కిచెన్ సర్దేందుకు చౌకైన, సులభమైన ఐడియాలు..

మీ కిచెన్ లో స్టోరెజ్ స్పేస్ తక్కువుంటే మీకు ఫ్రీ స్టాండింగ్ షెల్ఫులు బాగా సాయపడతాయి. మీ కిచెన్ లో స్టోరేజ్ స్పేస్ పెంచుకునేందుకు  పాత బుక్ స్టాండ్ నుంచి మార్కెట్ లో దొరికే సింపుల్ ఫ్రీ స్టాండింగ్ షెల్ఫ్ వరకు అనేక మార్గాలు ఉన్నాయి.

news18-telugu
Updated: August 21, 2019, 12:48 PM IST
కిచెన్ సర్దేందుకు చౌకైన, సులభమైన ఐడియాలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కిచెన్ చక్కగా సర్దుకోవడమంటే మీరనుకున్నంత ఖరీదైన వ్యవహారమేమి కాదు. మీ దగ్గర సరైన ఐడియాలు ఉంటే ఆ పనిని సులభంగా చేసుకోవచ్చు. మీ వంట గదిని చక్కగా తీర్చిదిద్దేందుకు కొన్ని చౌకైన, సులభమైన ఐడియాలు:

ఫ్రీ స్టాండింగ్ షెల్ఫులు

మీ కిచెన్ లో స్టోరెజ్ స్పేస్ తక్కువుంటే మీకు ఫ్రీ స్టాండింగ్ షెల్ఫులు బాగా సాయపడతాయి. మీ కిచెన్ లో స్టోరేజ్ స్పేస్ పెంచుకునేందుకు  పాత బుక్ స్టాండ్ నుంచి మార్కెట్ లో దొరికే సింపుల్ ఫ్రీ స్టాండింగ్ షెల్ఫ్ వరకు అనేక మార్గాలు ఉన్నాయి.

హ్యాంగ్ బాస్కెట్లు

పండ్లు స్టోర్ చేసేందుకు చక్కని, చౌకైన ఆప్షన్ హ్యాంగ్ బాస్కెట్లు. అవి మీ అవసరాలకు తగినట్టుగా రకరకాల సైజుల్లో దొరుకుతాయి.

వాల్ ఫైల్

ఒక వాల్ ఫైల్ తీసుకోండి, దాంట్లో మీ కంటెయినర్ల మూతలన్నీ వేయండి. అలా చేయడం వలన మీ కిచెన్ చక్కగా కనిపిస్తుంది. మీకు మూతలు కూడా సులభంగా దొరుకుతాయి 

ఫ్లోటింగ్ షెల్ఫులు

మీ కిచెన్ లో అదనపు స్పేస్ ఉంటే మీరు ఈ ఫ్లోటింగ్  షెల్ఫులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందులో చాలా వస్తువులు స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి మీకు ఎంతో మేలు కలుగుతుంది.

కత్తులు పెట్టేందుకు మ్యాగ్నెట్లు

అందమైన ఫినిషింగ్, మంచి లుక్ కలిగిన ఓ చెక్క బోర్డు తీసుకోండి.  కావాలనుకుంటే మీ ఉడెన్ చాపింగ్ బోర్డు తీసుకొని దానికి పెయింట్ వేయవచ్చు. ఆ బోర్డుకు మ్యాగ్నెటిక్ స్ట్రిప్ చేర్చి దానికి కత్తులు అటాచ్ చేయవచ్చు.

మీ జేబుకు భారం కాకుండా మీ వంటగదిని చక్కగా తీర్చిదిద్దుకునేందుకు సులభమైన మార్గాలివి.
First published: August 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading