హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

World Arthritis Day: కీళ్లను ప్రభావితం చేసే నొప్పుల గురించి తెలుసుకోండి...

World Arthritis Day: కీళ్లను ప్రభావితం చేసే నొప్పుల గురించి తెలుసుకోండి...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అర్థరైటిస్‌ బారిన పడిన వారిలో జ్వరం, లింఫ్‌ గ్రంధుల వాపు, బరువు తగ్గడం, చేతిని కదిలించడంలో ఇబ్బంది, నడవలేకపోవడం, నిద్ర సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అర్థరైటిస్‌లో 100కు పైగా రకాలున్నాయి.

అర్థరైటిస్‌ అంటే కీళ్లలో వచ్చే వాపుతో కూడిన నొప్పి. ఇది ఒక కీలును లేదా అనేక కీళ్లను ప్రభావితం చేస్తుంది. మనిషి కదలికలను ప్రభావితం చేసి పనులు చేయకుండా చేసే ఈ పరిస్థితిని ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఎదుర్కొంటున్నారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఇది ఏకంగా మీ శారీరక కదలికలను కట్టడి చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమస్యలపై అవగాహన పెంచేందుకు ఏటా అక్టోబర్‌ 12న ‘ప్రపంచ అర్థరైటిస్‌ డే’ (World Arthirits Day)ను నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం “డోంట్‌ డిలే, కనెక్ట్‌ టూడే” అనే థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ కేర్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. అర్థరైటిస్‌ బారిన పడిన వారిలో జ్వరం, లింఫ్‌ గ్రంధుల వాపు, బరువు తగ్గడం, చేతిని కదిలించడంలో ఇబ్బంది, నడవలేకపోవడం, నిద్ర సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అర్థరైటిస్‌లో 100కు పైగా రకాలున్నాయి. వాటికి రకరకాల కారణాలు, వేర్వేరు చికిత్సలు ఉన్నాయి. వీటిలో అతి సాధారణమైనవి ఆస్టియో అర్థరైటిస్‌ (ఓఏ), రుమటైడ్ అర్థరైటిస్‌ (ఆర్‌ఏ) అనే రకాలు. ఆర్థరైటిస్‌ను కొన్ని లక్షణాలతో సులభంగా గుర్తించవచ్చు.

Weight loss tips: ఈ 4 రకాల ఫ్లోర్స్‌తో ఈజీగా బరువు తగ్గవచ్చు!


కీళ్ల నొప్పి, కీళ్లు గట్టిబారడంతో పాటు వాపు రావడం, కదలికలు తగ్గడం, కీళ్ల చుట్టు ఉండే చర్మం ఎర్రబారడం, జ్వరంతో పాటు తీవ్రమైన నొప్పి వంటివి సాధారణ లక్షణాలు. కీళ్ల నొప్పుల కారణంగా కొందరు రోజువారీ పనులు చేసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ కీళ్ల నొప్పులను పెయిన్‌ కిల్లర్స్‌ తగ్గించలేవు.

ఆస్టియో అర్థరైటిస్‌ సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వారికి వస్తుంది. మృదులాస్థి క్రమంగా తరిగిపోవడం వల్ల నొప్పి లేదా వాపుతో కూడిన కీళ్ల నొప్పి వస్తుంది. శరీరంలో ఏ భాగమైనా ఆస్టియో అర్థరైటిస్‌ బారిన పడవచ్చు. ఆస్టియో అర్థరైటిస్‌ అనేది నిదానంగా వ్యాపిస్తుంది కాబట్టి ప్రారంభంలో చాలా మందిలో అంత ప్రభావం ఉండదు.

రుమటైడ్‌ అర్థరైటిస్‌ అనేది ఏ వయస్సు వారికైనా రావచ్చు. 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వారిలో ఎక్కువ కనిపిస్తుంది. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఇది మూడు రెట్లు అధికంగా ఉంటుంది. దీని కారణంగా కీళ్ల నొప్పులు, గట్టిబారడం, కీళ్ల వాపు వంటివి ఎదురవుతాయి. ఈ లక్షణాలు నిదానంగా ఏర్పడవచ్చు లేదా హఠాత్తుగా కూడా ఏర్పడవచ్చు. కొన్ని రకాల రుమటైడ్‌ పరిస్థితులు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ, అంతర్గత అవయవాలనూ ప్రభావితం చేస్తాయి. పిల్లల్లో అంటే 12-18 ఏళ్ల లోపు వారిలో వచ్చే అర్థరైటిస్‌ను రూమాటాయిడ్‌ అర్థరైటిస్‌ అంటారు.

Beauty tips: వయసు మీద పడే కొద్దీ ముఖంపై ముడతలు వస్తున్నాయా? తగ్గించుకోవడానికి ఇలా చేయండి..


అధిక బరువు, ఊబకాయం ఉన్నవారికి అర్థరైటిస్‌ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. బరువు ఎంత పెరిగితే వీపు, వెన్ను, పాదాలపై అంత భారం పడుతుంది. చక్కెర, మైదా వంటి బాగా ప్రాసెస్‌ చేసిన ఆహర పదార్థాల తీసుకుంటే బరువు పెరుగుతూ ఉంటారు. వాటి స్థానంలో పండ్లు, హోల్‌ గ్రెయిన్స్, నట్స్ తీసుకోవడం మంచిది.

ఫోన్‌ను ఒకే రీతిలో పట్టుకొని తరచూ టెక్ట్సింగ్‌ చేయడం వల్ల స్మార్ట్‌ఫోన్‌ థంబ్‌ ఏర్పడుతుంది. దీని వల్ల చేతులు, ముఖ్యంగా బొటనవేలిపై ఒత్తిడి పెరుగుతుంది. అర్థరైటిస్‌ను దూరం పెట్టాలంటే టెక్ట్సింగ్‌ తగ్గించండి లేదా వాయిస్‌ ఫంక్షన్‌ ఉపయోగించండి.

మహిళల విషయంలో హై హీల్స్‌ కారణంగా కీళ్లు, కండరాలపై ఒత్తిడి పెరిగి అవి కదలవచ్చు. హై హీల్స్‌ రోజు ధరించే మహిళల్లో అస్టియో అర్థరైటిస్‌, పాదాల నొప్పి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. యుక్తవయస్సులో మోకాలికి గాయాలు కూడా రిస్క్‌ ఫ్యాక్టర్స్‌గా పనిచేస్తాయి.

ఫిజికల్‌ థెరపీ, వ్యాయామం, మందుల ద్వారా అర్థరైటిస్‌ తగ్గించుకోవచ్చు. ఆయుర్వేద మందలు, ఔషధ తైలాలతో మసాజ్‌, హోమియోపతి మందులు ప్రారంభ దశలో కొంత మందికి ఉపశమనం అందిస్తాయి.

సర్జరీపరంగా చూస్తే ఆర్థోస్కోపి, సినోవెక్టమీ, ఆస్టియోటమి, టోటల్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ ఉన్నాయి. మొదటి మూడు కేవలం ఉపశమనం మాత్రమే అందించగలవు, సంపూర్ణ చికిత్స అంటే జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ మాత్రమే.

జీవనశైలిలో చేసుకోవాల్సిన ముఖ్యమైన మార్పులు:

కొన్ని రకాల జీవనశైలి మార్పులతో ఈ సమస్యను అదుపు చేయవచ్చు. మితంగా తినడం, బరువు నియంత్రణలో ఉంచుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.. వంటివన్నీ కీళ్ల సమస్యలను దూరంగా ఉంచే మంత్రాలు. దీంతోపాటు ఆరోగ్యకరమైన బరువు ఉండటం, గాయాల బారిన పడకుండా చూసుకోవడం, కూర్చునే భంగిమపై శ్రద్ధ చూపడం, హై హీల్స్ పక్కన పెట్టడం.. వంటివి పాటించాలి. ఆహారంలో వాల్‌ నట్స్, జీడిపప్పు, పిస్తా పప్పు వంటివి ఉండేలా చూసుకోవాలి. వెల్లుల్లి, ఉల్లి సహా ఆహారంలో ఎక్కువ కూరగాయలు ఉండాలి. జొన్న, రాగులు, సజ్జ రొట్టెలు తినాలి. అర్థరైటిస్‌ బారిన పడిన కీళ్లకు ఇవి ఎంతో మంచివి, నొప్పిని తగ్గించే పోషకాలు ఇందులో ఉంటాయి.

First published:

Tags: Lifestyle

ఉత్తమ కథలు