Home /News /life-style /

HEALTH YOUNG BUYERS SHOULD CONSIDER BEFORE GOING FOR A HEALTH INSURANCE POLICY UMG GH

Health Insurance: హలో యూత్.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా..? ఈ పది విషయాలు గుర్తుంచుకోండి..!

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేప్పుడు ఇవి పాటించండి.

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేప్పుడు ఇవి పాటించండి.

హెల్త్ ఇన్సూరెన్స్ (Health Insurance) పాలసీ (Policy) కొనుగోలు సమయంలో యువత (Youth) పరిగణనలోకి తీసుకోవాల్సిన 10 విషయాలను నిపుణులు సూచించారు. అవేంటో చూద్దాం.

మన దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్‌పై కొన్నేళ్లుగా అవగాహన పెరుగుతోంది. గతంలో యువత హెల్త్ పాలసీలపై దృష్టి పెట్టేవారు కాదు. ఇవి కేవలం వృద్ధుల కోసమే అని భావించేవారు. కానీ ప్రస్తుతం యువతరం ఆరోగ్య బీమా పాలసీల ప్రాముఖ్యతను గ్రహించారు. ఇప్పుడు 20, 30 ఏళ్లలోనే చాలామంది పాలసీలను కొనుగోలు చేస్తున్నారు. తీవ్రమైన అనారోగ్యాలు, వైకల్యాలు, వ్యాధులు, మెడికల్ ఎమర్జెన్సీ వంటివి వృద్ధులకు మాత్రమే పరిమితం కాదు. ఎవరైనా, ఎప్పుడైనా వీటి బారిన పడవచ్చు. అలాగే భారతదేశంలో వైద్య ద్రవ్యోల్బణం ఆల్-టైమ్ గరిష్టంగా 8 శాతం మించింది. అందువల్ల మెడికల్ ట్రీట్‌మెంట్ ఖర్చులను తగ్గించుకునే మార్గమైన హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. అయితే హెల్త్ పాలసీ కొనుగోలు సమయంలో యువత పరిగణనలోకి తీసుకోవాల్సిన 10 విషయాలను నిపుణులు సూచించారు. అవేంటో చూద్దాం.



1. అవసరమైన పాలసీ రకం
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో చాలా రకాలు ఉంటాయి. అవసరాలను బట్టి హెల్త్ పాలసీని ఎంచుకోవాలి. మీ కుటుంబాన్ని కూడా కవర్ చేయడానికి ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్ ఎంచుకోవచ్చు.

2. పాలసీ వ్యవధి
1, 2, 3 సంవత్సరాల కవరేజీతో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎంచుకోవచ్చు. పాలసీ అందించే అన్ని ప్రయోజనాలు, నిబంధనలతో సంతృప్తి చెందితే.. ఎక్కువ గడువుతో కవరేజీ అందించే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

3. క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో
క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో (CSR) అనేది ఇన్సూరెన్స్ కంపెనీ విశ్వసనీయతకు సూచిక. ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అందుకున్న మొత్తం క్లెయిమ్‌లలో ఒక సంవత్సరంలో సెటిల్ చేసే క్లెయిమ్‌ల శాతాన్ని ఇది సూచిస్తుంది. క్లెయిమ్ సెటిల్మెంట్ రేట్ 85 శాతం కంటే ఎక్కువగా ఉన్న కంపెనీల నుంచే హెల్త్ పాలసీ తీసుకోవడం మంచిది.

4. నెట్‌వర్క్ హాస్పిటల్స్
పాలసీలో అందించిన నెట్‌వర్క్ ఆసుపత్రుల జాబితాను కచ్చితంగా పరిశీలించాలి. మీకు సమీపంలో, ఉత్తమమైన ఆసుపత్రులు ఈ లిస్ట్‌లో ఉంటే మంచిది. అలాగే క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ పొందగల ఆసుపత్రులను ఈ జాబితాలో చేర్చిన కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

5. క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియ
క్లెయిమ్ సెటిల్‌మెంట్ అనేది కంపెనీ పాలసీదారులకు డబ్బు చెల్లించే ప్రక్రియ. ఆరోగ్య బీమా పాలసీలో క్యాష్‌లెస్ పేమెంట్స్‌, ఖర్చుల రీయింబర్స్‌మెంట్ రెండూ ఉండాలి.

6. పాలసీ ఫీచర్లు
మీ పాలసీలో హాస్పిటలైజేషన్ కవర్, మెటర్నిటీ కవర్, డేకేర్ ప్రొసీజర్‌లు, యాడ్-ఆన్ కవర్ ఆప్షన్‌లు మొదలైన ఫీచర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.

7. రూమ్ రెంట్ క్యాపింగ్/ సబ్ లిమిట్
రూమ్ రెంట్ క్యాపింగ్ లేదా సబ్ లిమిట్ అనేది ఇన్సూరెన్స్ ప్రొవైడర్ భరించే ఆసుపత్రి గది ఖర్చు పరిమితి. ఇది స్థిర మొత్తం కావచ్చు లేదా బీమా మొత్తంలో కొంత శాతం కావచ్చు. ఉదాహరణకు రూ. 1 లక్ష పాలసీకి రూమ్ రెంట్ క్యాపింగ్ రోజుకు 5 శాతం లేదా రూ. 5,000 కావచ్చు. రెంట్ ఈ క్యాపింగ్‌ను మించి ఉంటే, అదనపు ఖర్చులను కంపెనీ భరించదు, ఇతర ఖర్చులలో కొంత శాతం తగ్గింపు కూడా ఉండవచ్చు.

8. నో-క్లెయిమ్-బోనస్
నో-క్లెయిమ్ బోనస్ అనేది పాలసీదారులకు క్లెయిమ్-రహిత సంవత్సరాన్ని కలిగి ఉన్నందుకు ఇచ్చే రివార్డ్. మీ పాలసీకి ఈ ఫీచర్ కచ్చితంగా ఉండాలి. సాధారణంగా 5 శాతం కంటే ఎక్కువ నో-క్లెయిమ్ బోనస్ ఉండటం మంచిది.

9. వెయిటింగ్ పీరియడ్
వెయిటింగ్ పీరియడ్ అనేది నిర్ణీత కాల వ్యవధి తర్వాత పాలసీ అమల్లోకి వస్తుందని నిర్ధారించే గడువు. ఈ గడువు తర్వాతే ఎంపిక చేసిన వ్యాధులకు పాలసీ కింద కవరేజీని పొందుతారు. ఇది సాధారణంగా ముందుగా ఉన్న వ్యాధులు, తీవ్రమైన అనారోగ్యం, ప్రసూతి ప్రయోజనాలు మొదలైన వాటిని కలిగి ఉంటుంది. మీ అవసరాలకు అనుగుణంగా సరైన వెయిటింగ్ పీరియడ్ ఉన్న పాలసీని ఎంచుకోండి.

10. పాలసీ ప్రీమియం
ఆరోగ్య బీమా ఖర్చులకు ప్లాన్, బడ్జెట్ చేయడం ముఖ్యం. మీ బడ్జెట్‌కు సరిగ్గా సరిపోయే పాలసీని ఎంచుకోండి. అయితే ఎక్కువ కవరేజీ కోసం ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
Published by:Mahesh
First published:

Tags: Health benefits

తదుపరి వార్తలు