Home /News /life-style /

HERE ARE THE BENEFITS OF CLAY POT WATER IN SUMMER SEASON FULL DETAILS HERE PRN GNT

Pot Water Benefits: మట్టికుండలో నీరు తాగితే ఇన్ని లాభాలున్నాయా..? పెద్దలేం చెబుతున్నారంటే..!

వేసవిలో మట్టికుండలకు డిమాండ్

వేసవిలో మట్టికుండలకు డిమాండ్

కరోనా (Corona) ప్రభావంతో ప్రస్తుతం అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువగా పెరుగుతుండటంతో.. మళ్లీ మట్టి కుండ (Clay pots) లో నీటిని తాగేందుకు ప్రాధాన్యమిస్తున్నారు.

  Anna Raghu, News18­, Guntur

  ఎండలు (Summer) మండిపోతున్నాయి బాటసారులకు మంచినీళ్లు అందించటానికి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అక్కడ అందరూ ఆగి చల్లటి మంచినీళ్లు తాగి మరీ వెళుతుంటారు. ఈ చలివేంద్రాల్లో ఫ్రిజ్‌లు ఉండవు. కానీ నీరు చాలా చల్లగా, రుచిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ నీటిని ఎర్రమట్టితో తయారుచేసిన కుండల్లో నిల్వ ఉంచుతారు. ఒకప్పుడు ఎండాకాలంలో మంచి గిరాకీ కలిగిన మట్టి కుండలకు ప్రస్తుతం అమ్మకాలు బాగా తగ్గాయని చెపుతున్నారు వ్యాపారులు. పేదల ఫ్రిజ్ గా పిలవబడే మట్టికుండలను మన ముందు తరం వారు ఎక్కువగా వాడి ఎక్కువకాలం ఆరోగ్యం (Health) గా జీవించారు. అప్పట్లో మట్టి కుండల్లోని నీటిని ముంతలతో తాగేవారు. కరోనా ప్రభావంతో ప్రస్తుతం అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువగా పెరుగుతుండటంతో.. మళ్లీ మట్టి కుండలో నీటిని తాగేందుకు ప్రాధాన్యమిస్తున్నారు.

  మట్టిలో వివిధ రకాల విటమిన్లు, ఖనిజ లవణాలుంటాయి. మట్టికుండల్లోనూ ఇవే ఉంటాయి. మన పూర్వీకులకు దీని గురించి అవగాహన ఉంది కాబట్టే.. కుండలో ఉంచిన నీటిని తాగేవారు. మట్టిలో ఉండే పోషకాలు కుండ ద్వారా దానిలో నింపిన నీటిలోకి చేరతాయి. అందుకే ఈ నీరు ఆరోగ్యకరమని చెబుతారు. మట్టికుండలకు మన కంటికి కనిపించని చిన్న చిన్న రంధ్రాలుంటాయి. ఇవి నీటిని చల్లగా మారేలా చేస్తాయి.

  ఇది చదవండి: ఏపీలో ఎమ్మెల్యేలు, లీడర్లు, అధికారుల ఫోన్లు బిజీ.., కారణం తెలిస్తే షాక్ అవుతారు..!


  మీకు మరో విషయం తెలుసా? వాతావరణ పరిస్థితులకు తగినట్టుగా నీటిని చల్లబరుస్తాయి. ఎండ ఎక్కువగా ఉంటే నీరు చాలా చల్లగా తయారవుతుంది. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటే కుండలో నీరు ఓ మాదిరిగా చల్లబడుతుంది. ఇలా వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా నీటి ఉష్ణోగ్రతలు మార్చడం ఒక్క కుండకు మాత్రమే సాధ్యం. తక్కువ ఖర్చులో ఎకో ఫ్రెండ్లీ విధానంలో చల్లటి నీటిని తాగడానికి ఇది అద్భుతమైన పద్ధతి. ఆధునిక యుగంలో దాదాపు ప్రతి మధ్య తరగతి కుటుంబం నుండి ప్రతి ఒక్కరం ప్రిజ్ లు కొనుక్కొని దానిలో ప్లాస్టిక్ బాటిల్స్ పెట్టి ఆ నీరు త్రాగుతున్నాము. ప్లాస్టిక్‌లో ఉండే హానికారక రసాయనాల వల్ల నీరు కలుషితమవుతుంది. ఇలాంటి నీటిని తాగడమంటే అనారోగ్యాన్ని కోరి కొని తెచ్చుకొన్నట్టే.

  ఇది చదవండి: పార్టీ ఏదైనా.. ప్లాన్ ఒక్కటే.. వారి కోసం వందల కోట్లు.. వ్యూహం గిట్టుబాటు అవుతుందా..?


  కానీ మట్టి పాత్రల విషయంలో ఇలా జరగదు. ఇవి హానికరమైన రసాయనాలతో నీటిని కలుషితం కానివ్వవు. వేసవిలో వడదెబ్బకు గురి కావడం సహజమే. కుండలో నీటిని తాగడం వల్ల వడదెబ్బ తగలకుండా చూసుకోవచ్చు. అదెలాగనుకొంటున్నారా? కుండలో నిల్వ ఉంచిన నీటిలో అదనపు పోషకాలు చేరతాయి. ఈ నీటిని తాగడం వల్ల చెమట ద్వారా శరీరం కోల్పోయిన విటమిన్లు, మినరల్స్ తిరిగి అందుతాయి. పైగా నీరు చల్లగా ఉంటుంది కాబట్టి దాహార్తి సైతం తీరుతుంది.

  ఇది చదవండి: వైఎస్ భారతి పేరుతో సోషల్ మీడియాలో లేఖ దుమారం.. ఫేక్ అన్న వైసీపీ.. ఆ లేఖ ఇదే..


  చల్లగా ఉన్న నీటిని తాగాలని ఉన్నప్పటికీ వాటికి దూరంగా ఉంటారు. ఎందుకంటే.. ఆ నీటి వల్ల దగ్గు, జలుబు రావడం, గొంతు పట్టినట్టుగా అనిపించడం తదితర సమస్యలు ఎదురవుతాయి. ఆస్తమా సమస్యతో ఉన్నవారైతే ఫ్రిజ్‌లో ఉంచిన నీటికి చాలా దూరంగా ఉంటారు. కుండలో ఉంచిన నీటిని తాగడం వల్ల అలాంటి సమస్యలేమీ ఎదురుకావు. ఇది నీటిని చల్లబరిచినప్పటికీ.. దాని వల్ల జలుబు, దగ్గులాంటి సమస్యలు రావడానికి అవకాశం లేదు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Drinking water, Summer

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు