హైదరాబాద్‌లో తగ్గిన టెంపరేచర్.. పెరిగిన హార్ట్ ఎటాక్స్

సాధారణంగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో హార్ట్ ఎటాక్ కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయని కార్డియాలజీ నిపుణులు చెబుతారు. గత వారం రోజుల్లో సాధారణం కంటే సుమారు 25 శాతం అధికంగా గుండె పోటు కేసులు హైదరాబాద్‌లో నమోదైనట్టు తెలిసింది.

news18-telugu
Updated: January 30, 2019, 10:49 AM IST
హైదరాబాద్‌లో తగ్గిన టెంపరేచర్.. పెరిగిన హార్ట్ ఎటాక్స్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌లో గత ఐదు రోజులుగా హార్ట్ ఎటాక్ కేసులు పెరిగాయి. గత ఐదు రోజులుగా భాగ్యనగరంలో ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోయాయి. దీంతో శరీరంలోని రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల గుండెపోటు కేసులు పెరిగాయని వైద్యులు చెబుతున్నారు. గత వారం రోజుల్లో సాధారణం కంటే సుమారు 25 శాతం అధికంగా గుండె పోటు కేసులు హైదరాబాద్‌లో నమోదైనట్టు తెలిసింది. సాధారణంగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో హార్ట్ ఎటాక్ కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయని కార్డియాలజీ నిపుణులు చెబుతారు. సంవత్సరంలోని మిగిలిన నెలలతో పోలిస్తే ఈ ఐదు నెలల కాలంలో కొంచెం ఎక్కువగానే ప్రజలకు గుండెపోటు వస్తుంటుంది. అయితే, ఈ సారి కూడా అలాంటి పరిస్థితే ఉంది. కానీ, గత వారం రోజులుగా హైదరాబాద్‌లో వాతావరణం మరింత దారుణంగా ఉంది. చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో గుండెపోటు కేసులు పెరిగాయని చెబుతున్నారు.

heartattack_AFP
ప్రతీకాత్మక చిత్రం


ఈ ఏడాది జనవరి మొదటి వారంలోనూ, జనవరి 15 తర్వాత చాలా మంది గుండెపోటుతో ఆస్పత్రులకు వచ్చారని ఓ కార్డియాలజిస్ట్ తెలిపారు. గుండెకు ఆక్సిజన్ సరిగా సరఫరా కాకపోవడం వల్ల హార్ట్ ఎటాక్ వస్తుంటుంది. అయితే, అది ఒక్కటే కారణం అని చెప్పలేం. ఇతరత్రా కారణాలు కూడా ఉంటాయి.

heartattack_AFP3
ప్రతీకాత్మక చిత్రం
ఇంకా చలికాలం వెళ్లలేదు. హైదరాబాద్‌లో చలి చంపేస్తోంది. కాబట్టి, సీనియర్ సిటిజన్లు, ఇప్పటికే గుండె ఆపరేషన్లు చేయించుకున్న వారు, క్యాన్సర్ ట్రీట్‌మెంట్ తీసుకునే పేషెంట్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

heartdisease
ప్రతీకాత్మక చిత్రం


వింటర్‌లో చలి నుంచి కొంచెం ఉపశమనం లభిస్తుందన్న ఉద్దేశంతో కొందరు మద్యం తాగుతూ ఉంటారు. మద్యం శరీరంలోకి వెళితే, బాడీ వెచ్చగా ఉంటుందని భ్రమిస్తారు. అయితే, ఆల్కహాల్ వల్ల పడే మిగిలిన ప్రభావాల గురించి వారు పట్టించుకోరు. కాబట్టి, వింటర్ కదా అని ఓ పెగ్గు ఎక్కువ తాగాలనుకునే వారు కూడా జాగ్రత్తగా ఉండాలి.ఇవి కూడా చదవండి
First published: January 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు