• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • HEALTH YOUNG PEOPLE WHO DO PHYSICAL EXERCISE AT LEAST 5 HOURS A WEEK HAVE LESS CHANCES OF BLOOD PRESSURE RISKS SK GH

Physical Activity: వ్యాయామం చేసే వారికి ఈ ముప్పు తక్కువ.. తప్పక తెలుసుకోండి

Physical Activity: వ్యాయామం చేసే వారికి ఈ ముప్పు తక్కువ.. తప్పక తెలుసుకోండి

(ప్రతీకాత్మక చిత్రం)

నిర్ణీత సమయం పాటు ఉండే శారీరక శ్రమ లేదా వ్యాయామాలతో గుండె జబ్బులు, స్ట్రోక్, మధుమేహం, క్యాన్సర్లు, హైపర్ టెన్షన్ వంటి వ్యాధులను దూరంగా ఉండవచ్చని పరిశోధకులు కనుగొన్నారు.

  • Share this:
వ్యాయామం శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తుందని ఎన్నో పరిశోధనలు తేల్చాయి. వ్యాయామాలకు వయసుతో సంబంధం లేదని కూడా గతంలో కనుగొన్నారు. యుక్త వయసులో వ్యాయామం చేసేవారు మధ్య వయసులో బీపీ, హైపర్ టెన్షన్ వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చని తాజా పరిశోధన చెబుతోంది. యువత వారానికి కనీసం ఐదు గంటల ఒక మాదిరి కసరత్తులు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని కాలిఫోర్నియా- శాన్ ఫ్రాన్సిస్కో యూనివర్సిటీ సంయుక్త అధ్యయనం వెల్లడించింది. ఇంతకు ముందు సిఫారసు చేసిన శారీరక శ్రమ (Physical Activity) కంటే ఇది రెట్టింపు సమయం కావడం విశేషం. నిర్ణీత సమయం పాటు ఉండే శారీరక శ్రమ లేదా వ్యాయామాలతో గుండె జబ్బులు, స్ట్రోక్, మధుమేహం, క్యాన్సర్లు, హైపర్ టెన్షన్ వంటి వ్యాధులను దూరంగా ఉండవచ్చని పరిశోధకులు కనుగొన్నారు.

జీవనశైలి మార్పులు, శారీరక శ్రమకు దూరంగా ఉండటం వంటి కారణాలతో యువత టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం, హైపర్ టెన్షన్ వంటి అనారోగ్యాలను ఎదుర్కొంటున్నారు. దీర్ఘకాలం వేధించే అధిక రక్తపోటు సమస్య.. గుండెపోటు, స్ట్రోక్, డిమెన్షియాకు కూడా దారితీస్తోంది. వీటన్నింటినీ వ్యాయామం లేదా ఫిజికల్ యాక్టివిటీ దూరం చేస్తుందని పరిశోధనల్లో నిరూపించారు.

* ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏంటి?
శరీర కండరాలు కదల్చడం ద్వారా శక్తిని ఖర్చు చేయడాన్ని శారీరక శ్రమ అంటారు. నడక, పరుగు, సైక్లింగ్, ఆటలు, పనిచేయడం వంటివన్నీ శారీరక శ్రమ కిందకు వస్తాయి. ఇవన్నీ వ్యాయామం కిందకు వస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. 18 నుంచి 64 సంవత్సరాల మధ్య వయసు ఉండేవారికి వారంలో కనీసం 150–300 నిమిషాల పాటు ఒక మాదిరి తీవ్రత ఉండే ఏరోబిక్ ఫిజికల్ యాక్టివీటీ అవసరం. వీరు వారంలో కనీసం 75–150 నిమిషాల పాటు ఎక్కువ తీవ్రత ఉండే ఏరోబిక్ ఫిజికల్ యాక్టివిటీలు చేయాలి. లేదంటే వారం పొడవునా ఇలాంటి రెండు రకాల వ్యాయామాలు కలిపి చేయాలని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. కానీ తాజా అధ్యయనం మాత్రం ఈ వ్యాయామాన్ని వారానికి ఐదు గంటల వరకు పెంచడం విశేషం. దీనివల్ల మధ్య వయసులో హైపర్ టెన్షన్ సమస్యకు దూరంగా ఉండవచ్చని తాజాగా నిర్వహించిన UCSF బెనిఆఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పరిశోధన వెల్లడించింది. ఈ పరిశోధన ఫలితాలను అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో ప్రచురించారు.

* పరిశోధన ఎలా చేశారు?
18 నుంచి 30 సంవత్సరాల వయస్సు ఉన్న సుమారు 5,000 మందిపై ఈ అధ్యయనం చేశారు. వీరందరి ఆరోగ్యాన్ని 30 ఏళ్ల పాటు పర్యవేక్షించారు. వారి వ్యాయామ అలవాట్లు, మెడికల్ హిస్టరీ, పొగతాగే అలవాట్లు, ఆల్కహాల్ తీసుకోవడం... వంటి వివరాలను క్రమం తప్పకుండా అడిగి తెలుసుకున్నారు. వీరందరి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయులు, రక్తపోటు, బరువును నమోదు చేశారు. వీరిలో యుక్తవయసులో వారానికి కనీసం ఐదు గంటలు వ్యాయామం చేసినవారు 17.9 శాతం మంది ఉన్నారు. ఇతరులతో పోలిస్తే వీరికి హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం 18 శాతం తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో 11.7 శాతం మంది వ్యక్తులు 60 సంవత్సరాలు వచ్చే వరకు వ్యాయామ అలవాట్లను కొనసాగించారు. వీరు హైపర్ టెన్షన్‌కు గురయ్యే ప్రమాదం చాలా తక్కువగా ఉందని గుర్తించారు.
Published by:Shiva Kumar Addula
First published: