#HealthTips: చికెన్‌ ఇలా తింటే ఎన్ని లాభాలో..

చికెన్‌ని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే, ఏదో వండుకుని తిన్నాం అన్నట్లు కాకుండా మనకు ఇష్టమైన ఈ వైట్ మీట్‌ని ఎలా వండుకుని తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకోండి.

Amala Ravula | news18-telugu
Updated: February 13, 2019, 5:27 PM IST
#HealthTips: చికెన్‌ ఇలా తింటే ఎన్ని లాభాలో..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: February 13, 2019, 5:27 PM IST
సండే వచ్చిందంటే చాలు చాలా ఇళ్లల్లో చికెన్ కుతకుత ఉడుకుతుంటుంది. అయితే, ఈ టేస్టీ చికెన్‌ని హెల్దీగా మార్చుకోవాలంటే కొన్ని పాటించండి. అవేంటంటే.. బిర్యానీ, కర్రీస్‌, ఫ్రైలా చికెన్‌ని చాలామంది కుక్ చేసి టేస్ట్ చేస్తుంటారు. అయితే అలా కాకుండా నూనె తక్కువగా వేసి వండుకోవడం మంచిది.
అదే విధంగా.. ఫ్రైలకు బదులు ఉడికించండి. దీంతో.. ఇందులోని పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కడ్డీలతో కాల్చి తింటే ఇంకా మంచిది. ఎందుకంటే సాధారణంగా చికెన్‌లో నూనె గుణాలుంటాయి. కాబట్టి వాటిలో ఇంకా నూనె వేసి వండడం కన్నా.. దాన్ని కాస్తా వేడిచేస్తే ఆ నూనె బయటికొచ్చి చక్కగా ఉడుకుతుంది.
టోస్టర్‌లో బేక్ చేయడం కూడా మరో మంచి ఆప్షన్. దీంతో పాటు.. బేక్ చేస్తే ఉడకడంతో పాటు ఆయిల్‌ని అవాయిడ్ చేసినవారవుతాం.


ముఖ్యంగా చాలామంది చికెన్ తింటుంటారు. ఇందులో కోడిలో ఏ భాగం మేలు చేస్తుందంటే.. కాళ్లు, ఎదభాగంని తినడం వల్ల శరీరానికి మాంసకృత్తుల్ని అందించినవారవుతాం. ఇది కాస్తా ఎక్కువ పరిమాణంలో తీసుకున్నా ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం పడదు.
కాబట్టి.. ఇష్టమైన చికెన్‌ని కాస్తా హెల్దీగా వండుకుని తింటే ఆనందానికి ఆనందం, ఆరోగ్యానికి ఆరోగ్యం.
First published: February 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు