హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Marriage Couples: ఈ నాలుగు కారణాల వల్లనే.. భార్యాభర్తల మధ్య బంధం బలహీనపడుతుంది.. అవేంటంటే..

Marriage Couples: ఈ నాలుగు కారణాల వల్లనే.. భార్యాభర్తల మధ్య బంధం బలహీనపడుతుంది.. అవేంటంటే..


8. ఎన్ని గొడ‌వ‌లు ఉన్నా.. కూర్చొని మాట్లాడుకోవాలి గాని ఇలా ప‌బ్లిక్‌గా న్యూసెన్స్ క్రియేట్ చేయ‌డం ఏంట‌ని భార్య ప‌నిపై కొంద‌రు గ‌రంగ‌రం అవుతున్నారు. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

8. ఎన్ని గొడ‌వ‌లు ఉన్నా.. కూర్చొని మాట్లాడుకోవాలి గాని ఇలా ప‌బ్లిక్‌గా న్యూసెన్స్ క్రియేట్ చేయ‌డం ఏంట‌ని భార్య ప‌నిపై కొంద‌రు గ‌రంగ‌రం అవుతున్నారు. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Marriage Couples: పెళ్లి అనే బంధంతో భార్యాభర్తలు ఒకటై.. జీవితాంతం కలిసి ఉంటారు. దాని కోసం వేదమంత్రాల సాక్షిగా ప్రమాణం చేస్తారు. పెళ్లి అయిన తర్వాత కొన్ని జంటలు తమ వైవాహిక జీవితంలో చిన్న పాటి మనస్పర్థల కారణంగా విడిపోతుంటారు. బంధాన్ని మరింత బలంగా చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...

  పెళ్లి(Marriage) అనే బంధంతో భార్యాభర్తలు ఒకటై.. జీవితాంతం కలిసి ఉంటారు. దాని కోసం వేదమంత్రాల సాక్షిగా ప్రమాణం చేస్తారు. పెళ్లి అయిన తర్వాత కొన్ని జంటలు తమ వైవాహిక జీవితంలో చిన్న పాటి మనస్పర్థల కారణంగా విడిపోతుంటారు. మరికొంత మంది వివాహేతర సంబంధాలను (Extramarital Affair) పెట్టుకొని కుటుంబాలను చిన్నాబిన్నం చేస్తుంటారు. గొడవలతో మొదలై.. క్షణికావేశంతో ప్రాణాలను కూడా తీసే వరకు వెళ్తుంది. అయితే ఎలాంటి గొడవలు లేకుండా.. భార్యాభర్తల మధ్య బంధం గట్టిగా ఉండాలంటే..ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. ఒకరికి కోపం వస్తే.. మరొకొరు శాంతంగా ఉంటూ ముందుకు వెళ్లాలి.

  Doctor And Patients: ఒక డాక్టరై ఉండి రోగులతో ఇదేం పాడు పని.. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 15 మందితో..


  వారిపైనే బంధం ఎలా ఉండాలనేది ఆధారపడి ఉంటుంది. చిన్న తప్పులు మీ సంబంధంలో పెద్ద గొడవలను సృష్టిస్తాయి. అపార్థాలను కలిగిస్తాయి. మీ బంధాన్ని బలహీనపరుస్తాయి. అందువల్ల ప్రతి దంపతులు ఈ 4 విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవలకు కారణం ఇవే. అవేంటో ఒక్కసారి ఓ లుక్కేయండి..

  Walking: ఆమె స్నేహితులతో సరదాగా వాకింగ్ కు వెళ్లింది.. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..


  1. పెళ్లి అనే బంధం దాదాపు ప్రేమ, నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది. ఏం చేసినా ఒకరికి తెలియకుండా ఒకరు చేయకూడదు. ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా ఒకరికొకరు సహకరించుకోవాలి. అది మీ బంధాన్ని కలకాలం నిలుపుతుంది. ఎక్కువ సమయం భాగస్వామితో గడిపేందుకు సమయం కేటాయించాలి. బాధలు అయినా.. సంతోషం అయినా ఒకరినొకరు షేర్ చేసుకోవాలి. లేదంటే.. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి.. డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. దీంతో అపర్థాలు పెరుగుతాయి.

  Shocking: రాత్రి సమయంలో బాత్రూంకి వెళ్లిన యువతి.. కేకలు వినిపించడంతో బయటకు వచ్చి చూసిన తండ్రి.. తర్వాత ఏమైందంటే..


  2 : ఇక సమయం కేటాయించమన్నారు కాదా అని.. 24 గంటలు మీ సమయాన్ని కేటాయించకూడదు. వాళ్లకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది. అక్కడ వారు కొంత సమయం గడపాలని కోరుకుంటారు. స్నేహితులతో గడపాలని, ఉద్యోగం మార్చాలని అనుకుంటారు. అప్పుడు వారికి కొంత సమయాన్ని కేటాయించాలి. అది వారికి రిఫ్రెష్‌గా అనిపిస్తుంది మీపై గౌరవం రెట్టింపవుతుంది.

  Sad Incident: ఆమె ఎన్నో ఆశలతో ఇంటర్ కాలేజీలో జాయిన్ అయింది.. అతడు చేసిన ఆ పనికి.. పరిస్థితి ఇక్కడ వరకు వచ్చింది..


  3. ఆది పత్యం చెలాయించడానికి దంపతులు ట్రై చేయకూడదు. సమయానుసారం.. ఆ సందర్భంలో ఏమి అనిపిస్తే అదే చేయాలి. ఒకరినొకరు అర్థం చేసుకొని గౌరవించుకోవాలి. పరిమితులు అందరికీ తెలుసు కానీ ఆంక్షలు పెట్టవద్దు. తాను చెప్పిందే వినాలని ఆంక్షలు అనేవి అస్సలు పెట్టోద్దు.

  School Student: అతడు పాఠశాలలో స్వీపర్.. టాయిలెట్ క్లీన్ చేస్తుండగా వెళ్లిన ఓ విద్యార్థినిపై అతడు..


  4. మీ భార్య ఒకవేళ గృహిణి ఆమె చేసే పనిని చిన్నచూపుగా చూడొద్దు. ఎగతాళి చేసి అస్సలు మాట్లాడకూడదు. వాళ్లు ఏం చేసినా భాగస్వామి కోసమే అనేది గుర్తుంచుకోవాలి. మీ పనిని ఎలా గౌరవిస్తారో వాళ్ల పనిని కూడా గౌరవించాలి. ఇటువంటివి కొన్ని దంపతులు చేయడం వల్ల విడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఎలంటి కండీషన్స్ పెట్టకూడదు. పైన చెప్పిన 4 విషయాలను దంపతులు గుర్తుంచుకోవాలి. చాలా వరకు జంటలు ఇలా పాటించకపోవడంతోనే విడిపోతున్నారని ఓ సర్వేలో తేలింది.

  Published by:Veera Babu
  First published:

  Tags: After marriage, Health benifits, Lifestyle

  ఉత్తమ కథలు