Home /News /life-style /

Benefits of basil seeds: తులసి ఆకులేకాదు విత్తనాలు కూడా వరమే..ఎన్ని ప్రయోజనాలో..

Benefits of basil seeds: తులసి ఆకులేకాదు విత్తనాలు కూడా వరమే..ఎన్ని ప్రయోజనాలో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Benefits of tulasi seeds: మానసిక ఒత్తిడిని దూరం చేయడంలో తులసి గింజలు కూడా సహాయపడతాయి. దీంతోపాటు వాటి వినియోగం శారీరక అలసటను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.

తులసి మొక్కలో (tulasi plant) అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీని వల్ల తులసి ఆకులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే, తులసి ఆకులే కాదు, విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుందని భావిస్తారు. ఈ తులసి విత్తనాలను ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

తులసి గింజలు (tulasi seeds) ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలియని వారు ఉన్నారు. అయితే, వెబ్ సైట్ ప్రకారం తులసి గింజలను తీసుకోవడం ద్వారా మీరు అనేక సమస్యలను దూరం చేయవచ్చు.

ముఖ్యంగా ఈ తులసి గింజలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. తులసి బీజంలో ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్ ఉంటాయి. ఇది ఇమ్యూనిటీ పవర్ బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ కారణంగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇది మాత్రమే కాదు తులసి గింజల్లో చాలా ప్రోటీన్, ఫైబర్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు కనిపిస్తాయి. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని రక్షించడంలో కూడా సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే.. ఈ ఒక్క పని చేస్తే చాలు..

కడుపు సమస్యలు..
తులసి గింజలు కూడా కడుపు సమస్యలను దూరం చేయడంలో చాలా సహాయపడతాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. దీంతో మలబద్ధకం యాసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

మంట..
తులసి గింజలు శరీరంలోని ఏ రకమైన వాపునైనా తగ్గించడంలో కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు చేస్తోంది. ఈ విత్తనాల్లో యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు కనిపిస్తాయి. ఇవి శరీరంలో ఉన్న వాపును తొలగించడంలో సహాయపడతాయి.

ఇది కూడా చదవండి:  మెడిటేషన్ 5 నిమిషాలే కదా.. అనుకోకండి.. ఆశ్చర్యకర ఫలితాలు..


బరువు తగ్గడంలో..
తులసి గింజలు కూడా బరువు తగ్గడంలో మేలు చేస్తాయి. ఈ విత్తనాల్లో కేలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే , ఇందులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. దీనివల్ల ఎక్కువ సమయం ఆకలి అనుభూతి ఉండదు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

స్ట్రెస్..
మానసిక ఒత్తిడిని దూరం చేయడంలో తులసి గింజలు కూడా సహాయపడతాయి. దీంతోపాటు వాటి వినియోగం శారీరక అలసటను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.
Published by:Renuka Godugu
First published:

Tags: Tulasi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు