Health Tips : ఎక్సర్‌సైజ్ చేసే ముందు వీటిని తీసుకుంటే చాలా మంచిది..

వర్షాకాలలో రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ వ్యాయామం రెగ్యులర్‌గా చేస్తే ఎలాంటి ఆరోగ్యసమస్యలు తలెత్తవు..

ఎక్సర్‌సైజ్ చేయడం ఇప్పుడు కామన్‌గా మారింది. ఏదో చేశామన్నట్లు కాకుండా మనసుపెట్టి ఎక్కువసమయం చేస్తేనే అనుకున్న రిజల్ట్ వస్తుంది. అలా చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. అవేంటంటే..

  • Share this:
ఫిట్‌గా ఉండాలంటే ఎక్సర్‌సైజ్ చేస్తుండాలి. అయితే కేవలం ఫిట్‌గానేకాదు.. ఆరోగ్యంగా ఉండాలన్నా ఎక్సర్‌సైజ్ చేస్తుండాలి. అయితే.. రోజూ చేయడం ముఖ్యం కాదు.. చేస్తున్న ఎక్సర్‌సైజ్ ఎంతబాగా చేస్తున్నామన్నదే ముఖ్యం. అదేవిధంగా మనసుపెట్టి ఎక్కువసేపు చేయడానికి ప్రయత్నించాలి. అలా చేయాలంటే అందుకు సరిపోయే శక్తి మనశరీరంలో ఉండాలి. అందుకు సరిపోయే ఆహారం తీసుకోవాలి. కాబట్టి.. ఎక్సర్‌సైజ్ చేసే ఓ 30 నిమిషాల ముందు ఒక అరటిపండు తినాలి. లేదా ఖర్జూరాలు తిన్నా సరే.. ఇన్‌స్టంట్ ఎనర్జీ వస్తుంది. దీంతో ఎంతసేపు చేసినా అలసట రాదు. సరిపడా శక్తి వస్తుంది. ఇక దీంతో పాటు అదేపనిగా ఎక్సర్‌సైజ్ చేయొద్దు.. మధ్యమధ్యలో కొన్ని నీళ్లు తాగుతుండాలి.

అదేవిధంగా.. వ్యాయామం అయిపోయాక మరో 30నిమిషాలు గ్యాప్ ఇచ్చి అరటిపండు, మిల్క్ షేక్, బాదం, అక్రోట్స్, స్ప్రౌట్స్ లాంటివి తీసుకుంటే మంచిది. దీంతో.. శరీరం తిరిగి శక్తిని పొందుతుంది. నీరు కూడా ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే శరీరం నుంచి చెమట రూపంలో పోయిన నీటిని భర్తీ చేయొచ్చు. రోజూ ఈ టిప్స్ పాటించండి... హ్యాపీగా ఎక్సర్‌సైజ్ చేయండి..
First published: