Home /News /life-style /

HEIGHT GROWTH TIPS HOW GROW TALLER THAN OTHERS HERE IS THE TIPS VB

Height Growth Tips: పొట్టిగా ఉన్నారని బాధపడుతున్నారా.. అయితే వీటిని పాటిస్తూ ఎత్తు పెరగండి..

ప్రతీకాత్మక చిత్రం (Image Credit : Youtube)

ప్రతీకాత్మక చిత్రం (Image Credit : Youtube)

సాధారణంగా హైట్ పెరగడం అనేది ఒకానొక దశకు వచ్చినప్పుడు ఆగిపోతుంది. ఆ ఎత్తు అనేది మన వంశపారపర్యంపై ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులు ఎక్కువ హైట్ ఉంటే పిల్లలు కూడా అంతే హైట్ పెరుగుతారు. అయితే కొన్ని సహజమైన పద్దతుల్లో ఎటువంటి మందులు వాడకుండా హైట్ పెరగొచ్చంటూ వైద్య నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇంకా చదవండి ...
  ఎత్తు(Height) తక్కువగా ఉన్నవారు కొన్ని సందర్భాల్లో బాగా బాధపడుతుంటారు. మనం కూడా ఎత్తు ఉంటే బాగుండు అంటూ అనుకుంటారు. పొడవుగా ఉండే వారిని ఎప్పుడైనా చూస్తే అసూయపడుతుంటారు. అంత ఎత్తు పెరగడం ఎలా అనే వాటిని కలలు కంటూ ఉంటారు. ఎత్తు ఎలా పెరగాలని ఇతరులను అడిగి.. వాళ్లు చెప్పినవి పాటిస్తూ ఉంటారు. కనిపించిన మందులను వాడుతుంటారు. చివరికి ఏ ఫలితమూ రాక అసహనంగా అయిపోతారు. దీంతో మళ్లీ బాధ మొదటికి వస్తుంది. కాని ఆహారమూ, వ్యాయామాలకు సంబంధించి కొన్ని చిట్కాలు పాటిస్తే కొద్దిగానైనా ఎత్తు పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఎవరికైనా అటు ఆడవాళ్లకు(Females) అయినా మగవాళ్లకు(Males) అయినా 18 నుంచి 20 ఏళ్ల వయస్సు తర్వాత శరీరంలో కణాల విభజన అనేది చాలా వరకు ఆగిపోతుంది. దీంతో ఎత్తు పెరగడానికి అవకాశం అనేది ఉండదు.

  Fridge-Free Insulin: ఫ్రిజ్‌తో పని లేకుండా ఇన్సులిన్‌ వాడొచ్చు.. సైంటిస్టుల మరో ఆవిష్కరణ..


  మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఎంత హైట్ ఉండాలనే అంశం వంశపారంపర్యంగా వస్తుంది. తల్లిదండ్రులు ఎక్కువ హైట్ ఉంటే పిల్లలు కూడా హైట్ పెరుగుతారు. కాబట్టి 20 ఏళ్లు దాటిన తరువాత ఎత్తు పెంచే మందులు ఉన్నాయని ఎవరు చెప్పినా నమ్మొద్దు. మరి ఆ సమయంలో ఎత్తు పెరగాలన్న కోరిక, ఆశ తీరదా అంటే.. దానికి ఓ మార్గం ఉంది. అదేంటంటే.. సహజమైన పద్ధతుల్లో, ఎటువంటి మందులూ వాడకుండానే ఎత్తు పెరగొచ్చు. దీని కోసం మొదట ప్రతీ రోజు వ్యాయామం, మరికాస్త పోషకాహారము తీసుకుంటే సరిపోతుంది. ఎదుగుదలకు ఉపయోగపడే మంచి ఆహారం తీసుకుంటే ఎత్తు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.

  Sleep For Six Hours: రోజూ మీరు 6 గంటలు నిద్ర పోవడం లేదా..? అయితే ఈ విషయాలను తెలుసుకోండి..


  ఎత్తు పెరగాలన్న ఆలోచన మైండ్ లో ధృఢంగా పాతుకుపోవాలి. వ్యాయామాన్ని ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో మానేయకూడదు. దానికి కావాల్సిన పోషక పదర్థాలు ఎంటంటే.. ఎక్కువ ప్రోటీన్లు ఉన్న పదర్ధాలు తీసుకోవాలి. కోడిగుడ్లలో ఎక్కువగా కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్ డీ లు ఉంటాయి. ఉడికించిన కోడిగుడ్లు రోజూ తీసుకుంటే హైట్ పెరగడానికి సహకరిస్తాయి. పాలలో కూడా ఎత్తు పెరగడానికి కావలసిన మూడు ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అవి కాల్షియం, విటమిన్ డి, ప్రొటీన్లు. కాబట్టి పాలు ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహారం ద్వారా లభించే ప్రొటీన్లు కండరాల ఎదుగుదలకు తోడ్పడతాయి. ఇలా ప్రోటీన్లతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఆయిల్ ను తక్కువ మోతాదులో తీసుకోవాలి.

  Remove Lizards From Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..


  ఇక వ్యాయామం విషయానికి వస్తే.. ఎక్కువ ఎత్తులో ఉండే కొమ్మలను అందుకోవడానికి మెడ సాగదీసి సాగదీసి జిరాఫీ మెడ పొడవుగా అయిందంటారు. ఇది నిజమే. అదీ ఒక రకమైన వ్యాయామమే. ముఖ్యంగా కండరాలకు సంబంధించి వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఇదే ఎత్తు పెరగడానికి సహకరిస్తాయి. స్కిప్పింగ్, ఎగరడం వల్ల కండరాలకు రక్తప్రసరణ పెరుగుతుంది. వ్యాయామంలో స్కిప్పింగ్ అనేది ముఖ్యమైనది. దీనిని క్రమం తప్పకుండా చేయాలి. ఎదైన ఎత్తుగా ఉండే కడ్డీలకు, రాడ్ లను ఎగిరి పట్టుకుంటూ ఉండాలి.

  Weight Loss Tips : త్వరగా బరువు తగ్గాలా.. అయితే ఈ 6 మర్పులు చేయండి..


  ఎత్తు పెరగడానికి నిలువుగా వేలాడటం అన్నది సాధారణంగా అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచి ఇలా రాడ్స్ కి వేలాడితే ఎత్తు పెరిగే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. ఉదాహరణకు చెట్టుపై ఏదైనా పండు కనిపిస్తే.. దానిని అందుకోవడానికి ఎగురుతుంటాం. అలా ఎక్కువ హైట్ లో ఉండే.. ఒక ఇనుప రాడ్ ను ఏర్పాటు చేసుకొని.. దానిని ఎగురుతూ పట్టుకోవాలి. ఇలా స్కిప్పింగ్ మరియు ఎగరడం అనేది ఎత్తు పెంచడంలో సహకరిస్తాయి.

  (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
  Published by:Veera Babu
  First published:

  Tags: Health, Health benefits, Life Style

  తదుపరి వార్తలు