Home /News /life-style /

HEALTH YOGA FOR ELDERLY 5 EASY YOGA ASANA ELDERLY CAN PERFORM DAILY GH VB

Yoga for Elderly: వృద్ధులు సైతం సులభంగా వేయగల 5 యోగాసనాలు.. ఏ ఆసనం ఎలా ఉంటుందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పెరుగుతున్న వయస్సుతో ఎముకలు బలహీనపడతాయి. దీంతో వృద్ధులు అన్ని రకాల యోగాసనాలు ప్రయత్నించలేరు. అయితే వృద్దాప్యంలో ఉన్న వారు కూడా సులభంగా వేయగలిగే ఆసనాలు కొన్ని ఉన్నాయి. అవేవో తెలుసుకుందాం.

మీ శరీరాన్ని, మనస్సును ఉత్తేజంగా ఉంచుకోవడానికి యోగా ఉత్తమమైన వ్యాయామం. ఇది శ్వాస తీసుకోవడానికి, ఇంద్రియాలను శాంతపరచడానికి ఉపయోగకరంగా ఉంటుంది. యోగా (Yoga) అనేది ఒత్తిడిని తగ్గిస్తుంది. మీకు సానుకూల శక్తి ప్రవాహానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. అయినప్పటికీ, యోగా ఆసనాలకు ఎముకల బలం అవసరం. పెరుగుతున్న వయస్సుతో ఎముకలు(Bones) బలహీనపడతాయి. దీంతో వృద్ధులు అన్ని రకాల యోగాసనాలు ప్రయత్నించలేరు. అయితే వృద్దాప్యంలో ఉన్న వారు కూడా సులభంగా వేయగలిగే ఆసనాలు కొన్ని ఉన్నాయి. అవేవో తెలుసుకుందాం.

వృక్షాసనం..
చెట్టు భంగిమగా ప్రసిద్ధి చెందిన వృక్షాసనం కాలు, పొత్తికడుపుకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది వృద్ధుల్లో సమతుల్యత, ఏకాగ్రతను పెంచుతుంది. నిటారుగా నిలబడి, మీ ఒక పాదాన్ని మీ మరొక పాదం లోపలి తొడపై ఉంచండి. ఇప్పుడు, మీ రెండు చేతులు జోడించి నమస్తే పెట్టండి. కనీసం 60 సెకన్ల పాటు ఈ స్థితిలో నిలబడండి.

Zodiac Signs: వెన్నుపోటు పొడిచే లక్షణాలు ఉండే రాశుల వారు వీరే.. మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..


సలంబ భుజంగాసనం..
మీ ఛాతీ, ఊపిరితిత్తులు, వీపు భాగాన్ని తెరవడంలో సలంబ భుజంగాసనం సహాయపడుతుంది. ఇది కోబ్రా భంగిమ వంటిది. యోగా మ్యాట్ తీసుకుని, దాని మీద వెనక్కి తిరిగి ​​పడుకోండి. ఇప్పుడు, నెమ్మదిగా మీ ముందు శరీరాన్ని పైకి లేపి, మీ చేతులను ముందుకు తీసుకురండి. ఇప్పుడు, మీ మోచేతులను వంచి, నేలపై మీ అరచేతులు చాపండి. మీ రెండు చేతులు ఎల్​ ఆకారంలో, మీ వీపును ఒక ఆర్క్‌ ఆకారంలో ఉండేలా చూసుకోండి. ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు ఆ స్థానంలో అలాగే ఉండండి. విశ్రాంతి స్థితిలోకి తిరిగి వెళ్లండి. మీరు ఈ ఆసనాన్ని రోజుకు రెండు లేదా మూడుసార్లు పునరావృతం చేయండి.

బద్ధ కోనాసనం..
ఈ ఆసనాన్ని చెప్పులు కుట్టేవారి భంగిమ అని కూడా అంటారు. దీనిలో మీ వీపును నిటారుగా ఉంచి కూర్చోవాలి. ఇప్పుడు, మీ మోకాళ్లను రెండు పాదాల అరికాళ్లు ఒకదానికొకటి తాకే విధంగా వంచాలి. మోకాళ్లు ఎగువ శరీరం వెలుపల విస్తరింపజేయాలి. దీనిని సీతాకోకచిలుక స్థానం అని కూడా పిలుస్తారు. ఈ ఆసనం వృద్ధులకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది వారి తుంటిని యాక్టివేట్​ చేస్తుంది. తద్వారా వెన్నునొప్పిని తగ్గిస్తుంది.

శవాసనం..
శవాసనం అన్ని భంగిమల కంటే సులభంగా ఉంటుంది. ఈ ఆసనం విశ్రాంతి తీసుకునేందుకు అనువుగా ఉంటుంది. నేలపై మీ వెనుకభాగంలో నేరుగా పడుకోండి. మీరు పడుకున్నప్పుడు మీ కండరాలను రిలాక్స్ చేయండి. ఆ తర్వాత ఊపిరి పీల్చుకోండి. ఈ ఆసనం నాడీ వ్యవస్థను సడలించడంలో సహాయపడుతుంది. శరీరానికి మరియు మనస్సుకు శాంతిని చేకూర్చుతుంది.

ఇది కూడా చదవండి:  వాలెంటైన్స్ డేను ఇలా ప్రత్యేకంగా చేసుకోండి..


తడాసనం..
మీ పాదాలను దగ్గరగా ఉంచి పర్వత భంగిమలో తడాసనం ప్రయత్నించండి. మీ హిప్- వెడల్పుగా సమాంతరంగా ఉంచండి. మీ చేతులను మీ వైపుకు నేరుగా చాపండి. ఇప్పుడు, మీ కాలి వేళ్లను విస్తరించండి. కాలి వేళ్లను నేలపై నొక్కండి. మీ శరీర బరువును మీ రెండు పాదాల మధ్య సమానంగా విస్తరించండి. క్రమం తప్పకుండా ప్రతి రోజూ తడాసనం ప్రయత్నిస్తే మీ వెన్నునొప్పి నయం అవుతుంది.
Published by:Veera Babu
First published:

Tags: Exercises, Life Style, Yoga

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు