హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Copper Vessel: రాగి చెంబులో నీళ్లు తాగడం వెనకున్న అసలు కారణం ఇదన్న మాట.. ఇన్నాళ్లూ ఈ విషయం తెలియక..

Copper Vessel: రాగి చెంబులో నీళ్లు తాగడం వెనకున్న అసలు కారణం ఇదన్న మాట.. ఇన్నాళ్లూ ఈ విషయం తెలియక..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈకోలీ అనే బ్యాక్టీరియా ఫుడ్‌ పాయిజనింగ్‌కి కారణం. నీళ్లను రాగిబిందెల్లో నిల్వ చేసినప్పుడు ఈ బ్యాక్టీరియా చనిపోతుంది. రాగి నీళ్లను పరిశుభ్రం చేస్తుంది. క్రిములతో పోరాడుతుంది. అందుకే చాలా అధ్యయనాలు గదుల్లో ఏదో ఒక వస్తువుని రాగితో చేయించి పెట్టుకోమని సూచిస్తున్నాయి. అలా ఉన్నా క్రిములతో పోరాడుతుందీ లోహం. రాగి పాత్రలో నిల్వ చేసిన...

ఇంకా చదవండి ...

  ఈకోలీ అనే బ్యాక్టీరియా ఫుడ్‌ పాయిజనింగ్‌కి కారణం. నీళ్లను రాగిబిందెల్లో నిల్వ చేసినప్పుడు ఈ బ్యాక్టీరియా చనిపోతుంది. రాగి నీళ్లను పరిశుభ్రం చేస్తుంది. క్రిములతో పోరాడుతుంది. అందుకే చాలా అధ్యయనాలు గదుల్లో ఏదో ఒక వస్తువుని రాగితో చేయించి పెట్టుకోమని సూచిస్తున్నాయి. అలా ఉన్నా క్రిములతో పోరాడుతుందీ లోహం. రాగి పాత్రలో నిల్వ చేసిన నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు బాగుంటుంది. అరుగుదల సక్రమంగా ఉంటుంది. రాగి బిందెలో నీళ్లు బరువు తగ్గడానికి దోహదపడతాయి. శరీరంలో నిల్వ ఉన్న హానికారక కొవ్వులకు ఈ లోహం పెద్దశత్రువు మరి. రాగిలో ఉండే పలు రకాల పోషకాలు మెదడు పని తీరును మెరుగుపరుస్తాయి. పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది. జ్ఞాపకశక్తీ, ఏకాగ్రత చాలా బాగుంటాయి.

  చదువుకునే చిన్నారులకు ఈ నీళ్లు ఇవ్వడం ఎంతో మంచిది. ఇది యాంటీ ఏజింగ్‌ కారకం. ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో రాగి కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలోని మృతకణాలను తొలగించి.. కొత్త వాటిని పునర్నిర్మించడానికి తోడ్పడుతుంది. ఈ లోహంతో చేసిన బిందెలో నీళ్లు తాగడం వల్ల ఎముకలు దృఢపడతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కీళ్ల సంబంధ సమస్యలున్నవారు తాగితే ఉపశమనంగా ఉంటుంది. రాగి పాత్రల్లో నీళ్లను క్రమం తప్పకుండా తాగితే రక్తపోటు అదుపులోకి వస్తుంది. గుండె పనితీరు మెరుగు పడుతుంది. కొలెస్ట్రాల్‌ అదుపులోకి వస్తుంది. మధుమేహం ఉన్నవారు తప్పనిసరిగా రాగి బిందెలో నీళ్లు తీసుకుంటే ఎంతో మంచిది.

  శరీరంలో రాగి లోపిస్తే… థైరాయిడ్‌ సమస్యలు తలెత్తుతాయి. దీన్ని అధిగమించాలంటే రాగి చెంబులో నీళ్లు తాగాలి. థైరాయిడ్‌ గ్రంథులు కూడా ఉత్తేజితమై సమస్యలు రావు. అంతేకాదు, రాగి లోహమంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట. అందుకే పూజ గదిలో కూడా రాగి ప్రతిమలు ఉంచుకోవాలట. శుక్రవారం రోజు రాగి చెంబులోని నీళ్లు తాగితే అదృష్టం కలిసొస్తుందని కొందరి నమ్మకం.

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Health benifits, Health care