• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • HEALTHY FOOD HERE ARE 5 AMAZING HEALTH BENEFITS OF CHICKPEAS SK GH

Chickpeas Benefits: శనగలతో 5 అద్భుత ఆరోగ్య ప్రయోజాలు.. నిజంగా ఇది సూపర్‌ఫుడ్

Chickpeas Benefits: శనగలతో 5 అద్భుత ఆరోగ్య ప్రయోజాలు.. నిజంగా ఇది సూపర్‌ఫుడ్

ప్రతీకాత్మక చిత్రం

Chickpeas: కందిపప్పు కంటే శనగ పప్పు ధర తక్కువ. కాబట్టి ఇది కామన్ మ్యాన్‌కు బడ్జెట్‌లో లభించే ఆహారం. శనగలు కొన్ని రోగాలకు ఇట్టే చెక్ పెట్టే వంటింటి వైద్యంలా పనికి వస్తాయి.

  • Share this:
శనగలు.. రుచికరమైన ఆహారం. చిన్నా పెద్దా అందరూ ఇష్టంగా లాగించే పోషగాల గని. ప్రొటీన్ రిచ్ అయిన శనగలు ఆరోగ్యానికి చాలామంచిది. అందుకే ఇటీవలి కాలంలో దీన్ని దేశీ సూపర్ ఫుడ్‌గా మన న్యూట్రిషనిస్టులు పిలుస్తున్నారు. మన అందరి ఇళ్లలో ఎప్పుడూ నిలువ ఉండే శనగలు ఓ కప్పు తింటే బోలెడంత శక్తి కూడా వస్తుంది. శాకాహారులకు ఇది మంచి ప్రత్యామ్నాయం. లెగ్యూమ్ జాతికి చెందిన శనగల్లో నాటీ శెనగలు, కాబూలీ వాలా శెనగలు వంటివి లభిస్తాయి. కొన్ని తెల్లగా ఉంటే మరికొన్ని ఆకుపచ్చగా, డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. కాసిన్ని శెనగలు నానబెట్టి, మొలకలు వచ్చాక వాటిని పచ్చివి తిన్నా, వేయించుకుని, ఉడికించుకుని తిన్నా ఆరోగ్యకరమే. శనగల చాట్ అయితే రుచికి రుచి, ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అంటే నమ్మండి.

"ఛోళా బటూరా" అంటే మనలో ఇష్టపడనివారు బహుశా ఉండరు. పూరీతో శనగల కూర అంటే అందరికీ ఫేవరెట్ డిష్ కదా. శనగలు, చెనా, చిక్ పీస్‌గా మనం పిలుచుకునే ఈ విత్తనాల్లో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. సూపర్ రిచ్ ప్రొటీన్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉన్న శనగలతో జీర్ణం కూడా బాగా అవుతుంది. అలా అని అతిగా తింటే మాత్రం కడుపుబ్బరంతో ఇబ్బంది పడతారు. పెద్దవాళ్లకు ఒకరోజుకు అవసరమయ్యే ప్రొటీన్ లో మూడవ వంతు ప్రొటీన్ 28 గ్రాముల శనగల్లో ఉంటుంది. పొట్టు తీసిన శెనగల కంటే పొట్టుతో ఉన్న శనగలు చాలా మంచిది. లేదా పాలిష్ లేని శనగ పప్పును ఎంచుకోండి. ఇక కందిపప్పు కంటే శనగ పప్పు ధర తక్కువ. కాబట్టి ఇది కామన్ మ్యాన్‌కు బడ్జెట్‌లో లభించే ఆహారం. శనగలు కొన్ని రోగాలకు ఇట్టే చెక్ పెట్టే వంటింటి వైద్యంలా పనికి వస్తాయి.

బ్లడ్ ప్రెజర్
బ్లడ్ ప్రెజర్ ను అదుపుచేసే శక్తి శనగపప్పుకు ఉంది. పొటాషియం ఇందులో ఎక్కువగా ఉంటుంది కనుక హై బ్లడ్ ప్రెజర్ కు ఇది చక్కని ఔషధంలా పనిచేస్తుంది. ఒక కప్పు శనగల్లో 474 ఎంజీల పొటాషియం ఉంటుంది. రోజూ 4,700ఎంజీల పొటాషియం క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు అదుపులోకి రావటం ఖాయం.

గుండెకు మంచిది:
మనందరికీ పెద్దగా తెలియని విషయం ఇదే. శనగలతో గుండె ఆరోగ్యం మరింత మెరుగవుతుంది. గుండెకు అవసరమైన న్యూట్రిషన్ ను సప్లై చేసే శక్తి చెనాకు ఉంది. సెలీనియం, మెగ్నీషియం, పొటాషియం, బీ విటమిన్, ఫైబర్, ఐరన్ వంటివి పోషకాలు ఉన్నందున గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అంతేకాదు LDL కొలెస్ట్రాల్‌ను ఇది బాగా తగ్గిస్తుంది.

బ్లడ్ షుగర్:
డయాబెటిక్స్ ఉన్న వారికి శనగలు అత్యుత్తమ ఆహారం. బ్లడ్ షుగర్ హెచ్చుతగ్గులను ఇది నియంత్రిస్తుంది. ఒక కప్పు చిక్ పీస్ లో 12.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది కనుక ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులపై చక్కగా పనిచేస్తుంది. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం కూడా కావటంతో ఇది నెమ్మదిగా జీర్ణమవుతూ, ఇన్సులిన్‌ను నెమ్మదిగా రిలీజ్ చేస్తుంది. దీంతో ఉన్నట్టుండి ఇన్సులిన్ నిల్వ శరీరంలో పెరగకుండా, క్రమంగా ఈ వ్యవస్థ పనిచేస్తూ, బ్లడ్ షుగర్‌‌పై అదుపు సాధించేందుకు శెనగలతో చేసిన ఆహారం సాయపడుతుంది.

రక్త హీనతకు చెక్:
ఐరన్, క్యాల్షియం, సీ,ఏ,ఈ విటమిన్లు, ఫొలేట్, యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాహలతో నిండిన శెనగలు మన శరీరంలో ఎముకలు ద్రుఢ పడేలా పనిచేస్తుంది. మన శరీరం ఐరన్‌ను గ్రహించేలా చేసే ఈ గింజలు, ఆస్టియోపోరాసిస్, అనీమియాతో బాధపడేవారికి సూపర్ ఫుడ్.

చురుగ్గా జీర్ణవ్యవస్థ:
ఇందులో సమృద్ధిగా ఉన్న ఫైబర్ తో మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు పోతాయి. శరీరంలోని ట్యాక్సిన్లను బయటకు పంపటంలో చిక్ పీస్ అద్భుతంగా పనిచేస్తాయి. గట్ హెల్త్ మెరుగయ్యేలా ఇది తోడ్పడుతుంది. అందుకే మీ మెనూలో శనగలను మీకు నచ్చిన రూపంలో చేర్చుకోండి, ఆరోగ్యంగా జీవించండి.
Published by:Shiva Kumar Addula
First published:

అగ్ర కథనాలు