హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

ఉదయాన్నే ఈ యోగ ట్రై చేయండి... బాబా రాందేవ్ సలహా

ఉదయాన్నే ఈ యోగ ట్రై చేయండి... బాబా రాందేవ్ సలహా

బాబా రాందేవ్ (Image : Twitter - baba Ramdev)

బాబా రాందేవ్ (Image : Twitter - baba Ramdev)

Baba Ramdev 2 Minutes Yoga : యోగా గురు బాబా రాందేవ్... బిజీగా ఉండే ప్రజలకు రెండు నిమిషాల యోగాను పరిచయం చేస్తున్నారు.

Konasana : యోగాసనాల్లో ప్రత్యేకమైనది కోనాసనం. ఇందులో... రెండు చేతులనూ... రెండు కాళ్ల పాదాలూ తాకేలా చేస్తారు. దీని వల్ల కాళ్లు, ఊపిరితిత్తులు, నడుము, చేతులు, శరీర కింది భాగాల కండరాలు పటిష్టం అవుతాయి. శరీర బద్ధకాన్ని వదిలించుకోవాలంటే ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఉదయాన్నే లేవగానే... ఓ రెండు నిమిషాలపాటూ కోనాసనం చెయ్యమని దేశ ప్రజలకు సూచించారు యోగా గురు బాబా రాందేవ్. ఈ ఆసనం ఎలా చెయ్యాలో... పూర్తి వివరాలతో ఆయన ఓ వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియోని చూసి... ప్రజలు కూడా అదే విధంగా ఈ ఆసనం చెయ్యమని కోరారు. ఇప్పుడీ వీడియో వైరల్ అయ్యింది. చాలా మంది దీన్ని షేర్ చేసుకుంటున్నారు.

పొట్ట ఎక్కువగా ఉన్నవారు... మొదట్లో చేతులతో... కాళ్ల పాదాలను అందుకోలేరు... ఐతే... క్రమంగా ఈ ఆసనాన్ని రోజూ చేస్తూ ఉంటే... కొన్నాళ్లకు పొట్ట తగ్గి... కాళ్ల పాదాలను... చేతులు టచ్ చెయ్యగలవు. చాలా మందికి ఇలాంటి ఆసనం తెలిసినదే అయినప్పటికీ... కొద్ది మంది మాత్రమే దీన్ని పాటిస్తుండటంతో... దీనివల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉండటంతో... దీన్ని మరోసారి గుర్తుచేశారు రాందేవ్.

2 నిమిషాల్లో చేయగలిగిన మరో యోగాను బాబా రాందేవ్ చేసిచూపారు. ఇక్కడ చూడండి.

Published by:Krishna Kumar N
First published:

Tags: Baba Ramdev, Health benifits, Health Tips, Life Style, Yoga

ఉత్తమ కథలు