worm living in stomach: మనిషి కడుపులో జీవిస్తున్న పురుగు.. షాక్​ అయిన డాక్టర్లు, ఎక్కడంటే..

కడుపులో తిరుగుతున్న పురుగు (ఫొటో ట్విటర్​)

సాధారణంగా పురుగులు(insects) ఎక్కడ జీవిస్తాయి. అడవిలోనూ.. చెట్లమీద..ఇలా ఎక్కపడితే అక్కడ... అయితే ఒక పురుగు మాత్రం మనిషి కడుపు(stomach)లోనే జీవిస్తుందటండోయ్​.. అబ్బా.. అదెట్లా అంటారా? అవును ఓ వ్యక్తి కడుపులో పురుగు తిరుగుతోందట. ఆ పురుగును చూసి ఏకంగా వైద్యులే కంగారుపడిపోయారంటే మాటలా..

  • Share this:
    సాధారణంగా పురుగులు(worm) ఎక్కడ జీవిస్తాయి(living). అడవిలోనూ.. చెట్లమీద..ఇలా ఎక్కపడితే అక్కడ... అయితే ఒక పురుగు మాత్రం మనిషి కడుపు(stomach)లోనే జీవిస్తుందటండోయ్​.. అబ్బా.. అదెట్లా అంటారా? అవును ఓ వ్యక్తి కడుపులో పురుగు తిరుగుతోందట. ఆ పురుగును చూసి ఏకంగా వైద్యులే కంగారుపడిపోయారంటే మాటలా.. ఈ విషయం ఇంతకీ ఎవరి కడుపులో ఉంది. ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం.. మనకు కడుపు నొప్పి వస్తే ఓ ట్యాబ్లెట్​ వేసుకొని పడుకుంటాం. మరీ ఎక్కువైతే వైద్యుల(doctors) దగ్గరికి వెళతాం. యూకేలో అలాగే వెళ్లిన ఓ వ్యక్తికి స్కానింగ్​చేయగా కడుపులో పురుగు(lady bug) కనిపించిందట. మొదటగా కణతి కావచ్చని కొలొనోస్కోపీ స్కానింగ్‌ చేశారట డాక్టర్లు. అయితే సజీవంగా ఉన్న ఓ పురుగు బయటపడింది. ఇక ఆ రిపోర్టు(report)లను చూసి డాక్టర్లు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అసలు అది కడుపులోకి ఎలా వెళ్లి ఉండొచ్చునని ఆశ్చర్యపోయారు(shock).! చాలా జాగ్రత్తలు తీసుకుని సుమారు రెండు గంటల ఆపరేషన్(operation) అనంతరం ఆ పురుగు(worm)ను అతడి కడుపు నుంచి డాక్టర్లు బయటికి తీశారు.



    గతంలోనూ ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కడుపులో నుంచి డాక్టర్లు ఏకంగా 59 అడుగుల టేప్ వర్మ్(ఆంత్రపరాన్న పురుగు)ను వెలికి తీశారు. దీని పొడవు చూసి తొలుత డాక్టర్లే షాకయ్యారు. ఈ ఘటన థాయ్‌ల్యాండ్‌లో చోటు చేసుకుంది. నాంగ్ ఖాయ్ ప్రావిన్స్‌లోని ఓ ఆసుపత్రికి ఓ 67 ఏళ్ల వృద్ధుడు కడుపు నొప్పితో బాధపడుతూ వచ్చాడు. డాక్టర్లు అతడి మలాన్ని సేకరించి పరీక్షల కోసం పంపించారు. ఆ పరీక్షల్లో అతడు టేప్ వర్మ్ సమస్యతో బాధపడుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. అతడి మలంలో దాదాపు 28 గుడ్లను సైతం గుర్తించారు. డాక్టర్లు అతడికి నులిపురుగులను పోగొట్టే మందును ఇచ్చారు. దీంతో అతడి మలద్వారం గుండా ఈ టేప్ వర్మ్ బయటకొచ్చింది.  మొదట ఏదో చిన్నదిగా ఉంటుందని బయటకు లాగారు. అయితే లాగే కొద్దీ వస్తుండటంతో డాక్టర్లకు మతిపోయింది. చివరకు మొత్తంగా 18 మీటర్లు(59 అడుగులు) పొడవున్న టేప్ వర్మ్‌ను అతడి మలద్వారం గుండా బయటకు తీశారు. ఈ విషయాన్ని ఆ ఆసుపత్రిలోని పారాసైటిక్ డిసీజ్ రీసెర్చ్ సెంటర్ సిబ్బంది వెల్లడించారు. ముక్కలుముక్కులుగా ఆ పురుగును బయటకు తీశామని, మొత్తం తీసిన తర్వాత దాని పొడవును కొలిస్తే ఏకంగా 59 అడుగులున్నట్లు తేలిందని తెలిపారు.
    Published by:Prabhakar Vaddi
    First published: