Home /News /life-style /

Vaccine Side Effects: వాళ్లకు కరోనా కంటే కోవిడ్ వ్యాక్సిన్‌ల వల్లే ఎక్కువ ప్రమాదం.. తేల్చి చెప్పిన తాజా అధ్యయనం

Vaccine Side Effects: వాళ్లకు కరోనా కంటే కోవిడ్ వ్యాక్సిన్‌ల వల్లే ఎక్కువ ప్రమాదం.. తేల్చి చెప్పిన తాజా అధ్యయనం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టీనేజ్ అబ్బాయిలకు కరోనా ఇన్‌ఫెక్షన్‌తో పోలిస్తే కోవిడ్ వ్యాక్సిన్లతోనే ఎక్కువ ప్రమాదమని తేల్చింది తాజా అధ్యయనం. వారికి కోవిడ్-19 సోకి ఆసుపత్రిలో చేరడంతో పోలిస్తే.. టీకా వల్ల గుండె సమస్యలతో బాధపడే అవకాశం ఆరు రెట్లు ఎక్కువని పరిశోధకులు కనుగొన్నారు.

ఇంకా చదవండి ...
టీనేజ్ అబ్బాయిలకు కరోనా(Corona) ఇన్‌ఫెక్షన్‌తో పోలిస్తే కోవిడ్ వ్యాక్సిన్లతోనే (Covid Vaccine) ఎక్కువ ప్రమాదమని తేల్చింది తాజా అధ్యయనం. వారికి కోవిడ్-19 సోకి ఆసుపత్రిలో చేరడంతో పోలిస్తే.. టీకా వల్ల గుండె సమస్యలతో బాధపడే అవకాశం ఆరు రెట్లు ఎక్కువని పరిశోధకులు కనుగొన్నారు. రెండు డోసులు టీకా తీసుకున్న 12 నుంచి 15 ఏళ్ల అబ్బాయిల్లో చాలామంది కార్డియాక్ అడ్వర్స్ ఈవెంట్ అనే గుండె సంబంధ సమస్యతో బాధపడుతున్నారని గుర్తించారు. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు. అయితే ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిస్ విట్టి దీనికి సంబంధించిన వివరాలను తాజాగా వెల్లడించారు. పిల్లలకు టీకాలు వేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రభుత్వానికి సలహా ఇచ్చే క్రమంలో ఈ పరిశోధనను తెరపైకి తీసుకొచ్చారు.

టీకాలు, రోగనిరోధకతపై అధ్యయనం కోసం బ్రిటన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీ ఆన్ వ్యాక్సినేషన్ అండ్ ఇమ్యునైజేషన్‌ (JCVI) గత వారం కీలక ప్రకటన చేసింది. వైరస్ వల్ల పిల్లల ఆరోగ్యానికి తక్కువ ప్రమాదం ఉందని పేర్కొంది. దీనికి తోడు 12 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కలిగే "మార్జిన్ ఆఫ్ బెనిఫిట్" చాలా తక్కువగా ఉంటుందని కమిటీ తేల్చింది. అయితే ఇందుకు ఆధారాల గురించి ప్రశ్నలు ఎదురైన క్రమంలో.. కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధన ప్రాధాన్యం సంతరించుకుంది. గురువారం ప్రచురించిన ఈ అధ్యయన నివేదిక.. ఆరోగ్యకరమైన పిల్లలకు టీకా వల్ల కలిగే ప్రయోజనాలపై అనుమానాలు రేకెత్తిస్తోంది.

కాలిఫోర్నియా యూనివర్సిటీ డాక్టర్ ట్రేసీ హోగ్ నేతృత్వంలోని బృందం ఈ అంశంపై పరిశోధన చేసింది. రెండు డోసుల టీకా తీసుకున్న తరువాత 12-17 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్లో కార్డియాక్ మయోకార్డిటిస్, గుండెలో మంట, ఛాతీ నొప్పి వంటి దుష్ప్రభావాలను ఎదుర్కొన్న వారి సంఖ్యను ఈ బృందం గుర్తించింది. ఆ తరువాత ఈ డేటాను కోవిడ్ -19 కారణంగా హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకోవాల్సి వచ్చిన పిల్లలతో పోల్చారు.

ఇది కూడా చదవండి: Fridge-Free Vaccine: మొక్కలు, బ్యాక్టీరియా నుంచి కోవిడ్ వ్యాక్సిన్​.. దీన్ని ప్రత్యేకత ఏంటో తెలుసా..?

టీకా తీసుకున్న తరువాత 12-15 సంవత్సరాల వయసు గల అబ్బాయిలకు గుండె సమస్యల ప్రమాదం ప్రతి మిలియన్‌కు 162.2గా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఇతర ఏజ్ గ్రూప్‌ల వారితో పోలిస్తే ఇదే అత్యధికం కావడం గమనార్హం. రెండవ అత్యధిక రేటు 16-17 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అబ్బాయిలకు (మిలియన్‌కు 94.0) ఉంది. జాబితాలో ఆ తర్వాత 16-17 ఏళ్ల బాలికలు (మిలియన్‌కు 13.4), 12-15 ఏళ్ల బాలికల (మిలియన్‌కు 13.0) ఏజ్ గ్రూప్ వారు ఉన్నారు. అయితే ఇతర అనారోగ్యాలు లేని అబ్బాయిలకు కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స అవసరమయ్యే ప్రమాదం మిలియన్‌కు 26.7 వరకు మాత్రమే ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అంటే.. వారు గుండె సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఆసుపత్రిలో చేరే ప్రమాదం కంటే 6.1 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు విశ్లేషించారు.

అయితే ఇది కోవిడ్ -19 హాస్పిటలైజేషన్ల ప్రస్తుత రేట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ ఏడాది జనవరి- జూన్ మధ్య టీకా వల్ల పిల్లలు ఎదుర్కొన్న దుష్ప్రభావాల నివేదికలను పరిశోధకులు విశ్లేషించారు. ఫైజర్, మోడర్నా వంటి MRNA వ్యాక్సిన్‌లను అధ్యయనం కోసం పరిగణనలోకి తీసుకున్నారు. ఈ అధ్యయనాన్ని ఇంకా పీర్ రివ్యూ చేయలేదు.
Published by:Sambasiva Reddy
First published:

Tags: After vaccine care, Corona Vaccine, Covid vaccine, Vaccinated for Covid 19

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు