దోమలకూ ఓ రోజు ఉంది.. నేడు ప్రపంచ దోమల దినోత్సవం..

World Mosquito Day: దోమల కట్టడికి ఏటా ఓ రోజున ప్రపంచ దోమల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారన్న విషయం మీకు తెలుసా.. ఆ రోజే ‘ఆగస్టు 20’.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 20, 2019, 1:43 PM IST
దోమలకూ ఓ రోజు ఉంది.. నేడు ప్రపంచ దోమల దినోత్సవం..
ప్రతీకాత్మక చిత్రం
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 20, 2019, 1:43 PM IST
దోమ.. పేరులాగే చిన్నగా ఉంటుంది. కానీ, అది వేసే కాటుతో ఏటా లక్షలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఆడ దోమ కుట్టి మలేరియా వ్యాధికి కారకురాలై.. ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. వానాకాలం వస్తే చాలు.. విజృంభిస్తూ మనుషుల ప్రాణాలు తోడేస్తోంది. ఎన్ని రకాల కాయిల్స్‌, మందులు వాడినా, చివరికి దోమ తెరలు కట్టుకున్నా ప్రయోజనం ఉండటం లేదంటేనే అర్థం చేసుకోవచ్చు.. పరిస్థితి ఎలా ఉందో. అయితే, ఇక్కడో విషయం చెప్పుకోవాలి. వీటి కట్టడికి ఏటా ఓ రోజున ప్రపంచ దోమల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారన్న విషయం మీకు తెలుసా.. ఆ రోజే ‘ఆగస్టు 20’. దోమల నివారణకు ప్రభుత్వ చర్యలేకాక, ప్రతి ఒక్కరూ తమ చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, మురుగునీరు నిల్వ లేకుండా జాగ్రత్త పడాలి. వీటి కట్టడి కోసమే ఈ రోజును ఏటా నిర్వహఇస్తున్నారు.

అసలు ఆగస్టు 20నే ఎందుకంటే.. మలేరియా ఆడ అనాఫలిస్‌ దోమ కుట్టడంతో వ్యాపిస్తుంది. మల, అరియా అనే రెండు ఇటాలియన్‌ పదాల కలయికతో మలేరియా అనే పదం పుట్టింది. దీనికి చెడ్డగాలి అనే అర్థం వస్తుంది. మలేరియా పరాన్నజీవి జీవిత చక్రాన్ని సర్‌ రోనాల్డ్‌ రాస్‌ అనే శాస్త్రవేత్త ఈ రోజునే కనుగొన్నారు. దీంతో ఆయనకు 1902లో నోబెల్‌ బహుమతి లభించింది.

రోనాల్డ్‌రాస్.. మలేరియా పరాన్న జీవికి ప్లాస్మోడియం అని పేరు పెట్టారు. దోమ మనిషిని కుట్టినపుడు మలేరియా పరాన్నజీవి మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ క్రిమి స్పోరో జాయిట్స్‌గా మారుతుంది. అవి మీరో జాయిట్స్‌గా మారి కాలేయం, ఎర్రరక్త కణాలలోకి ప్రవేశిస్తాయి. మీరోజాయిట్స్‌ దశలో మలేరియా వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.

First published: August 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...