Health Tips: బీపీని కంట్రోల్ చేసే పచ్చ కర్పూరం

ప్రతీకాత్మక చిత్రం

భారత సంప్రదాయంలో ఎక్కువగా వాడే కర్పూరంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకోండి..

  • Share this:
* పచ్చకర్పూరాన్ని శరీరంలోకి తీసుకోవడం వల్ల ఎన్నోసమస్యలు తగ్గుతాయి.
* తమలపాకుతో కలిపి పచ్చ కర్పూరం తీసుకోవడం వల్ల వేడి తగ్గుతుంది.
* రోజుకి కొంత మోతాదులో కర్పూరం తీసుకుంటే లైంగిక సమస్యలు తగ్గుతాయి. వీర్యవృద్ధి జరుగుతుంది.
* కర్పూరం తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
వీటితో పాటు.. ఇంట్లో వెలిగించే కర్పూరంతో ఎన్నో సూక్ష్మక్రిములు, చిన్నచిన్న పురుగులు నశిస్తాయి. అయితే, వీటిని తీసుకోవడం వల్ల అంతే ఆరోగ్యంగా కూడా ఉంటారు. వీటిని వాడడం వల్ల జ్వరం, దగ్గు సమస్యలు తగ్గుతాయి.
* కర్పూరం సౌందర్యపోషణలోనూ బాగానే పనిచేస్తుంది. నిమ్మరసంలో కర్పూరం కలిపి రాయడం వల్ల మొటిమలు, మచ్చల సమస్య తగ్గుతుంది.
* నూనెలో కలిపి రాయడం వల్ల వేధించే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.
* నీటిలో కర్పూరం కలిపి ఆ నీటితో స్నానం చేస్తే సూక్ష్మక్రిములు చస్తాయి.
* చలికాలంలో వేధించే జలుబు తగ్గాలంటే కొబ్బరినూనెలో కర్పూరాన్ని నానబెట్టి పైపూతగా రొమ్ముపై రాయడంతో సమస్య తగ్గుతుంది.
* కప్పు నీటిలో కర్పూరం బిళ్లను వేసి ఉంచడం వల్ల దోమలు పారిపోతాయి.
* అదేవిధంగా నీటిల కర్పూరం బిళ్ల వేసి మరిగించి ఫ్లోర్‌ని క్లీన్ చేస్తే ఈగలు రావు.
First published: