Health Tips : డిప్రెషన్‌ దూరం అవ్వాలంటే ఈ టిప్స్ పాటించండి..

ప్రతీకాత్మక చిత్రం

చాలామంది చదువులు, ఉద్యోగాలు ఇలా ఏవేవో విషయాల్లో టెన్షన్ పడుతుంటారు. అలాంటివారు కొన్ని చిట్కాలను పాటించడం వల్ల సమస్య పరిషారమవుతుంది.

  • Share this:
ఒత్తిడిగా అనిపించినప్పుడు మీకు నచ్చిన పనిచేయండి. అంటే కొంతమందికి వంట చేయడమంటే ఇష్టం, మరికొంతమందికి డ్యాన్స్ చేయాలని ఉంటుంది. ఇలా ఎవరికీ నచ్చినపని అలా చేయొచ్చు. దీంతో పాటు మీ మనసుకు నచ్చిన వారితో మాట్లాడండి. దీంతో మీ బాధ కాస్తైనా తగ్గుతుంది. అయితే, మిమ్మల్ని నీరుగార్చేవారితో కాకుండా.. ఏ బాధనైనా మరిపించగలిగేవారితో ఉండడం మేలు చేస్తుంది. ఇక ప్రతిరోజూ ఖచ్చితంగా ఏదో ఒక వ్యాయామం చేయడం వల్ల కూడామేలు జరుగుతుంది. కాసేపు అటు ఇటు నడవడం, నవ్వుకోవడం చేయడం వల్ల ఒత్తిడినుంచి బయటపడొచ్చు.

ముఖ్యంగా జంక్‌పుడ్‌ని మానేసి పూర్తిగా తాజా ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి. పండ్ల ముక్కలు, సలాడ్లు తీసుకోవడం, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కూడా మేలు జరుగుతుంది.


యోగా, శ్వాసకి సంబంధించిన ప్రక్రియలు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఈ కారణంగా ఒత్తిడి దరిచేరదు. చాలామందికి సమస్యలుంటాయి. అంతమాత్రానికే టెన్షన్ పడి మనసుని బాధపెట్టుకోవడం కంటే.. దాన్నుంచి బయటపడే మార్గాలను నెమ్మదిగా వెతకడంతో మేలు.
First published: