళూరు
భారత్‌లో అత్యుత్తమ వైద్య చికిత్స కోసం విదేశీ రోగులు ఎంపిక చేసుకునే నగరాల్లో బెంగళూరు ముందు వరుసలో ఉంది. ఆహ్లాదకరమైన మెడికల్ ఎక్స్పీరియన్స్ కోసం ప్రపంచం నలుమూలల నుంచి రోగులు ఇక్కడికి వస్తుంటారు. హై క్వాలిఫైడ్ మెడికల్ ప్రొషనల్స్, రీసెర్చ్ టీమ్‌కు బెంగళూరు నిలయంగా ఉంది. తక్కువ మెడికల్ ఛార్జీలతో క్వాలిటీ ట్రీట్మెంట్ లభించడంతో విదేశీయులు ఈ నగరానికి వరుస కడుతున్నారు.
* చెన్నై
తమిళనాడు రాజధాని చైన్నైను ‘హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. వివిధ రకాల వైద్య చికిత్సల కోసం దేశంలో అత్యంత రద్దీ ఉండే డెస్టినేషన్లలో చెన్నై ఒకటి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ డేటా ప్రకారం.. అత్యుత్తమ స్థాయి వైద్య చికిత్స కోసం దాదాపు 40% మంది రోగులు చెన్నైకే ఓటు వేశారు. ప్రధానంగా కార్డియాక్ బైపాస్, తుంటి మార్పిడి, ఎముక మజ్జ మార్పిడి, కంటి శస్త్రచికిత్సల కోసం ప్రతి ఏటా దాదాపు 200 మందికి పైగా విదేశీ రోగులు చెన్నైకి వస్తుంటారు.
* అల్లెప్పి
కేరళలోని అల్లెప్పి మెడికల్ టూరిజం హాట్‌స్పాట్‌గా గుర్తింపు పొందింది. ఆయుర్వేద చికిత్సల ద్వారా పునరుజ్జీవనం కోసం విదేశీ రోగులు ఎక్కువగా ఈ నగరానికి వస్తుంటారు. ఇక్కడ చికిత్సా విధానం పర్యావరణ అనుకూలంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి : శ్వాస సమస్యలున్నాయా? బెల్లం, నెయ్యితో చిట్కాలు
* కోయంబత్తూరు
తమిళనాడులో చెన్నై తరువాత అంతటి స్థాయిలో వైద్యానికి ప్రసిద్ధి చెందింది కోయంబత్తూరు. ఇక్కడ వైద్య ఖర్చులు కూడా రీజనబుల్‌గా ఉంటాయి. కొన్ని రకాల బెస్ట్ మెడికల్ సదుపాయాలకు ఈ నగరం నిలయంగా ఉంది. అల్లోపతితో పాటు సిద్ధ, ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, ఈఎన్టీ, వెల్నెస్ వంటి చిక్సితల కోసం విదేశీ రోగులు ఈ నగరానికి ఎక్కువగా వస్తుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ayurveda health tips, Bangalore, India, Medical