ఏదైనా ఫుడ్ ఫెస్టివల్స్ లేదా ఫంక్షన్స్‌కు వెళ్లినప్పుడు వివిధ రకాల ఫుడ్ ఐటెమ్స్‌తో బఫేలు(Buffet) చూస్తుంటాం. కొంతమంది ఫెస్టివల్స్, ఫ్యామిలీ పార్టీల్లో కూడా వీటిని అరేంజ్ చేస్తుంటారు. నోరూరించే వివిధ రకాల పదార్థాలను బఫేలో అందిస్తుంటారు. వెజ్, నాన్‌వెజ్ డిష్‌లతో పాటు ఫ్రూట్స్, డ్రింక్స్, డెజర్ట్స్ వంటి అన్ని రకాల వెరైటీలను బఫేల్లో చూస్తుంటాం. అయితే ఇన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ కళ్ల ముందు కనిపిస్తే చాలా మంది గందరగోళానికి గురవుతారు. ఏది ముందు తినాలి, ఎంత మొత్తంలో, ఎలా తినాలో తెలియక బఫేతో సంతృప్తి చెందరు. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు పోషకాహార నిపుణురాలు భక్తి కపూర్.
బఫేల విషయంలో ఆరోగ్యకరమైన నిర్ణయాలు తీసుకోవడం చాలా కీలకమని చెప్పారు భక్తి కపూర్. అందుబాటులో ఉన్న వివిధ రకాల పదార్థాలపై దృష్టి పెట్టకుండా, అన్ని వెరైటీలను కొద్ది కొద్దిగా ఆస్వాదించాలని సూచించారు. అసలు బఫేలను ఆస్వాదించడానికి తెలివైన నిర్ణయాలు అవసరమన్నారు. ఆమె చెప్పిన మరిన్ని సలహాలు, సూచనలు ఇవే..
View this post on Instagram
* అన్నీ తినాలనుకోవడం తప్పు
బఫేలోని ప్రతి ఆహార పదార్థాన్ని టేస్ట్ చేయాల్సిన అవసరం లేదని భక్తి కపూర్ చెప్పారు. ప్రతిదాని గురించి ఆలోచించడం మరింత ఒత్తిడిని కలిగిస్తుందని పేర్కొన్నారు. అన్నింటినీ టేస్ట్ కోసం తీసుకోవచ్చని సూచించారు. సాధారణంగా క్రోసెంట్స్, డోనట్స్ వంటివి మీకు నచ్చకపోతే, మీకు అందుబాటులో ఉన్నా, వాటిని తినాల్సిన అవసరం లేదని తెలిపారు.
అలాగే బఫే ఐటెమ్స్‌లో మీకు నచ్చిన పదార్థాలను మాత్రమే తినాలనుకోవడం సరికాదు. అందుబాటులో ఉన్నవాటిని ట్రై చేయడం మంచిదే. అయితే వాటిలో అసలు మీరు ఇష్టపడని వాటిని కాకుండా.. కొత్తగా, ఇంట్రస్టింగ్‌గా కనిపించే ఐటెమ్స్, ఇంతకు ముందే టేస్ట్ గురించి విన్న పదార్థాలు ట్రై చేయాలని భక్తి కపూర్ సలహా ఇస్తున్నారు.
ఇది కూడా చదవండి : ఆందోళనకు చెక్ పెట్టే ఫుడ్స్ ఇవే.. వీటిని రోజూ తీసుకుంటే యాంగ్జైటీ దూరం..
* ప్రొటీన్ రిచ్ ఫుడ్‌తో ఆరోగ్యం
ఎలాంటి బఫేలో అయినా సరే, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే ప్రోటీన్-రిచ్ ఫుడ్(Protein-Rich Food)లను తీసుకోవాలని భక్తి కపూర్ సూచిస్తున్నారు. నెమ్మదిగా తింటూ, రుచులను ఆస్వాదించాలన్నారు. త్వరత్వరగా తింటే ఎంత తీసుకుంటున్నామనే విషయంపై స్పష్టత ఉండదని, ఎక్కువగా తినే ఆస్కారం ఉందని చెప్పారు. నచ్చిన ఒకే మీల్‌ను తినకుండా, రెండో మీల్‌ను కూడా ప్రయత్నించాలన్నారు. ఒక మంచి భోజనం విజయమని, మరొకటి సరిగా లేకపోతే వైఫల్యమని అర్థం కాదన్నారు. అలాగే ప్రతి దానిలో కొంచెం తీసుకోకుండా, ముందుగా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Food, Health care, Healthy food, Life Style