Health Tips : ఈ ఫుడ్ ఐటెమ్స్ తీసుకుంటే హాయిగా నిద్రపడుతుంది..

నిద్రలేమి సమస్యతో చాలామంది సతమతమవుతుంటారు. అలాంటి వారు పడుకునేముందు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల నిద్ర బాగా పడుతుందని చెబుతున్నారు నిపుణులు. మరి అవేంటో చూద్దామా..

Amala Ravula | news18-telugu
Updated: June 1, 2019, 7:14 PM IST
Health Tips : ఈ ఫుడ్ ఐటెమ్స్ తీసుకుంటే హాయిగా నిద్రపడుతుంది..
ఎముకలు పెళుసుబారి విరిగిపోతాయని వైద్యుల పరిశోధనల్లో తెలిసింది.
  • Share this:
నిద్ర అనేది ఇప్పుడు భాగ్యమైపోయింది. ఏవేవో కారణాలతో చాలామంది సరిగా నిద్రపోవడం లేదు. ఒకవేళ నిద్రపోయినా.. అది సుఖనిద్ర కాదు. మధ్యమధ్యలో మెలకువతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారు అన్నీ ఆదమరిచి హాయిగా నిద్రపోవాలంటే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. దీంతో పాటు తీసుకునే ఆహారం కూడా సరిగా ఉండాలి. అయితే.. ఇప్పుడు చెప్పే కొన్ని ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల అలాంటి సమస్యలను అధిగమించొచ్చు. మరి అవేంటంటే..
ఓట్స్ : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఓట్స్.. నిద్రపుచ్చడంలో కూడా బాగా పనిచేస్తాయని తేలింది. ఇందులోని విటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్, మెలటోనిన్ శరీరాన్ని, బ్రెయిన్‌ని ప్రశాంతంగా మార్చి నిద్రాభంగం లేకుండా చూస్తాయి.

అరటి పండ్లు : మెగ్నీషియం, సెరోటోనీన్, మెలటోనిన్ ఉండే వీటిని తినడం వల్ల మంచి నిద్రపడుతుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. కాబట్టి బాగా పండిన అరటిపండుని తినడం వల్ల హాయిగా నిద్రపడుతుంది.
బాదం: హెల్దీ ఫ్యాట్స్, మెగ్నీషియం ఉన్న బాదం కూడా మంచినిద్రకు దోహదం చేస్తుంది. కాబట్టి వీటిని కూడా మీ డైట్‌లో చేర్చుకోండి.
కివీ : సెరోటోనిన్ గల కివీ ఫ్రూట్స్‌ని తినడం వల్ల మంచి నిద్ర మన సొంతమవుతుంది.
వాల్ నట్స్ : మెలటోనిన్ అనే పదార్థం హాయిగా నిద్రపోయేందుకు దోహదం చేస్తుంది. వాల్‌నట్స్‌లో ఈ పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి... వీటిని కూడా తీసుకోవచ్చు.
చెర్రీస్ : వాల్‌నట్స్‌లో ఉన్నట్లుగానే మెలటోనిన్ ఇందులోనూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెర్రీలను కూడా మీ డైట్‌లో భాగం చేసుకోండి.తేనె: తేనె తీసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇందులోని మెలటోనిన్ ఇలా చేస్తుంది. కాబట్టి హాయిగా నిద్రపోవాలనుకునేవారు తేనెని తీసుకోవచ్చు.
గుడ్లు: అమైనో యాసిడ్స్ గల గుడ్డు కూడా నిద్రపోయేందుకు దోహదం చేస్తుంది. రోజూ గుడ్డు తినడం వల్ల మంచి నిద్రతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.
First published: June 1, 2019, 7:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading