• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • HERE ARE SOME BENEFITS OF MUSTARD OIL BODY MASSAGE DURING WINTERS SU GH

Benefits of Mustard Oil: శీతాకాలంలో ఆవనూనెతో ఎన్నో ఉపయోగాలు.. అవేంటో మీరు తెలుసుకోండి

Benefits of Mustard Oil: శీతాకాలంలో ఆవనూనెతో ఎన్నో ఉపయోగాలు.. అవేంటో మీరు తెలుసుకోండి

ఆవనూనె

మన దేశంలో వంటలు చేయడానికి ఎన్నో రకాల నూనెలను వాడతారు. వీటన్నింటిలో ఆవనూనె (Mustard oil)కు ప్రత్యేక స్థానం ఉంది.

  • Share this:
మన దేశంలో వంటలు చేయడానికి ఎన్నో రకాల నూనెలను వాడతారు. వీటన్నింటిలో ఆవనూనె (Mustard oil)కు ప్రత్యేక స్థానం ఉంది. దీంట్లో చాలా రకాల సూక్ష్మ పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బాడీ మసాజ్ (body massage) చేసుకోవడానికి కూడా ఈ నూనెను ఉపయోగించవచ్చు. సాధారణంగా మసాజ్ చేసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కానీ మసాజ్ చేయడానికి సరైన నూనెలను వాడితేనే మంచి ఫలితం కనిపిస్తుంది. మనదేశంలోని చాలా ప్రాంతాల్లో శిశువులు, చిన్నపిల్లలకు ఆవ నూనెతో మసాజ్ చేయడం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఇలా చేస్తే వారి ఎముకలు, కండరాలు ఆరోగ్యంగా పెరుగుతాయని నమ్ముతారు. చలికాలంలో ఆవనూనెతో మర్దన చేసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. శీతాకాలంలో ఆవ నూనెతో మసాజ్ చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవేంటంటే...

1. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది (Improving blood circulation)
శీతాకాలంలో ఆవ నూనెతో బాడీ మసాజ్ చేయించుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చల్లని వాతావరణం వల్ల కొంతమంది చలికాలంలో కీళ్లు, కండరాల నొప్పుల బారిన పడతారు. ఆవనూనెతో మసాజ్ చేసుకుంటే ఈ నొప్పులు దూరమవుతాయి.

2. శరీర వేడిని కాపాడుతుంది (Warming the body)
ఇతర నూనెలతో పోలిస్తే ఆవ నూనె సహజంగానే వెచ్చగా ఉంటుంది. దీంతో మసాజ్ చేయడం వల్ల శీతాకాలంలో శరీరానికి అవసరమైన వేడి ఉత్పత్తి అవుతుంది. అంతేకాకుండా శరీరం వేడిని కోల్పోకుండా ఆవనూనె కాపాడుతుంది. చలిని తట్టుకోవడానికి వెచ్చని ఆవనూనెతో మసాజ్‌చేయించుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

3. నొప్పుల నివారిణి (Reducing congestion)
అనారోగ్యాలు వ్యాపించడానికి శీతాకాల వాతావరణం అనువుగా ఉంటుంది. ఈ సీజన్‌లో చాలామంది జలుబు, దగ్గు బారిన పడతారు. సాధారణ ఫ్లూ మూడు నుంచి నాలుగు రోజులు ఉంటుంది. ఇలాంటి అనారోగ్యాలు ఎదురైనప్పుడు ఆవనూనెతో మసాజ్‌ చేయించుకుంటే నొప్పులు తగ్గుతాయి. దీంట్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్స్ గుణాలు నొప్పులు, రోగాలకు దూరంగా ఉంచుతాయి.

4. సూక్ష్మజీవులను చంపుతుంది (Germ protection)
కరోనా మహమ్మారి వ్యాపించినప్పటి నుంచి ప్రజల్లో బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులకు దూరంగా ఉండాలనే అవగాహన పెరిగింది. ఆవ నూనె బ్యాక్టీరియా, ఫంగస్‌ను నివారిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీన్ని వంటల్లో, ముఖ్యంగా పచ్చళ్ల తయారీలో వాడటం వల్ల సూక్షజీవులకు దూరంగా ఉండవచ్చు. నిల్వ ఉంచే పచ్చళ్లపై ఈ నూనెను ఒక పొరగా వేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

5. చర్మ సంరక్షణ (Skincare)
ఆవ నూనె సన్‌స్క్రీన్‌గా పనిచేస్తుంది. రసాయనాలతో చేసే సన్‌స్క్రీన్‌ లోషన్‌కు బదులుగా దీన్ని చర్మ సంరక్షణకు వాడుకోవచ్చు. సూర్యుడి నుంచి విడుదలయ్యే UV కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా ఆవనూనె కాపాడుతుంది. శీతాకాలంలో ఈ నూనెతో మర్దన చేసుకోవడం వల్ల చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి. చర్మం తేమను కోల్పోకుండా కాపాడుతూ ఆరోగ్యంగా, మృదువుగా ఉంచుతుంది.
Published by:Sumanth Kanukula
First published:

అగ్ర కథనాలు