మహిళల్లో పెరుగుతున్న హార్ట్ ఎటాక్స్... పరిశోధనలో షాకింగ్ విషయాలు

Heart Attacks : సినిమాల్లో చూపించినట్లు హార్ట్ ఎటాక్ అనేది నెమ్మదిగా రాదు. రెప్పపాటులో వచ్చేస్తుంది. మరుక్షణంలో మరణం సంభవించే ప్రమాదం ఉంటుంది.

Krishna Kumar N | news18-telugu
Updated: February 20, 2019, 3:06 PM IST
మహిళల్లో పెరుగుతున్న హార్ట్ ఎటాక్స్... పరిశోధనలో షాకింగ్ విషయాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమెరికాలోని ఆస్పత్రుల్లో ఐదేళ్లలో నమోదైన హార్ట్ ఎటాక్స్ కేసుల్ని పరిశీలిస్తే... వాటిలో ఎక్కువ మంది పేషెంట్ల వయస్సు 35 నుంచీ 54 ఏళ్ల మధ్య ఉంది. హార్ట్ ఎటాక్స్ సంఖ్య 1995-99 మధ్య 27 శాతం పెరగ్గా... 2010-14 మధ్య అవి 32 శాతం పెరిగాయి. షాకింగ్ విషయమేంటంటే... మహిళల్లో (యంగ్ ఏజ్) ఎక్కువ మందికి హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. జర్నల్ సర్క్యులేషన్‌లో ఈ వివరాలు పొందుపరిచారు. అమెరికా ఆస్పత్రుల్లో చేరిన మగాళ్ల సంఖ్య 30 నుంచీ 33 శాతానికి పెరిగితే... మహిళల సంఖ్య 21 శాతం నుంచీ 31 శాతానికి పెరిగింది. ఆశ్చర్యం కలిగించిన విషయమేంటంటే... మగాళ్లకు హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కొన్ని ముందస్తు లక్షణాలు కనిపిస్తున్నాయి. మహిళల విషయంలో అలా జరగట్లేదు. సడెన్‌గా గుండె పోటు వచ్చేస్తోందట. తాజా అధ్యయనంలో 1995-2014 మధ్య 35 నుంచీ 74 ఏళ్ల వయసున్న... హార్ట్ ఎటాక్స్‌తో ఆస్పత్రుల్లో చేరిన 28,732 మంది పేషెంట్ల డేటాను పరిశీలించారు.

అమెరికాలో ముసలివాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఐతే... ముసలి వాళ్ల కంటే... యంగ్ ఏజ్ మహిళలకే గుండె పోటు ఎక్కువగా వస్తోందని పరిశోధనలో తేలింది. అమెరికాలో వస్తున్న హార్ట్ ఎటాక్స్‌ను ఎక్యూట్ మయో కార్డియల్ ఇన్ఫార్క్‌షన్ అని పిలుస్తున్నారు. ఈ తరహా సమస్య హార్ట్ ఎటాక్... గుండెకు సరిపడా బ్లడ్ సరఫరా కాకపోతే వస్తుంది. అమెరికాలో ఏటా 7,90,000 మంది హార్ట్ ఎటాక్స్ బారిన పడుతున్నారు. వీరిలో చాలా మంది చనిపోతున్నారు కూడా. ప్రపంచవ్యాప్తంగా 85 శాతం గుండె సంబంధిత మరణాలు... హార్ట్ ఎటాక్స్, హార్ట్ స్ట్రోక్స్ వల్లే సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.


అమెరికాలోని పెరుగుతున్న జనాభా సంఖ్యతో పోల్చితే... మగాళ్లలో హార్ట్ ఎటాక్స్ వస్తున్న వారి సంఖ్య మెల్లిగా తగ్గుతోందట. అదే యంగ్ మహిళా హార్ట్ ఎటాక్ పేషెంట్ల సంఖ్య మాత్రం పెరుగుతోంది. ఇది వరకు ముసలి వాళ్లకు మాత్రమే హార్ట్ ఎటాక్స్ ఎక్కువగా వచ్చేవి. ఇప్పుడు ముసలి వాళ్ల కంటే యంగ్ ఏజ్ మహిళల్లో, అది కూడా ఆఫ్రికన్-అమెరికన్ మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని ARIC పరిశోధనా సంస్థ తెలిపింది.

టైప్ 2 డయాబెటిస్, హై బీపీ, అధిక బరువు, ఆహారపు అలవాట్ల వంటివి హార్ట్ ఎటాక్స్‌ పెరగడానికి కొంతవరకూ కారణం కావచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దిశగా మరిన్ని పరిశోధనలు జరపాల్సి ఉందని తెలిపారు.ప్రధానంగా అమెరికాలో యంగ్ ఏజ్ అమ్మాయిలు తాము ఉద్యోగం చేసే ఆఫీసుల్లో ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తోంది. అది వారిలో శారీరక శక్తి, సామర్ధ్యాల్ని దెబ్బతీస్తోంది. సరిపడా నిద్రపోలేకపోవడం కూడా ఆరోగ్యం దెబ్బతినేందుకు కారణమవుతోంది. స్ట్రెస్ లెవెల్స్ పెరిగి... ఆందోళన ఎక్కువై చివరకు బీపీ రైజ్ అవుతోంది. ఇవన్నీ కలిసి వన్ బ్యాడ్ డే... హార్ట్ ఎటాక్ తెప్పిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.


అమెరికాలో యంగ్ ఏజ్ మహిళలు రకరకాల థెరపీలు తీసుకోవడంలో అలక్ష్యం చూపిస్తున్నారు. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించే మందులు ఆసక్తిగా వాడట్లేదు. చాలా మంది మహిళలకు హార్ట్ ఎటాక్స్‌పై అవగాహన లేదు. ఆ సమస్య రాకుండా ఏం చెయ్యాలో తెలుసుకునేందుకు డాక్టర్లను సంప్రదించట్లేదని తేలింది

హార్ట్ ఎటాక్ వచ్చే లక్షణాలేంటి : సాధారణంగా హార్ట్ ఎటాక్ వచ్చే ముందు వికారంగా అనిపిస్తుంటుంది. చెమట ఎక్కువగా పడుతుంది. ఊపిరి పీల్చడం కష్టమవుతుంది. తల తిరుగుతున్న భావన కలుగుతుంది. ఒక చేతికీ లేదా రెండు చేతుల్లో నొప్పి కలుగుతుంది. వెన్నుపూస, కింది దడవ లేదా పొట్టలో నొప్పి వస్తుంది. అలాంటి లక్షణాలపై ముందే అవగాహన ఉంటే... వెంటనే ఆస్పత్రికి వెళ్లొచ్చు. ఆలస్యం చేస్తే... సమస్య తీవ్రత ఎక్కువవుతుంది. అవగాహన లేకపోవడం వల్ల ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల తీవ్ర నష్టం జరుగుతోందంటున్నారు పరిశోధకులు.
Loading...
ఒక్క అమెరికాలోనే కాదు... ఇండియా సహా చాలా దేశాల్లో మహిళలపై పని ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా వారిలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు పరిశోధకులు.

 

ఇవి కూడా చదవండి :


ఇంట్లో నెమలి పించం ఉందా... మీకు కలిగే ప్రయోజనాలు ఏవంటే...


పడక సుఖానికి దివ్య ఔషధం యాలకులు... ఎలా వాడాలంటే...


పండ్లపై ఉప్పు చల్లుకొని తింటున్నారా... ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే

First published: February 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...