Diabetes : ప్రపంచంలో చాలా మంది డయాబెటిస్తో బాధపడుతున్నారు. ముందుగానే లక్షణాలను గుర్తించి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటిస్‌ను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కార్బోహైడ్రేట్స్‌ను శరీరం విచ్చిన్నం చేయలేని స్థితిలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. ఈ కండీషన్‌ను ప్రీడయాబెటిస్ (టైప్ 2 డయాబెటిస్) అంటారు. కానీ చికిత్స తీసుకొనే స్థాయిలో దీని లక్షణాలు ఉండవు. తరచుగా మూత్రవిసర్జన, బరువు తగ్గడం, ఆకలి పెరగడం, పాదాలు లేదా చేతుల్లో ఆకస్మిక తిమ్మిరి వంటివి ప్రీడయాబెటిస్ లక్షణాలు. దీనికి ప్రారంభంలోనే చెక్ పెట్టి, ప్రీడయాబెటిస్‌ను రివర్స్ చేసే పద్ధతులు ఆయుర్వేదంలో ఉన్నాయి.
ఆయుర్వేదం ప్రకారం, ఇష్టానుసారంగా తినడమే డయాబెటిస్‌కు ప్రధాన కారణమని చెబుతుంటారు. ఆయుర్వేద భాషలో ఇది అగ్ని లేదా డైజెస్టివ్ ఫైర్ వల్ల కలుగుతుంది. అన్ని ఇతర జబ్బుల లాగానే, డయాబెటిస్‌ని కూడా జీవన విధానంలో కొన్ని మార్పులు తీసుకురావడం వల్ల నివారించవచ్చు. నవంబర్ 14న వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా, ఈ సమ్యస్యను ఆదిలోనే అంతం చేసే మార్గాలు ఏవో తెలుసుకుందాం.
ప్రెగ్నెన్సీ సమయంలో ఏ విటమిన్స్ ఎలా తీసుకోవాలి? గర్భిణీలు తప్పక తెలుసుకోండి
ఆయుర్వేద మూలికలతో ఫలితం
చాలా రకాల ఆయుర్వేద మూలికలు డయాబెటిస్‌ను నియంత్రిస్తాయి. పసుపు, ఉసిరి, మెంతి గింజలను ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. హై బ్లడ్ షుగర్‌ను నియంత్రిండంలో నిషా అమల్కి కషాయం ఉత్తమంగా పని చేస్తుంది. ఈ కషాయాన్ని ఉసిరి పొడి, పసుపు పొడిని సమానంగా తీసుకొని తయారుచేస్తారు. దీనిని ప్రతిరోజూ తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అదే విధంగా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉసిరి, జామున్, కరేలా మిశ్రమంతో తయారుచేసిన అనేక జ్యూస్‌లు మంచి ఫలితాలను అందిస్తాయి. వీటిలో షుగర్ లేకుండా చూసుకోవాలి.
నేచురల్ షుగర్స్
చాలా మంది వినియోగిస్తున్న వైట్ షుగర్‌లో ఎలాంటి పోషక విలువలూ, క్యాలరీలూ ఉండవు. దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ కలగదు. అందుకే పండ్లు, బెల్లం లేదా తేనె వంటి నేచురల్ షుగర్‌ను వినియోగించాలి. ప్రీడయాబెటిస్‌ను అవి నివారించగలవు.
Heart Attack : చలికాలంలో హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం.. వీరు ఎక్కువ జాగ్రత్త పడాలి
వేళకు తిండి, నిద్ర
ప్రతి పూటా ఆహారం తీసుకోవడానికి మధ్య కనీసం 3 గంటల సమయం ఉండాలి. వేళకు తిని, కనీసం 7 గంటలు నిద్రపోతే ఆరోగ్యం బాగుంటుంది. ఇలా చేస్తే శారీరక, మానసిక ఒత్తిడి దూరమవుతుంది. రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. హార్మోన్ల సమస్యలు కూడా దూరమవుతాయి. మంచి అలవాట్లను అనుసరిస్తే శరీరం ఫిట్‌గా ఉంటుంది.
వ్యాయామం
రోజూ వ్యాయామం చేయడం ఎవరికైనా చాలా మంచిది. వ్యాయామం ద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది, బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. యోగా, ప్రాణాయామం కూడా జీవక్రియను మెరుగుపరచడానికి, ప్యాంక్రియాస్ సజావుగా పని చేయడానికి తోడ్పడతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ayurveda health tips, Diabetes, Health, Lifestyle