హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Hing Benefits: చిటికెడు ఇంగువ.. మీ ఆరోగ్యానికి కొండంత భరోసా.. ఇవీ ప్రయోజనాలు

Hing Benefits: చిటికెడు ఇంగువ.. మీ ఆరోగ్యానికి కొండంత భరోసా.. ఇవీ ప్రయోజనాలు

Hing benefits: ఇంగువలోని యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులను నయం చేయడానికి, రక్తపోటును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. వంటకాల్లో ఇంగువ వాడటం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

  భారతీయ వంటకాల్లో ఎక్కువగా సుగంధ ద్రవ్యాలను వాడుతుంటారు. ఇవి వంటకానికి మంచి రుచి, వాసనను అందిస్తాయి. అలాంటి సుగంధ ద్రవ్యాల్లో ఇంగువ ఒకటి. ఇంగువని అసఫోటిడా అని కూడా పిలుస్తారు. దీన్ని మన దేశంలో ప్రతి ఇంట్లో విరివిగా వాడుతుంటాం. ఇంగువ మంచి రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇంగువలోని సహజ లక్షణాలు అనేక వ్యాధులను నయం చేయడానికి శక్తివంతంగా పనిచేస్తాయి. వంటకాల్లో దీన్ని వాడటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అందువల్లే, స్వచ్చమైన ఇంగువను యునాని, సిధా, ఆయుర్వేద మెడిసిన్ తయారీలోనూ ఉపయోగిస్తారు. దీనిలోని యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులను నయం చేయడానికి, రక్తపోటును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. వంటకాల్లో ఇంగువ వాడటం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం.

  జీవక్రియను మెరుగుపడుతుంది:

  అజీర్ణం, ఉబ్బసం వంటి సమస్యలకు ఇంగువను మించిన మెడిసిన్ లేదు. దీనిలోని యాంటిస్పాస్మోడిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణక్రియకు గొప్ప పరిష్కారాన్ని చూపిస్తాయి.

  శ్వాసకోశ సమస్యలకు పరిష్కారం:

  జర్నల్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, ఇంగువ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుందని తేలింది. ఇది శ్వాసకోశ సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.

  ఎసిడిటీ నివారణ:

  ఇంగువ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీనిలోని ఆల్కలీన్ స్వభావం యాసిడ్ రిఫ్లక్షన్లను నివారించడంలో మీకు సహాయపడుతుంది.

  ఒత్తిడికి చెక్:

  రోజూ వారి బిజీ షెడ్యూల్ కారణంగా చాలా మందిలో ఒత్తిడి అధికమవుతోంది. అటువంటి వారికి ఇంగువ చక్కటి పరిష్కారం చూపిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడం సహాయపడుతుంది. తద్వారా ఇన్ఫెర్టిలిటీ, గుండె సంబంధిత సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. ఇవే కాకుండా అనేక ఇతర ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో ఇంగువ మీకు సహాయపడుతుంది.

  పీరియడ్స్ సమస్యలకు చెక్:

  మహిళలకు పీరియడ్స్ టైంలో వచ్చే కడుపు నొప్పిని ఇంగువ నయం చేస్తుంది, అంతేకాక, వారి ఉదర కండరాలను సున్నితంగా చేయడంలో సహాయపడుతుంది. తలనొప్పి, ఉబ్బసం, తిమ్మిరి వంటి సమస్యలను తగ్గిస్తుంది.

  జలుబు, దగ్గు నివారణ:

  ఇంగువలో ఉండే యాంటీ- అలెర్జీ కారకాలు జలుబు, దగ్గు, గొంతు సమస్యలకు పరిష్కారం చూపిస్తాయి. ఇది మన శరీరంలో వైరస్ పెరుగుదలను నియంత్రిస్తుంది. తద్వారా ఫ్లూ సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.

  జుట్టు సంరక్షణ:

  ఇంగువ మీ జుట్టు రాలడం, తెల్లబడటం వంటి సమస్యలను నివారిస్తుంది. ఇది మీ జుట్టుకు గొప్ప ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. పెరుగు, తేనె వంటి ఇతర పదార్ధాలతో ఇంగువని కలిపి తీసుకుంటే మీ తలపై ఉండే తేమను తగ్గించి, జుట్టును సంరక్షిస్తుంది.

  చర్మం సౌందర్యం:

  ఇంగువ యాంటీ ఆక్సిడెంట్లతో లోడ్ చేయబడి ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ చర్యతో పోరాడటానికి సహాయపడుతుంది. తద్వారా మీ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి, మీరు మీ ఇంట్లో తయారుచేసిన ఫేస్ ప్యాక్‌లతో చిటికెడు ఇంగువ కలిపి ట్రై చేయండి. మెరుగైన ఫలితాన్ని పొందండి.

  First published:

  Tags: Ayurveda health tips, Health, Health benefits, Health Tips

  ఉత్తమ కథలు